E-Paper
Advertisement

ఫోక్ ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తే ఊరుకోం!.. ఈశ్వర్ సాయి-మాధురి రాధోడ్ లపై మండిపడ్డ జాను లిరి!

ఫోక్ ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తే ఊరుకోం!.. ఈశ్వర్ సాయి-మాధురి రాధోడ్ లపై మండిపడ్డ జాను లిరి!
Advertisement

Eshwar Sai Madhuri Rathod Controversy: ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ల వివాదం మరింత ముదిరిపోతుంది.ఇక వీరి వ్యవహారంతో ఏకంగా ఫోక్ ఇండస్ట్రీపైనే అవమానించే రీతిలో విమర్శలు వస్తుండటంతో జానపద కళాకారులు మీడియా ముందుకు వచ్చారు.ఇందులో భాగంగానే ప్రముఖ ఫోక్ డాన్సర్ జాను లిరి వారిపై మండిపడ్డారు.

వీరిద్దరి కారణంగానే మొత్తం ఫోక్ ఇండస్ట్రీనే బ్లేమ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తుల వ్యక్తిగత గొడవల వల్ల ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పుగా చూడటం సరైనది కాదని,ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ మధ్య జరిగిన విషయాలు పూర్తిగా వారి పర్సనల్ గొడవలకు సంబంధించినవి మాత్రమేనని, వాటితో జానపద రంగానికి ఎటువంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టేశారు జాను లిరి.

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ల సంఘటన కారణంగా

Advertisement

ఈ మధ్య జరిగిన ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ల సంఘటన కారణంగా ఫోక్ ఇండస్ట్రీలో మొత్తం కాస్టింగ్ కౌచ్ ఉందనేలా, కాంప్రమైజ్ అయితేనే అవకాశాలు వస్తాయనేలా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయని, కానీ అది ఎంతమాత్రం నిజం కాదని ఆమె వివరణ ఇచ్చారు. తెలంగాణ జానపద పాటలు ఇప్పుడిప్పుడే వెండితెరపై, పెద్ద సినిమాల్లో కనిపిస్తూ మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయని,ఇలాంటి సమయంలో ఇటువంటి వివాదాలు పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆమె ఆందోళన చెందారు.

also read :ఈశ్వర్ సాయి వైఫ్ కామెంట్స్‌పై శేఖర్ వైరస్ సంచలన వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పకపోతే అంతే!

ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు 

Advertisement

ముఖ్యంగా రూరల్, విలేజ్ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ మూలల నుంచి ఎంతోమంది ప్రతిభావంతులైన డ్యాన్సర్లు, సింగర్లు, రైటర్లు ఈ రంగానికి రావాలని ,తమ ప్రతిభని చూపెట్టాలని కలలు కంటుంటారని తెలిపారు,ఇక చాలా మంది తల్లి దండ్రులు ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ అయి తమ పిల్లలకు అవకాశాలు ఇవ్వాలని కోరుతుంటారని జాను గుర్తుచేసుకున్నారు.

అయితే, ఇలాంటి నెగెటివ్ వార్తలు, ట్రోల్స్ చూసి కొత్తగా రావాలనుకునే ప్రతిభావంతుల తల్లిదండ్రులు భయపడే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. ఒకరిద్దరు చేసుకున్న తప్పుల వల్ల మొత్తం ఫోక్ రంగాన్ని బ్లేమ్ చేయకండి అని, మీ పిల్లలకు మంచి టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఆదరణ లభిస్తుంది, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆమె తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.

also read :“నువ్వు ప*డుకోకుండా ఎదిగావా?”.. జాను లిరి వ్యాఖ్యలపై ఫోక్ వరలక్ష్మి ఫైర్!

ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు

తెలంగాణ జానపదాల విషయానికి వస్తే ‘బుల్లెట్టు బండి’, ‘రాను రాను బాబాయికి’, ‘తిన్నతీరం పడుతలే’ , ‘బాసింగ బలాలు’, ‘సిల్క్ చీర’, ‘మోత మోగిపోవాల్సిందే’ లాంటి జానపద గీతాలు యూట్యూబ్‌ను మిలియన్ల కొద్ది వ్యూస్ తో ఎలా షేక్ చేశాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.అంతేకాకుండా సినిమాల్లో కూడా జానపదాలు ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాయి.అలాంటి ఫోక్ ఇండస్ట్రీని కొందరి పర్సనల్ గొడవల వల్ల కించపరచవద్దని జాను లిరి విజ్ఞప్తి చేశారు.

కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై

చివరగా, సోషల్ మీడియాలో అనవసరంగా ఫోక్ ఇండస్ట్రీపై అవాకులు చవాకులు పేలే ట్రోలర్స్‌పై జాను లిరి ఘాటుగా స్పందించారు. ఎవరైనా హద్దులు దాటి నెగెటివిటీని ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని, చట్టపరంగా మరియు పరిశ్రమపరంగా తగిన సమాధానం చెప్తామని వార్నింగ్ ఇచ్చారు. వ్యక్తిగత కక్షలు, ప్రైవేట్ ఇష్యూలను ఇండస్ట్రీకి ముడిపెట్టకుండా చూడాలని, తెలంగాణ జానపద రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు.

also read :తమ్ముడి విష్.. అన్నయ్య ఎమోషనల్ రిప్లై.. మెగా ఫ్యాన్స్‌కి పూనకాలే!

మొత్తంగా ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ల వివాదం మొత్తం ఫోక్ రంగానికే మాయని మచ్చలా నిలించిందని వీళ్ళ ఆవేదన చూస్తేనే అర్థమవుతుంది !

Tags

Related News

ఫైనాన్షియల్ గొడవలా? పెళ్లి మేటరా?.. రీతూ చౌదరి ఇష్యూపై నోరు విప్పిన డెమోన్ పవన్!

ప్రియాంక జైన్ సీరియల్స్ ఎందుకు మానేసిందో తెలుసా?

బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!

పండును ఈ పరిస్థితుల్లో చూస్తే కన్నీళ్లు ఆగవు.. మళ్లీ డ్యాన్స్ చేయగలడా? రికవరీకి ఎంత టైమ్?

బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లిస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Nindu Noorella Saavasam Serial Today Episode October 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి, పార్థును చంపకుండా అమర్ అడ్డుకుంటాడా..? 

Big Stories

Advertisement
×