MLA Rajagopal Reddy: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణపై జోరుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మంత్రి పదవిపై పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆసక్తికరంగా మాట్లాడిన సంగతి విదితమే. తనకు హోం మంత్రి పదవి అంటే చాలా ఇష్టం అని ఇవాళ మధ్యాహ్నం మీడియా చిట్ చాట్ లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని, ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు.
తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని, ఏ పదవి వచ్చినా రాష్ట్రం కోసం, ప్రజల కోసం సమర్థవంతంగా పనిచేస్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. పార్టీ అధిష్టానం నుంచి ఇంకా ఫోన్ కాల్ రాలేదని కూడా ఆయన చెప్పారు. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వహించానని కూడా తెలిపారు.
హోం మంత్రి పదవిపై క్లారిటీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి..
హోం మంత్రి పదవి అంటే ఇష్టం అనే అంశంపై మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వాలి..? ఎవరెవరికి ఏ శాఖ కేటాయించాలి..? అనే విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అవుతుందని చెప్పారు. ఈరోజు అసెంబ్లీలో కొంతమంది మీడియా మిత్రులు ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి..? శాఖల కేటాయింపు ఎలా ఉంటుంది..? అనే విషయంలో చిట్ చాట్ చేసిన సందర్భంలో నేను మాట్లాడిన విషయం తెలిసిందే.
అభిమానులు హోంమంత్రి కావాలని కోరుకొంటున్నారు..
తమ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు తనకు హోం శాఖ మంత్రి అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారని, అంతే తప్ప నాకు హోం శాఖ ఇవ్వాలి, హోం మంత్రి అయితేనే బాగుంటుంది అనే విషయాలు మీడియా మిత్రుల వద్ద చర్చకు రాలేదని చెప్పుకొచ్చారు. మంత్రి పదవులు ఇచ్చే విషయంలో శాఖల కేటాయింపు విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. అధిష్టానం తనను గుర్తించి మంత్రివర్గంలో చోటు కల్పించి ఏ శాఖ అప్పగించినా బాధ్యతాయుతంగా పనిచేస్తానని చెప్పారు. ఇటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడానికి, అటు ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి అహర్నిశలు పాటుపడుతూనే ఉంటానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
ALSO READ: Manager Jobs: కొడితే ఈ జాబ్ కొట్టాలి.. ఒక దెబ్బకు లైఫ్ సెట్ అయితది భయ్యా.. జస్ట్ ఇవ్వి ఉంటే చాలు