OTT Movie : విశాల్ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈయనగారి సినిమాలకు తమిళ్, తెలుగులో కూడా అభిమానులున్నారు. అయితే గత ఏడాది విశాల్ నటించిన ఒక సినిమా యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంటోంది. ఇందులో మదర్ సెంటిమెంట్ కూడా బాగానే వర్క్ అవుట్ అయింది. ఈ సినిమా మాస్ యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌తో నిండి ఉంటుంది. యాక్షన్, ఎమోషనల్ సినిమాని ఇష్టపడే వాళ్ళు దీనిపై ఓ లుక్ వేయండి. ఒక చిల్లింగ్ థ్రిల్ ను ఇస్తుంది. ఈ సినిమా పేరు ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘రత్నం’ (Rathnam) హరి డైరెక్ట్ చేసిన తమిళ యాక్షన్ డ్రామా సినిమా. ఇందులో విశాల్ (రత్నం), ప్రియా భవానీ శంకర్ (లోగనాయగి ), సముద్రకని (పన్నీర్ సెల్వం) మెయిన్ రోల్స్‌లో నటించారు. తమిళనాడు-ఆంధ్ర సరిహద్దులో జరిగే ఈ కథ రౌడీయిజం, అమ్మ సెంటిమెంట్, రివెంజ్, ల్యాండ్ మాఫియాల చుట్టూ తిరుగుతుంది. ఇది 2024 ఏప్రిల్ 26న థియేటర్స్‌లో వచ్చింది. ఇప్పుడు Amazon Prime Video, Zee Tamilలో తమిళం, తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్‌లో ఉంది. ఈ సినిమా 2 గంటల 35 నిమిషాల నిడివితో IMDb లో 5.4/10 రేటింగ్ ను పొందింది.
కథలోకి వెళ్తే
1990లలో రాయుడు సోదరులు – బీమా, సుబ్బా, రాఘవ బస్సు ప్రయాణీకులను దోచి, చంపేసే గ్యాంగ్‌గా ఉంటారు. లోగనాయగి ఒక పోలీస్ ఆఫీసర్ భార్య, వీళ్ల క్రైమ్స్ గురించి పోలీసులకు చెబుతుంది. రివెంజ్‌లో రాయుడు సోదరులు ఆమె భర్తని చంపేస్తారు. లోగనాయగి వాళ్ళనుంచి తప్పించుకుని, తన కొడుకు రత్నంతో మార్కెట్‌లో బతుకుతుంది. కానీ స్థానిక వేశ్యాగృహ ఓనర్ ఆమెను వేధించి, చివరకు ఆమెను వేశ్యగా ముద్రవేసి అరెస్ట్ చేయిస్తాడు. అవమానంతో లోగనాయగి పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకుంటుంది. రత్నం అప్పటికి చిన్న పిల్లాడిగానే, ఆ వేశ్యాగృహ ఓనర్‌ని చంపి, జైలుకు వెళ్తాడు. జైలు నుండి బయటకు వచ్చిన రత్నం, పన్నీర్ సెల్వం అనే ఒక ఎమ్మెల్యే కోసం రౌడీగా పనిచేస్తాడు. ఎందుకంటే చిన్నప్పుడు రత్నం పన్నీర్‌ని ఒక దాడి నుండి కాపాడి ఉంటాడు. ఇక రత్నం పన్నీర్ కోసం గుండాలను కొడుతూ బతుకుతాడు. ఒక రోజు మల్లిగ అనే యువతి, రాయుడు సోదరుల గుండాలచే దాడికి గురవుతుంది. రత్నం ఆమెను కాపాడతాడు. ఎందుకంటే మల్లిగ తన అమ్మ లోగనాయగిలా కనిపిస్తుంది.
Read Also : పర్వతంపై అమ్మాయి మృతదేహం… గ్రిప్పింగ్ స్టోరీ… ఇంటెన్స్ మర్డర్ మిస్టరీ