BigTV English

OTT Movie : అంతర్జాతీయ స్థాయిలో చితగ్గొట్టిన చిన్న సినిమా… పీడకల నిజమై వెంటాడితే…

OTT Movie : అంతర్జాతీయ స్థాయిలో చితగ్గొట్టిన చిన్న సినిమా… పీడకల నిజమై వెంటాడితే…

OTT Movie : షార్ట్ ఫిల్మ్‌లు కాంపాక్ట్ రన్‌టైమ్‌లో శక్తివంతమైన కథలు, సోషల్ మెసేజెస్, ఎమోషనల్ ఇంపాక్ట్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. మీకు కూడా అలాంటి ఒక గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ కావాలా? అది సైకలాజికల్ సస్పెన్స్, సోషల్ ఇష్యూ, కాశ్మీర్ అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌తో నిండి ఉంటే ఎలా ఉంటుంది ? ఊహించడానికే అద్భుతంగా ఉన్న ఈ కాన్సెప్ట్ లో వచ్చిన ఆ షార్ట్ ఫిలిం ఏంటి? ఎక్కడ చూడొచ్చు? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


అంతర్జాతీయ స్థాయిలో చితగ్గొట్టిన చిన్న సినిమానే…

Red Letter (2025) 37-నిమిషాల హిందీ షార్ట్ ఫిల్మ్. అజిత్ అరోరా దీనికి దర్శకత్వం వహించడంతో పాటు నటించాడు కూడా. అలాగే అరోరా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ షార్ట్ సినిమా ఆగస్టు 9న ShemarooMe / OTTplay Premiumలో రిలీజైంది. ఇందులో అజిత్ అరోరా (అభి), కృష్మా ఠాకూర్ (అర్వ), జావెద్ అహ్మద్ ఖాన్, మొహమ్మద్ అఫ్ఫాన్ షా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ప్రదర్శించబడింది. అలాగే జగ్రాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఫీచర్ అయింది. గ్లోబల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులను గెలుచుకుంది. అయితే సినిమాలో చైల్డ్ అబ్యూస్ వంటి సెన్సిటివ్ థీమ్స్‌, కొంత వయోలెన్స్, ఎమోషనల్ ట్రిగ్గర్స్‌ ఉంటాయి. కాబట్టి సెన్సిటివ్ వీక్షకులు జాగ్రత్త.


స్టోరీలోకి వెళ్తే…

అభి (అజిత్ అరోరా) అనే వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుంది, అతను కాశ్మీర్‌లోని ఒక హోటల్‌ను నడుపుతూ, తన భార్య అర్వ (కృష్మా ఠాకూర్)తో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. అయితే అభిని పదే పదే కలవర పెడుతున్న నైట్‌మేర్స్ అతని శాంతియుత జీవితాన్ని భంగం చేస్తాయి. ఈ కలల్లో ఒక రహస్యమైన చేయి అతన్ని తన ఇంటి సమీపంలోని ఒక గుహ వైపు నడిపిస్తుంది. అక్కడ ఒక ఎరుపు రాయి కింద 1890 నాటి ఒక లెటర్ దాగి ఉంటుంది. ఈ లెటర్ ఒక “అసుర్” (దెయ్యం లేదా దుష్ట శక్తి) గురించి సూచిస్తూ, పిల్లలతో దుర్మార్గంగా ప్రవర్తించిన ఒక గత సంఘటనను రివీల్ చేస్తుంది.

ఈ లెటర్ అభి బాల్య ట్రామాతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇది అతని మనస్సులో దాగి ఉన్న ఒక డార్క్ సీక్రెట్‌ను బయటకు తెస్తుంది. అభి, తన ఆర్కియాలజిస్ట్ భార్య అర్వతో కలిసి ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఒక జర్నీని ప్రారంభిస్తాడు. ఈ ఇన్వెస్టిగేషన్ అభిని తన గతంలోని బాధాకరమైన జ్ఞాపకాలను ఎదుర్కోవడానికి దారి తీస్తుంది. అది సమాజంలో ఇంకా దాగి ఉన్న ఒక సోషల్ ఈవిల్‌తో, ముఖ్యంగా చైల్డ్ అబ్యూస్‌తో లింక్ అయి ఉంటుంది. కథ రెండు టైమ్‌లైన్స్‌లో అన్‌ఫోల్డ్ అవుతుంది.

Read Also :  70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

అభి బాల్య ట్రామా, ప్రెజెంట్ ఇన్వెస్టిగేషన్ మధ్య కనెక్షన్‌ను రివీల్ చేస్తూ… అతను, అర్వ ఈ రహస్యాన్ని లోతుగా తవ్వుతున్న కొద్దీ ఒక ఛిల్లింగ్ ట్విస్ట్ బయటపడుతుంది.  అభి స్వయంగా ఈ “అసుర్” అయి ఉండవచ్చా? అనే అనుమానానికి దారి తీస్తుంది. ఈ సస్పెన్స్‌ఫుల్ ప్లాట్, కాశ్మీర్ అద్భుతమైన వ్యాలీస్‌లో సెట్ చేసిన సినిమాటిక్ విజువల్స్, హాలీవుడ్-స్టైల్ VFXతో ఎలివేట్ అవుతుంది. క్లైమాక్స్ ఊహించని ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఇంతకీ ఆ అసురుడు ఎవరు? హీరోకి ఆ కల ఎందుకు వస్తోంది? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిన కథ.

Related News

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×