BigTV English

OTT Movie : ఆ వీడియో చూసాక 7 రోజుల్లో చస్తారు… రోమాలు నిక్కబొడుచుకునే హారర్ సీన్స్… లైఫ్ లో మర్చిపోలేని దెయ్యం మూవీ

OTT Movie : ఆ వీడియో చూసాక 7 రోజుల్లో చస్తారు… రోమాలు నిక్కబొడుచుకునే హారర్ సీన్స్… లైఫ్ లో మర్చిపోలేని దెయ్యం మూవీ

OTT Movie : హాలీవుడ్ హారర్ సినిమాలను చూడటానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కొన్ని సినిమాలు ఓ మాదిరిగా భయపెడితే, మరికొన్ని సినిమాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఇప్పుడు మనము చెప్పుకోబోయే సినిమా రెండో రకం. ఈ సినిమా శాపగ్రస్తమైన వీడియో టేప్ చుట్టూ తిరుగుతుంది. దీనిని చూసినవారు ఏడు రోజుల్లో చనిపోతుంటారు. ప్రతి సీన్ గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉంటుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘రింగ్స్ 3’ (Rings 3) ఒక అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ సినిమా. దీనికి ఎఫ్. జేవియర్ గుటిరెజ్ దర్శకత్వం వహించారు. ఇది “The Ring Two” 2005 లో వచ్చిన సినిమాకి సీక్వెల్ గా వచ్చింది. ‘Rings 3’ 2017 ఫిబ్రవరి 3న అమెరికాలో విడుదలైంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో, గూగుల్ ప్లే మూవీస్‌లో అందుబాటులో ఉంది. ఇందులో మాటిల్డా లుట్జ్, ఆలెక్స్ రో, జానీ గలెకి, విన్సెంట్ డి’ఒనోఫ్రియో, ఐమీ టీగార్డెన్ , బోనీ మోర్గాన్ నటించారు.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ 2013లో ఒక విమానంలో మొదలవుతుంది. కార్టర్ అనే వ్యక్తి సమారా శాపగ్రస్తమైన వీడియో టేప్ చూశానని చెబుతాడు. మరొక ప్రయాణీకురాలు కెల్లీ కూడా ఆ టేప్ చూశానని చెప్తుంది. సమారా ఆత్మ విమానంలో ప్రత్యక్షమై, అది కూలిపోయేలా చేస్తుంది. ఇక్కడ అందరూ చనిపోతారు.రెండేళ్ల తర్వాత 2015లో, ఒక కాలేజీ ప్రొఫెసర్ గాబ్రియేల్ బ్రౌన్, ఒక షాప్ లో కార్టర్ తండ్రి వాడిన VCRని కొంటాడు. దానిలో ఆ శాపగ్రస్త టేప్ ఉంటుంది. గాబ్రియేల్ దాన్ని చూసిన తర్వాత “సెవెన్ డేస్” అని ఫోన్ కాల్ వస్తుంది. అతను ఈ శాపాన్ని అధ్యయనం చేయడానికి “సెవెన్స్” అనే గ్రూప్‌ను నియమించుకుంటాడు. ఇందులో విద్యార్థులు టేప్ చూసి, మరొకరికి కాపీ ఇస్తూ శాపాన్ని విస్తరిస్తారు. ఈ క్రమంలో హోల్ట్ అనే విద్యార్థి ఈ గ్రూప్‌లో చేరి టేప్ చూస్తాడు.ఆతరువాత హోల్ట్‌ కనిపించకుండా పోయేసరికి అతని గర్ల్‌ఫ్రెండ్ జూలియా ఆందోళన చెందుతుంది.

Read Also : నల్లటి జంటకు తెల్లని బిడ్డ… ఇదెక్కడి విడ్డూరం సామీ… అనుమానంతో ఆ జంట చేసే పనికి ఫ్యూజులు అవుట్

ఆమె కాలేజీకి వెళ్లి, స్కై అనే అమ్మాయి హోల్ట్ గురించి అడగడంతో, గాబ్రియేల్ గ్రూప్ గురించి తెలుస్తుంది. హోల్ట్‌ను కాపాడడానికి జూలియా ఆ టేప్ ను చూస్తుంది. కానీ ఆమె చూసిన వీడియోలో ఒక కొత్త వీడియో ప్లే అవుతుంది. ఇది ఎవరూ ఇంతకు ముందు చూసి ఉండరు. ఈ వీడియోలో వింత చిత్రాలు, ఒక ఊరు, ఒక అమ్మాయి గురించి సంకేతాలు ఉంటాయి. జూలియా ఈ వీడియో రహస్యాన్ని కనుక్కోవడానికి సమారా గతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె దాదాపు ఒక నిర్మానుష్యమైన ఊరికి చేరుకుంటుంది. అక్కడ సమారా శరీరం 12 ఏళ్ల క్రితం ఖననం చేయబడిందని, 30 ఏళ్ల క్రితం ఒక స్థానిక అమ్మాయి అదృశ్యమైందని తెలుస్తుంది. అక్కడ ఆమె గాలెన్ బర్క్ అనే ప్రీస్ట్‌ను కలుస్తుంది. అతను సమారా గతం గురించి కీలక సమాచారం ఇస్తాడు.

సమారా తండ్రి ఒక దుర్మార్గుడైన ప్రీస్ట్ అని, ఆమెను ఒక బావిలో చంపి, ఆమె ఆత్మను శాపగ్రస్తం చేసినట్లు తెలుస్తుంది. ఇక జూలియా ఈ వీడియోని అనుసరించి సమారా శరీరాన్ని కనిపెడుతుంది. ఆమె ఆత్మను విడుదల చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ పరిస్థితి ఇంకోలా మారుతుంది. జూలియా ఇప్పుడు ఊహించని సంఘటనలను ఎదుర్కొంటుంది. జూలియా ఈ శాపనానికి బలవుతుందా ? సమారా ఆత్మని ఎలా ఎదుర్కొంటుంది ? ఆమె బాయ్ ఫ్రెండ్ ఏమవుతాడు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సూపర్‌నాచురల్ హారర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Related News

OTT Movie : ఆసుపత్రిలో దిక్కుమాలిన పని… ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఏంది భయ్యా ఈ అరాచకం

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

OTT Movie : బాబోయ్ దెయ్యంపైనే ప్రయోగం… కట్ చేస్తే గూస్ బంప్స్ ట్విస్ట్…. ముచ్చెమటలు పట్టించే హర్రర్ మూవీ

OTT Movie : అనామకుల చెరలో ఇద్దరమ్మాయిలు… కిల్లర్స్ అని తెలియక కలుపుగోలుగా ఉంటే… బ్లడీ బ్లడ్ బాత్

OTT Movie : ప్రెగ్నెంట్ వైఫ్ ఫోటో మార్ఫింగ్… ఒక్క రాత్రిలో ఫుడ్ డెలివరీ బాయ్ లైఫ్ అతలాకుతలం… సీను సీనుకో ట్విస్ట్

Mohanlal: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న మోహన్ లాల్ బ్లాక్ బాస్టర్ మూవీ!

Little Hearts OTT: దసరాకు ఓటీటీలోకి ‘లిటిల్‌ హార్ట్స్‌’.. వారికి మేకర్స్‌ స్వీట్‌ వార్నింగ్, ఏమన్నారంటే!

Big Stories

×