BigTV English

Burkha ban fine: బురఖా వేసుకున్నందుకు రూ.9,500 జరిమానా.. అక్కడ అదే రూల్!

Burkha ban fine: బురఖా వేసుకున్నందుకు రూ.9,500 జరిమానా.. అక్కడ అదే రూల్!

బురఖా వేసుకోవడం, మహిళలు తల కనపడకుండా దుస్తులు కప్పి ఉంచుకోవడం.. కొన్ని వర్గాల సంప్రదాయం. అయితే బురఖా ముసుగులో అసాంఘిక శక్తులు పెట్రేగే అవకాశం ఉందని కొన్ని ప్రపంచ దేశాలు దీన్ని నిషేధించాయి. అంటే మత సంప్రదాయం ప్రకారం ఆయా ఆధ్యాత్మిక ప్రాంతాలు, ఇళ్లలో మాత్రమే వీటిని ధరించడానికి అనుమతి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరిస్తే కచ్చితంగా జరిమానా కట్టాల్సిందే. బురఖాపై నిషేధం విధించిన దేశాల లిస్ట్ లో స్విట్జర్లాండ్ కూడా ఉంది. 2021లో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఆ దేశంలో ఈ చట్టం రూపొందింది. బహిరంగ ప్రదేశాల్లో బురఖా వాడకాన్ని నిషేధిస్తూ ఈ ఏడాదే స్విట్జర్లాండ్ చట్టం చేసింది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరూ బురఖా కారణంగా జరిమానా చెల్లించలేదు. తొలిసారిగా ఇప్పుడు జరిమానా వసూలు చేసింది స్విట్జర్లాండ్.


స్థానిక మహిళకు జరిమానా..
జ్యూరిచ్‌ లో ఒక మహిళ బురఖా ధరించి బహిరంగ ప్రదేశాల్లో కనిపించింది. దీంతో స్విట్జర్లాండ్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. బురఖాపై నిషేధం ఉందని, బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని చెప్పారు. అంతే కాదు, ఆమెకు జరిమానా కూడా విధించారు. స్థానిక పోలీస్ అధికారి మైఖేల్ వాకర్ బురఖా ధరించిన మహిళకు జరిమానా విధించారు. జరిమానా మొత్తం 100 స్విస్ ఫ్రాంక్ లు అంటే దాదాపుగా 110 అమెరికన్ డాలర్లు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఆ మహిళ జరిమానా చెల్లించడానికి నిరాకరించింది. అందుకే ఈ కేసు ఇప్పుడు తదుపరి ప్రాసెస్ కోసం కాంటోనల్ గవర్నర్ కార్యాలయానికి బదిలీ చేయబడుతుంది. అసలు ఆ మహిళ ఎవరు అనే విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. స్విస్ పౌరురాలా, కాదా అనే విషయాన్ని మాత్రం పోలీసులు బయటపెట్టారు. ఆమె పర్యాటకురాలు కాదు అని మాత్రం చెప్పారు. ఆమె పేరు, వివరాలు, ఎలాంటి రంగు దుస్తులు ధరించింది అనే విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.

బురఖాపై స్విట్జర్లాండ్ లో నిషేధం ఉంది. అదే సమయంలో కేవలం కళ్లు మాత్రమే కనిపించేలా ఉండే నిఖాబ్ లు కూడా అక్కడ నిషేధించారు. ప్రదర్శనకారులు, క్రీడాకారులు అప్పుడప్పుడు ధరించే ముసుగులకు కూడా అనుమతి లేదు. అసలు బహిరంగ ప్రదేశాల్లో తమ మొహాన్ని కప్పి ఉంచే ఎలాంటి వస్త్రాలకు స్విట్జర్లాండ్ లో అనుమతి లేదు. వారి నివాస ప్రాంతాల్లో లేదా ఇతర ప్రైవేట్ ప్రాంతాల్లో బురఖా ధరించవచ్చు కానీ, పబ్లిక్ ప్లేసెస్ లో మాత్రం మహిళలు లేదా ఇతరులెవరైనా బురఖా ధరించడం అక్కడ నిషేధం.


ప్రజాభిప్రాయం ద్వారా
2021లో ముందుగా ఈ చట్టంకోసం స్విట్జర్లాండ్ లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. రైట్ వింగ్ స్విస్ పీపుల్స్ పార్టీ నేతృత్వంలో ఈ చర్యకు అనుకూలంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత 51.2 శాతం మంది మద్దతుతో ఇది చట్టంగా మారింది. “రాడికల్ ఇస్లాం”ను లక్ష్యంగా చేసుకుని ఈ చట్టం రూపొందించారు. ఆ తర్వాత ప్రజా భద్రతను మెరుగుపరచడంకోసం, నిరసనలు, క్రీడా కార్యక్రమాలలో ముసుగులు ధరించడాన్ని కూడా నిషేధించారు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే స్థానికంగా ఉండే పోలీసులే 100 స్విస్ ఫ్రాంక్ లు జరిమానా విధించవచ్చు. ఒకవేళ కోర్టులో సవాలు చేస్తే, అక్కడ నిర్దిష్ట కారణం చెప్పలేకపోతే జరిమానా 1,000 ఫ్రాంక్‌ల వరకు పెరగవచ్చు.

మినహాయింపులు..
అనారోగ్యం కారణంతో, చలి వాతావరణం, కార్నివాల్ కార్యక్రమాలు, కొన్ని ప్రాంతాలలో మతపరమైన కార్యక్రమాలు, విమాన ప్రయాణంలో, దౌత్య వేత్తల సమావేశంలో.. ఈ చట్టానికి మినహాయింపులున్నాయి. స్విట్జర్లాండ్ లోని 4 లక్షలమంది ముస్లింలను టార్గెట్ చేస్తూ ఈ చట్టం చేశారంటూ విమర్శలు వినిపిస్తున్నా.. అక్కడ మాత్రం దీన్ని కఠినంగా అమలు చేస్తున్నారు.

 

Related News

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

Big Stories

×