Jagan on Shankar Naik: వైసీపీకి కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయి. అధికారం లేక కొందరు నేతలు వలస పోతున్నారు. మరికొందరు తమదే రాజ్యమంటూ ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో నేతలపై వేటు వేస్తోంది వైసీపీ హైకమాండ్. తాజాగా వైసీపీ నేత వడిత్య శంకర్ నాయక్‌పై వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది.
వైసీపీ వార్నింగ్
గీత దాటితే వేటు తప్పదని నేతలను జగన్ సూటిగా హెచ్చరించారు. వడిత్య శంకర్ నాయక్‌పై వేటు ద్వారా తోక జాడించే నేతలకు సంకేతాలు పంపారు. మాజీ సీఎం, అధినేత జగన్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా వడిత్యా శంకర్ నాయక్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్టు వైసీపీ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. ఇంతకీ శంకర్ పై వేటు వెనుక అసలేం జరిగింది. ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్దాం.
ఎవరీ శంకర్ నాయక్
అనంతపురం జిల్లాకు చెందిన వడిత్యా శంకర్ నాయక్.. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో విద్యార్థి నేతగా జీవితం ప్రారంభించాడు. ఏపీలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. 2022 ఏడాదిలో ఆయన నియామకం జరిగింది. మూడేళ్ల కాలపరిమితితో ఎస్టీ కమిషన్ సభ్యుడిగా సాగారు. ఆయన పదవీకాలం ఈనెల 10న ముగిసింది.
విజయవాడ స్పాలో ఏం జరిగింది?
విజయవాడలో నాలుగు రోజుల కిందట మసాజ్ సెంటర్‌లో అమ్మాయిలతో రాసలీలలు సాగిస్తూ పోలీసులకు చిక్కాడు ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్. ఈయన గురించి గడిచిన నాలుగు రోజులుగా రకరకాల వార్తలు వచ్చాయి. అయినా వైసీపీ హైకమాండ్ సైలెంట్ అయ్యింది. కనీసం ఆ నేతను పిలిచి అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.
ALSO READ: ఏపీ మిర్చి రైతులకు మోదీ గుడ్ న్యూస్
ఏపీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ గతవారం ఓ మసాజ్ సెంటర్‌లో విజయవాడ పోలీసులకు అడ్డంగా చిక్కారు. ఆయనతో పాటు 11 మంది విటులు, మరో తొమ్మిది మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. విజయవాడ మసాజ్ సెంటర్ ఆయన దొరికిన పట్టుబడిన తీరు సీమలో చర్చ పెద్దస్థాయిలో చర్చ జరిగింది.
పోలీసులు ఆకస్మిక తనిఖీలతో దిక్కు తెలియని పరిస్థితిలో పడిపోయాడు శంకర్ నాయక్. గదిలో నుంచి బయటికి రాలేని స్థితిలో మంచం కింద నక్కారు. పోలీసుల వార్నింగ్‌తో ఆయన బయటకు వచ్చారు. దీనికి సంంధించి వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే అదే స్పా సెంటర్‌లో విటులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా మరో భవనంలో యువతులతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారనే విషయాన్ని గుర్తించారు పోలీసులు.
రెగ్యులర్ కస్టమర్లు మినహా, కొత్తవారిని అనుమతించేవారు కాదు. ఇలాంటి ప్రాంతానికి శంకర్ నాయక్ కు అనుమతి లభించడం అనేది అసలు చర్చ. మసాజ్ సెంటర్ నిర్వహణలో ఎవరెవరి పాత్ర ఉందా? ఈ ఘటన మాట్లాడేందుకు శంకర్ నాయక్ అందుబాటులో లేరు. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. దాన్ని పోలీసులు సీజ్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి స్పా వ్యవహారం శంకర్ నాయక్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసిందనే చెప్పవచ్చు.