Delhi Incident : ఎక్కడ చూసి తెలుసుకున్నారో, ఎవరు చెబితే చేశారో కానీ.. డబ్బు్ల కోసం 9వ తరగతి విద్యార్థిని అతని స్నేహితులే చంపేసిన ఘటన కలకలం సృష్టిస్తోంది. వయసుకు మించిన ఆలోచనలతో డబ్బు సంపాందించాలంటే కిడ్నాప్ చేయాలని.. వారి ఫ్రెండ్ అయితే మరిన్ని డబ్బులు వస్తాయనే ఆశతో..దారుణానికి ఒడిగట్టారు కొందరు 9వ తరగతి విద్యార్థులు.
దేశ రాజధాని దిల్లీలోని వజీరాబాద్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల వైభర్ గార్గ్ అనే విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. ఈ పిల్లాడిని కిడ్నాప్ చేసిన సహచర విద్యార్థులు.. డబ్బులు ఇస్తే వదిలేస్తామని లేదంటే చంపేస్తామంటూ చెప్పారు. అన్నట్లుగా తోటి విద్యార్థులే.. ఆ పిల్లాడిని చంపేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది.
ముగ్గురు చిన్నారులు కలిసి ఒడిగట్టిన ఈ దారుణం తర్వాత కుటుంబం తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. చిన్న వయస్సులోనే అనుకోని తీరుగా అపురూపంగా పెంచుకున్న చిన్నారి.. కన్నుమూయడంతో బోరున విలపిస్తున్నారు. స్నేహితుల రూపంలోనే మృత్యువు తమ కుమారుడిని పట్టుకుపోతుందని అనుకోలేదంటూ కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు.
చిన్నారి కిడ్నాప్ గురించిన సమాచారం తెలుసుకున్న తర్వాత పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో.. వైభవ్ చివరిసారిగా తన ముగ్గురు మైనర్ బాలురులతో కనిపించాడని తేలింది. దాంతో.. బాలుడు అదృష్యంపై మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. అతడిని మార్చి 23న స్నేహితులు దగ్గర్లోని భల్స్వా సరస్సు దగ్గరకు తీసుకెళ్లి.. కత్తులతో విఛక్షణారహితంగా పొడిచి హత్య చేసినట్లుగా గుర్తించారు. బాలుడిని చంపేసిన తర్వాతే.. వారు డబ్బుల కోసం బాలుడు తండ్రికి ఫోన్ చేసి బెదిరించినట్లుగా తెలుస్తోంది.
వైభవ్ కనిపించకుండా పోయిన తర్వాత వివిధ ప్రాంతాల్లో వెతికిన బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు చివరిగా.. మార్చి 25న సమస్సు ఒడ్డున అతని మృతదేహం లభించింది. కుటుంబ సభ్యులు వచ్చి బాలుడు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిన్న వయస్సులోనే.. జీవితం అంటే తెలియని చిన్నారులు ఇంతటి దారుణానికి ఒడిగడతారని ఊహించలేదంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడుకు మృతితో విలపిస్తున్న ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.
Also Read :
ఈ ఘటనపై వజీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పోలీసు కేసు నమోదైంది. ఈ కేసులో ప్రవేయం ఉన్న ముగ్గురు మైనర్ బాలురను పోలీసులు అదుపులోకి తీసుకుని.. వారు అలా ఎందుకు చేశారు. నేరం చేసేందుకు ఏదైనా కారణం ఉందా.. ఎవరైనా ప్రోత్సహించారా వంటి అంశాల్ని పరిశీలించనున్నారు.