E-Paper
Advertisement

ఏసీ మనుషుల కోసం కనిపెట్టింది కాదా? హిస్టరీ తెలిస్తే ఫ్యూజులు ఎగరడం పక్కా!

ఏసీ మనుషుల కోసం కనిపెట్టింది కాదా? హిస్టరీ తెలిస్తే ఫ్యూజులు ఎగరడం పక్కా!
Advertisement

AC History: ఉష్ణోగ్రతలు ఎప్పుడు పెరిగినా సరే.. వెంటనే గుర్తొచ్చే ఎలక్ట్రానిక్ పరికరం ‘ఏసీ’ (Air Conditioner). ప్రస్తుతం ఆఫీసులు, ఇళ్లు, కార్లలో ఏసీలు తప్పనిసరిగా మారిపోయాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఇవి లేకుండా క్షణం కూడా గడవని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎండల్లో ఉపశమనం కలిగిస్తున్న ఈ ఏసీని తొలుత మనుషుల కోసం కనిపెట్టలేదన్న విషయం మీకు తెలుసా? ఏసీ తయారీ వెనుక ఉన్న ఆసక్తిర నేపథ్యం గురించి ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కాగితాల కోసం పుట్టిన ఐడియా!

1902 సంవత్సరంలో విల్లీస్ క్యారియర్ (Willis Carrier) అనే 25 ఏళ్ల ఇంజనీర్.. తొలిసారి ఏసీని కనుగొన్నారు. అయితే విల్లీస్ దీనిని మనుషులకు చల్లదనాన్ని ఇవ్వడం కోసం కనిపెట్టలేదట. న్యూయార్క్‌లోని ప్రముఖ ప్రిటింగ్ ప్రెస్ అయిన సాకెట్ & విల్హెమ్స్ లితోగ్రాఫింగ్ అండ్ పబ్లిషింగ్ కంపెనీ (Sackett & Wilhelms Lithographing & Publishing Company) కోసం రూపొందించారట. అప్పట్లో ఆ ప్రింటింగ్ ప్రెస్ కు పెద్ద సమస్య వచ్చింది. అధిక ఉష్ణోగ్రత, తేమ వల్ల కాగితాలు ఉబ్బిపోయి, రంగులు సరిగ్గా ప్రింట్ అవ్వకుండా పాడైపోయేవి. ఈ సమస్యను పరిష్కరించడానికి.. గాలిలోని తేమను నియంత్రించేందుకు క్యారియర్ ఒక మిషన్‌ను తయారు చేశారు. అదే మెుట్టమెుదటి ఏసీగా గుర్తింపు పొందింది.

మనుషుల కంటే ఫ్యాక్టరీలకే ప్రాధాన్యం

Advertisement

మొదట్లో ఈ ఎయిర్ కండిషనర్లను కేవలం పరిశ్రమలలో మాత్రమే వాడేవారు. టెక్స్‌టైల్ మిల్లులు, పొగాకు ఫ్యాక్టరీలు, ఫిల్మ్ స్టూడియోలు, చాక్లెట్ తయారీ కేంద్రాలలో వస్తువులు పాడవకుండా ఉండటానికి దీనిని ఉపయోగించేవారు. అంటే మనుషుల సుఖం కోసం కాకుండా వ్యాపారాల్లో ఉత్పత్తి నాణ్యతను పెంచడానికే ఈ పరికరాన్ని ఉపయోగించారు. ఆ కాలంలో చల్లటి ఏసీ గదుల్లో కూర్చోవాలనే ఆలోచన కూడా ఎవరికీ ఉండేది కాదట. అయితే అప్పట్లో ఈ స్థాయిలో భారీ ఉష్ణోగ్రతలు లేకపోవడం కూడా దీనికి ఓ కారణమై ఉండొచ్చు.

థియేటర్ల ద్వారా మారిన భాగ్యం!

పరిశ్రమల నుంచి ఏసీ సాధారణ ప్రజల వద్దకు చేరడానికి సినిమా థియేటర్ కారణమైందట. 1920 దశకంలో వేసవి వస్తే థియేటర్లకు జనాలు వచ్చేవారు కాదట. దాంతో వ్యాపారాలు దెబ్బతిని థియేటర్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను అధిగమించడానికి థియేటర్ల యజమానులు విల్లిస్ క్యారియర్ కంపెనీని సంప్రదించి తొలిసారి మనుషుల కోసం ఎయిర్ కండీషనర్లను ఏర్పాటు చేయించారు. ఇక అప్పటి నుంచి ఎండల నుంచి తప్పించుకోవడానికి జనాలు థియేటర్లకు క్యూ కట్టడం ప్రారంభించారట. అలా ఏసీ అనేది మనుషులకు విలాసవంతమైన, హాయినిచ్చే వస్తువుగా పరిచయమైందని చెబుతుంటారు.

Advertisement

Also Read: జులై 1 నుంచి పాత రూ.10, 20, 50, 100 నోట్ల రద్దు? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత?

ఇళ్లలోకి చేరిన చల్లదనం

అయితే విల్లీస్ క్యారీయర్ కనిపెట్టిన తొలి తరం ఏసీలు.. చాలా భారీగా ఉండేవట. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సాంకేతికత మరింత అభివృద్ధి చెంది.. చిన్న సైజు ఏసీలుగా రూపాంతరం చెందాయి. అలా 1950ల నాటికి అమెరికాలోని ఇళ్లలో ఏసీల వాడకం విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కేవలం కాగితాలు పాడవకుండా ఉండటానికి కనిపెట్టిన ఒక సాంకేతికత.. ఈరోజు మానవ జీవితాన్ని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, నగరాల నిర్మాణ శైలిని సైతం మార్చేస్తుందని బహుశా విల్లిస్ క్యారియర్ కూడా ఊహించి ఉండరు.

Also Read: నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. ఇకపై ప్రతి ప్రొఫైల్‌కూ విడివిడిగా ఈమెయిల్స్.. తప్పనిసరి చేసిన ఓటీటీ దిగ్గజం!

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×