OTT Movie : లవ్ స్టోరీలను యూత్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే కొన్ని లవ్ స్టోరీల ముగింపు సంతోషంగా ఉంటే, మరికొన్ని విషాదకరంగా ముగుస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే లవ్ స్టోరీ ఒక ముస్లిం అమ్మాయి, ఒక హిందూ అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. క్లైమాక్స్ వరకూ ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఈ సినిమా ఒక ట్రాజెడీ ఎండింగ్ తో ముగుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
లియో కాల్పో (రంజిత్ సజీవ్) ఒక డాల్ఫిన్ ఐలాండ్‌లో తన తండ్రి సయ్యిప్ (సిద్ధిక్)తో కలిసి ‘కాటమరాన్’ అనే రెస్టారెంట్‌ను నడుపుతుంటాడు. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు లియో. ఈ క్రమంలో ఒక విదేశీ మహిళతో ఫ్లర్ట్ చేస్తూ, ఆమె ద్వారా తన కలను సాకారం చేసుకోవాలని భావిస్తాడు. అయితే ఆమెకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం తెలుస్తుంది. ఇక అతని ఆశ నిరాశ అవుతుంది. ఆ తరువాత థంబీ (నేహా నజ్నీన్) అనే ముస్లిం అమ్మాయిని కలిసిన తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. థంబీ తండ్రి ఇంట్లో కఠినమైన నిబంధనలు పెడుతుంటాడు. ఆమె తల్లి ఒక పనిమనిషిలా ఇంట్లో ఉంటుంది.
ఇక వీరిద్దరూ వేర్వేరు సామాజిక తరగతులకు చెందినవారైనప్పటికీ, వీళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఈ ఇంటర్‌ఫెయిత్ ప్రేమ కథలో వీళ్ళు సమాజం నుండి, కుటుంబ ఒత్తిడుల నుండి అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక చిత్రవధ అనుభవిస్తారు. చివరికి ఈ లవ్ స్టోరీ ఎలాంటి మలుపు తిరుగుతుంది ? ఈ ప్రేమను పెద్దలు ఒప్పుకుంటారా ? వీళ్ళు ఎటువంటి సవాళ్లను ఎదుర్కుంటారు ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళ ట్రాజెడీ లవ్ స్టోరీ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : జాబ్ పేరుతో పేద అమ్మాయితో పాడు పనులు… చివరికి వాడికి పట్టే గతి చూస్తే మతి పోవాల్సిందే
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మలయాళ ట్రాజెడీ లవ్ స్టోరీ మూవీ పేరు ‘ఖల్బ్’ (Qalb). 2024 లో విడుదలైన ఈ సినిమా సజిద్ యాహియా దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో రంజిత్ సజీవ్, నేహా నజ్నీన్, సిద్ధిక్, లెనా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ ఒక డాల్ఫిన్ ఐలాండ్‌లో జరుగుతుంది. ఇది సూఫీ సంప్రదాయం ప్రకారం ప్రేమలోని ఏడు దశలను ‘దిల్కషీ (ఆకర్షణ), ఉన్స్ (మోహం), ఇష్క్ (ప్రేమ), అకీదత్ (నమ్మకం), ఇబాదత్ (ఆరాధన), జునూన్ (మత్తు), మౌత్ (మరణం)’ తెలియజేస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. థియేటర్లలో 2024 జనవరి 12న విడుదలై ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఓటీటీలో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటోంది.