E-Paper
Advertisement

అలాంటి అమ్మాయిల రూపంలో లక్ష్మీదేవి… మోస్ట్ అండర్రేటెడ్ మాస్టర్ పీస్

అలాంటి అమ్మాయిల రూపంలో లక్ష్మీదేవి… మోస్ట్ అండర్రేటెడ్ మాస్టర్ పీస్
Advertisement

Rang Rasiya OTT: ఆహ్లాదకరమైన పెయింటింగ్ ను చూస్తే మనసుకు ఎంత హాయిగా అన్పిస్తుందో కదా. అందుకేనేమో కొంతమంది ధనవంతులు లక్షలు పోసి మరీ తమకు ఇష్టమైన పెయింటర్ పెయింటింగ్స్ కొని, తమ వాల్స్ కి తగిలించుకుని మురిసిపోతుంటారు. ఇక మరికొంత మంది దేవుళ్ళ పెయింటింగ్స్ ను భక్తితో పూజిస్తూ ఉంటారు. కానీ ఆ కళ కాస్తా ప్రేమగా మారి, పెయింటింగ్ వేసే వ్యక్తి ప్రేయసిని దేవతను చేస్తే, అది తీవ్ర వివాదంగా మారితే… ఎలా ఉంటుందో తెలియాలంటే ‘రంగ్ రసియా’ (Rang Rasiya) అనే ఈ మూవీని చూడాల్సిందే. 2009లో విడుదలైన ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

కథ కేరళలోని ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన రవివర్మ చుట్టూ తిరుగుతుంది. అతనికి చిన్నప్పటి నుంచే దేవుళ్లను, మనుషులను బొమ్మలుగా వేయడం అంటే అమితమైన ఇష్టం. స్థానిక రాజుల ప్రోత్సాహంతో గొప్ప చిత్రకారుడిగా ఎదుగుతాడు. అప్పటి వరకు భారతీయ సమాజంలో దేవుళ్లకు మానవరూపంలో స్పష్టమైన చిత్రాలు ఉండేవి కావు. రవివర్మ దేవతలను మానవ రూపంలో సరికొత్తగా, అందంగా చిత్రించడం ప్రారంభిస్తాడు. ఆయన చిత్రాలు సామాన్యులకు కూడా దేవుళ్లను ఇంట్లో పెట్టుకుని, పూజించే భాగ్యం కల్పిస్తాయి.

Advertisement

బ్రిటీష్ కాలం నాటి బాంబే అంటే ముంబై నగరానికి వచ్చిన రవివర్మకు సుగంధ అనే అందమైన, స్వతంత్ర భావాలున్న యువతి పరిచయమవుతుంది. ఆమె అందానికి ముగ్ధుడైన రవివర్మ ఆమెను తన చిత్రాలకు కళా స్ఫూర్తిగా ఎంచుకుంటాడు. లక్ష్మీదేవి, సరస్వతి వంటి హిందూ దేవతల చిత్రాలను ఆమె రూపంతోనే అద్భుతంగా సృష్టిస్తాడు. ఆమెపై ఉన్న అపారమైన ప్రేమ, వ్యామోహంతో కొన్ని నగ్న చిత్రాలను కూడా గీస్తాడు.

ఈ చిత్రాల ద్వారా సామాన్యులకు సైతం దేవుళ్లను పటాల రూపంలో ఇంట్లో పెట్టుకునే భాగ్యం కల్పిస్తూ ఓ ప్రింటింగ్ ప్రెస్‌ను ప్రారంభిస్తాడు. కానీ ఈ దేవతల పెయింటింగ్స్, నగ్న చిత్రాలు బయటకు వచ్చిన తర్వాత సమాజంలోని కొందరు కన్జర్వేటివ్స్, మత పెద్దలు తీవ్రంగా మండిపడతారు. దేవతలను అలా చూపించడం మతాన్ని అవమానించడమే అంటూ రవివర్మపై కోర్టులో కేసులు వేసి, అతనిని అరెస్ట్ చేయిస్తారు.

Advertisement

సమాజం సుగంధను కూడా తీవ్రంగా అవమానిస్తుంది. ఈ వివాదాలు రవివర్మ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. జైలుకు వెళ్లినా, సమాజం వెలివేసినా రవివర్మ వెనక్కి తగ్గడు. కళ అనేది భగవంతుడు ఇచ్చిన స్వేచ్ఛ, అందాన్ని ఆరాధించడం తప్పు కాదు అని కోర్టులో తన వాదనలు వినిపిస్తాడు. ఈ పోరాటంలో మానసికంగా నలిగిపోయిన సుగంధ చివరికి ఏం చేస్తుంది ? ఆమె కోసం రవివర్మ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? చివరకు కోర్టులో రవివర్మ విజయం సాధించాడా ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘రంగ్ రసియా’ సినిమా రాజా రవివర్మ జీవితం, ఆయన ప్రేమ, విషాదాంత కథ. ఒక్కసారి చూస్తే ప్రేక్షకుల మనసులో దీర్ఘకాలం నిలిచిపోతుంది ఈ మూవీ. ఈ చిత్రం చూస్తుంటే కళాకారులు ఎదుర్కొనే సవాళ్లు, సమాజపు భయాలు ఎంత దారుణంగా ఉంటాయో అర్థమవుతుంది. భారతీయ కళా చరిత్రలో ఈ మూవీ ఒక మైలురాయి. 19వ శతాబ్దపు భారతీయ కళా చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పు తెచ్చిన చిత్రకారుడు రాజా రవివర్మ జీవితం ఆధారంగా రూపొందిన ఈ హిందీ బయోపిక్ డ్రామా డ్రామాలో రణ్‌దీప్ హూడా, నందన సేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. రణ్‌దీప్ హూడా రవివర్మ పాత్రలో అద్భుతంగా నటించాడు. నందన సేన్ సుగంధ పాత్రలో భావోద్వేగాలను అద్భుతంగా పలికించింది. ప్రస్తుతం ZEE5, YouTubeలలో హిందీ ఆడియోతో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో మాత్రం అందుబాటులో లేదు.

Read Also: బ్రతికొచ్చే శవాలు, చేతబడులు… ‘ట్రైన్ టు బుసాన్’ డైరెక్టర్ నుంచి వచ్చిన మరో ఎపిక్ హర్రర్ థ్రిల్లర్

Tags

Related News

ఓటీటీలోకి వచ్చేస్తున్న కొరియన్ కనకరాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

మోగ్లీని రక్షించడానికి వచ్చిన విచిత్ర మృగం… కట్ చేస్తే 20 ఏళ్ల సీక్రెట్ బట్టబయలు… తెలుగులోనే స్ట్రీమింగ్

మొగుడు పెళ్లాల మధ్యలోకి వచ్చి ముంచేశాడు… క్లైమాక్స్‌లో ఊహించని డ్రామా… తెలుగులో ఇంగ్లీష్ సిరీస్

మహిళల ఇళ్లకు వచ్చే విచిత్రమైన బాక్సులు… కట్ చేస్తే వరుస హత్యలు… ప్రతి కేసు వెనుక ఒకే మైండ్

మ్యాచ్ ఆడుతుంటే స్టేడియంలో పదే పదే వినిపించే సీక్రెట్ విజిల్… శబ్దంతో కోచ్ కొంపముంచిన లేడీ

రాత్రికి రాత్రే రాక్ స్టార్ శవంగా… తీరా శవం దగ్గరకు వెళ్తే ఊహించని షాక్… డార్క్ హారర్ థ్రిల్లర్

కూతురి సీక్రెట్ డైరీతో స్టేజ్‌పై జోకులు… నిజం తెలిసి నిలదీసిన కూతురికి షాకింగ్ ట్విస్ట్… తెలుగులోనే ఈ సిరీస్

Big Stories

Advertisement
×