BigTV English

OTT Movie : వదిన మీద మరిది కన్ను… మెంటలెక్కించే మర్డర్ ఇన్వెస్టిగేషన్

OTT Movie : వదిన మీద మరిది కన్ను… మెంటలెక్కించే మర్డర్ ఇన్వెస్టిగేషన్

OTT Movie : క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కునేలా చేస్తాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక బెంగాల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. ట్విస్టులతో ఈ మూవీ మతి పోగొడుతుంది. చివరి వరకు ఈ మూవీ సస్పెన్స్ తో కన్ఫ్యూజ్ చేస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


చోర్కీ (Chorki) లో

2022 లో వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘Redrum’. ఈ బెంగాల్ మూవీకి విక్కీ జహెడ్ దర్శకత్వం వహించారు. ఇందులో అఫ్రాన్ నిషో, మెహజాబీన్ చౌదరి, అజీజుల్ హకీం, మనోజ్ ప్రమాణిక్, సల్లా ఖానం నాదియా, నసీర్ ఉద్దీన్ ఖాన్ నటించారు. ఈ కథ ప్రధానంగా ఒక ప్రసిద్ధ సంగీతకారుడైన షోహెల్ చుట్టూ తిరుగుతుంది. అతడు తన పడకగదిలోనే హత్యకు గురి అవుతాడు. అతని భార్య నీలా ఆసమయంలో నిద్రపోతూ ఉంటుంది. షోహెల్ బాల్య స్నేహితుడు డిటెక్టివ్ రషీద్ ఈ కేసు దర్యాప్తును చేపడతాడు. ఎన్నో ట్విస్ట్ లతో ఈ మూవీ తిరుగుతుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ చోర్కీ (Chorki) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

షోహెల్, నీలా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. నీలా తల్లిదండ్రులకి ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా, బయటకి వచ్చి పెళ్లిచేసుకుని జీవిస్తుంటారు. అయితే షోహెల్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రజల్లో గుర్తింపు ఉంటుంది.ఇతనికి ఒక తమ్ముడు కూడా ఉంటాడు. అతను ఎప్పుడూ నీలాని తప్పుడు దృష్టి తో చూస్తుంటాడు. ఒకరోజు బెడ్రూంలో షోహెల్ రక్తపు మడుగులో పడి ఉంటాడు. అతని భార్య నీలా ఆసమయంలో నిద్రపోతూ ఉంటుంది. షోహెల్ ని చూసి నీలా భోరున ఏడుస్తుంది.ఈ కేసును అతని చిన్ననాటి ఫ్రెండ్ రషీద్ దర్యాప్తును చేపడతాడు. అయితే అతనికి ప్రధాన అనుమానితురాలిగా నీలా అనిపిస్తుంది. కానీ షోహెల్ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో దాచిపెడుతున్నట్లు తెలుస్తుంది. రషీద్‌కు ప్రస్తుత సమయంలో ఎటువంటి ఆధారాలు లభించవు. అతను గతంలోకి వెళ్లి ఆధారాలను వెతకడం ప్రారంభిస్తాడు.

ఈ ప్రక్రియలో అనేక ఆశ్చర్యకరమైన సంఘటనలు వెలుగులోకి వస్తాయి. నీలాకి గతంలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని తెలుస్తుంది. అతని మీద కూడా అనుమానం వస్తుంది. ఇంతలో నీలా మీద అనుమానంతో ఆమెను జైలుకు తరలిస్తారు. చివరికి షోహెల్ ని ఎవరు చంపి ఉంటారు? రషీద్‌ వెలుగులోకి తెచ్చే విషయాలు ఏమిటి? నీలా పాత్ర ఇందులో ఎంత ఉంది ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ‘Redrum’ అనే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీలో అనేక ట్విస్ట్‌లు, టర్న్‌లు ఉన్నాయి. ఇవి చివరి 30 నిమిషాలు ప్రేక్షకులను ఉత్కంఠభరితంగా ఉంచుతాయి. షోహెల్ ఎలా చనిపోయాడు, నిజమైన నేరస్థుడు ఎవరనే ప్రశ్నలకు సమాధానాలు స్టోరీ చివరిలో వెల్లడవుతాయి.

Tags

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×