E-Paper
Advertisement

పుట్టగానే ఆసుపత్రిలోనే బిడ్డను వదిలేసి వెళ్ళే తల్లి… గుండెను బరువెక్కించే ఈ ఎమోషనల్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

పుట్టగానే ఆసుపత్రిలోనే బిడ్డను వదిలేసి వెళ్ళే తల్లి… గుండెను బరువెక్కించే ఈ ఎమోషనల్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్
Advertisement

Tamil Emotional Drama: కొన్ని సినిమాలు పెద్ద యాక్షన్ సీన్లు, భారీ ట్విస్టులతో ఆకట్టుకుంటాయి. మరికొన్ని మాత్రం మనకు తెలిసిన జీవితాన్నే తెరపై చూపించి మనసును తాకుతాయి. ‘దాదా’ (Dada) కూడా అలాంటి సినిమానే. కాలేజీ వయసులో ప్రేమ, అనుకోని గర్భం, బాధ్యత లేకుండా తీసుకున్న నిర్ణయాలు… ఆ తర్వాత చేతిలో పసిబిడ్డతో ఒంటరి తండ్రిగా మారిన ఓ యువకుడి జీవితం ఎలా మారిపోయిందనే కథ ఇది. మరి అసలు మణి జీవితాన్ని మార్చేసిన పరిస్థితులు ఏంటి? అతని నుంచి కొడుకును దూరం చేసిన అసలు నిజం ఏంటి? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథలోకి వెళ్తే…

మణి, సింధు కాలేజీలో చదువుకుంటూ ప్రేమలో పడతారు. కట్ చేస్తే… ఇద్దరూ పెళ్లికి ముందే తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న విషయం తెలుస్తుంది. సింధు అబార్షన్‌కు ఒప్పుకోదు. దీంతో ఇద్దరూ ఇళ్లను వదిలి బయటకు వచ్చి కలిసి జీవించడం మొదలుపెడతారు. కానీ మణికి అప్పటికీ జీవితంపై పెద్దగా బాధ్యత ఉండదు. ఉద్యోగం చేస్తున్నా తాగుడుకు అలవాటు పడతాడు. సింధిని పట్టించుకోడు. పరిస్థితులు మరింత దిగజారుతాయి. చివరికి సింధు ఓ మగబిడ్డకు జన్మనిస్తుంది.

Advertisement

మణి ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె ఆస్పత్రి నుంచి వెళ్లిపోతుంది. బిడ్డను అక్కడే వదిలేసి వెళ్లడంతో మణి జీవితంలో ఒక్కసారిగా పెను మార్పు వస్తుంది. కొడుక్కి ఆదిత్య అని పేరు పెట్టి, అప్పటి వరకు పట్టించుకోని బాధ్యతలను తన భుజాలపై వేసుకుంటాడు. స్నేహితుల సహాయంతో ఉద్యోగం చేస్తూ బిడ్డను పెంచుతాడు. కాలం గడిచే కొద్దీ మణి మంచి తండ్రిగా మారడమే కాకుండా కెరీర్‌లో కూడా ఎదుగుతాడు. అప్పుడే కథలో ఊహించని ట్విస్ట్ వస్తుంది. మణి పని చేస్తున్న కంపెనీకి కొత్త మేనేజర్‌గా సింధు వస్తుంది.

బిడ్డను వదిలేసి వెళ్లిపోయిందనే కోపంతో మణి ఆమెను అసహ్యించుకుంటాడు. కానీ సింధు చెప్పే నిజం అతని ప్రపంచాన్నే మార్చేస్తుంది. ఆమె కావాలని బిడ్డను వదిలి పెట్టలేదని తెలుస్తుంది. ప్రసవం తర్వాత ఆమె తల్లిదండ్రులు బలవంతంగా తీసుకెళ్లి, బిడ్డ చనిపోయాడని అబద్ధం చెప్పారనే నిజం బయట పడుతుంది. ఇన్నాళ్లూ తన కొడుకు బతికే ఉన్నాడని తెలియక సింధు కూడా బాధపడుతూనే ఉంటుంది. మరి ఈ నిజం తెలిసిన తర్వాత మణి, సింధుల మధ్య ఉన్న అపోహలు ఎలా తొలగిపోయాయి ? ఆదిత్య తన తల్లిని తిరిగి ఎలా కలుసుకున్నాడు ? చివరికి ఈ కుటుంబం మళ్లీ ఒక్కటైందా ? అనేదే ‘దాదా’ క్లైమాక్స్.

తెలుగులో ఉందా?

Advertisement

‘దాదా’ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తండ్రి-కొడుకుల బంధం, కుటుంబ భావోద్వేగాలు, జీవితంలో బాధ్యత విలువను చూపించే సినిమాలు ఇష్టపడేవారికి ఇది మంచి ఎమోషనల్ వాచ్ అవుతుంది. కెవిన్, అపర్ణా దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగులో ‘పాపా’ పేరుతో Aha ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: అమ్మాయి కోసం రచ్చరచ్చ… అసలు టార్గెట్ తెలిస్తే మైండ్ బ్లాక్… ఓటీటీలోకి మహేష్ బాబు అన్న కొడుకు సినిమా

 

Tags

Related News

బాబోయ్ ప్రాణాలు తీసే బొమ్మ… హారర్ గేమర్‌కి మైండ్ బ్లాకయ్యే సీన్… ఓటీటీలో గత్తరలేపుతున్న హర్రర్ మూవీ

నలుగురు స్నేహితులకు ఒకేసారి భార్యల నుంచి విడాకుల నోటీసులు… ఫ్యామిలీ థెరపిస్ట్ కే పిచ్చెక్కించే ప్లాన్

పాప బర్త్‌డేకి డబ్బులు అడిగితే అవమానం… యజమాని కారులో కోట్ల క్యాష్… డ్రైవర్ షాకింగ్ డెసిషన్

భార్యాభర్తల వందల కోట్ల యుద్ధం… 8 ఎపిసోడ్ల ఇగో వార్… ఇంటెన్స్ లీగల్ డ్రామా

ఒకే రూమ్‌లో క్రష్‌తో సీక్రెట్ లైఫ్… చెప్పుకోలేని ప్రేమతో హీరో తిప్పలు… నెట్‌ఫ్లిక్స్‌లో సీజన్ 2 ల్యాండింగ్

రాత్రిళ్లు కనిపిస్తున్న ఆ శవం ఎవరిది ? హారర్ కాదు అంతకు మించి… ప్రతీ సీన్ సీట్ ఎడ్జ్ ట్విస్ట్

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

Big Stories

Advertisement
×