Peddi Movie: ఎలాంటి సినిమా అయినా సరే థియేటర్లలో రిలీజ్ అయిన 4 వారాలు లేదా 8 వారాల తర్వాత కచ్చితంగా ఓటీటీలో అలరిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక్కొక్కసారి ఆ సినిమా విడుదలైన 10 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఒక పెద్ద సినిమా థియేటర్లలో విడుదలయి రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించి, ఇప్పుడు ఓటిటి విడుదలకు సిద్ధమయ్యింది. అయితే సౌత్ ఆడియన్స్ కు ఈ విషయం పెద్ద పండగే అయినా నార్త్ ఆడియన్స్ ను మాత్రం నిరాశలో ముంచేసింది. ఆ చిత్రం ఏదో కాదు పెద్ది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా, బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో వచ్చిన చిత్రం పెద్ది(Peddi). సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా సినిమా విడుదలైన తర్వాత ఇందులో జాన్వీ కపూర్ సన్నివేశాలపై బాలీవుడ్ సెలబ్రిటీల నుండి కాస్త విమర్శలు ఎదురైనప్పటికీ.. ఆ సన్నివేశాలను తొలగించి మళ్లీ 5 నిమిషాల 56 సెకండ్ల నిడివితో కొత్త సన్నివేశాలను థియేటర్లలో యాడ్ చేసి రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఇదొక నిర్మాతల కమర్షియల్ స్ట్రాటజీ అనే కామెంట్లు కూడా వ్యక్తమయ్యాయి. ఇక కొత్తగా యాడ్ చేసిన సన్నివేశాలతో మళ్లీ మెగా అభిమానులు థియేటర్లలో సందడి చేసి, నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నారు. అలా అతి తక్కువ సమయంలోనే రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి దూసుకుపోతోంది ఈ సినిమా.
also read:డైరెక్టర్ గా హీరో రామ్ కొత్త అడుగు.. ఘనంగా ‘RAPO23’ పూజా కార్యక్రమాలతో ప్రారంభం!
అయితే అలాంటి ఈ సినిమాని డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీనికి తోడు థియేటర్లలో దూసుకుపోతున్న ఈ సినిమాను ఓటీటీలో చూడాలని ఓటీటీ ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురు చూడగా.. ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ ను కూడా లాక్ చేశారు..తాజా సమాచారం ప్రకారం జూలై 2వ తేదీ నుంచి ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ్ , మలయాళం, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రాబోతోంది.
కానీ హిందీ వెర్షన్ కోసం మాత్రం నార్త్ ఆడియన్స్ మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఎందుకంటే బాలీవుడ్ థియేట్రికల్ రిలీజ్ నిబంధనల ప్రకారం .. అక్కడ ఒక సినిమా విడుదలయ్యింది అంటే 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలి. ఆ రూల్ వల్లే ఇప్పుడు పెద్ది హిందీ వర్షన్ జూలై 30 న నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి . మొత్తానికి ఇటు నార్త్ మార్కెట్లో కూడా భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇక ఇందులో జగపతిబాబు, బొమన్ ఇరానీ , శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ వంటి స్టార్లు కీలకపాత్రలు పోషించారు. ఇక ఆస్కార్ విన్నర్ ఆర్ రెహమాన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు.