E-Paper
Advertisement

Romantic movie OTT : రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమకు పునాదిగా మారిన మూవీ ట్రెండింగ్ లో… ఏ ఓటీటీలో ఉందంటే?

Romantic movie OTT : రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమకు పునాదిగా మారిన మూవీ ట్రెండింగ్ లో…  ఏ ఓటీటీలో ఉందంటే?
Advertisement

Romantic movie OTT : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వెండితెర కెమిస్ట్రీ, నిజ జీవిత బంధంగా మారిపోయింది. టాలీవుడ్‌లో ఒక మధురమైన ప్రయాణంగా నిలిచిపోయింది. వీరిద్దరి మధ్య అనుబంధం 2018లో విడుదలైన ‘గీత గోవిందం’ సినిమా సెట్స్‌లోనే చిగురించిందని అభిమానులు బలంగా నమ్ముతారు కూడా. ఈ సినిమా విజయంతో పాటు, వీరిద్దరి వ్యక్తిగత జీవితాల్లో కూడా చాలా మార్పులు జరిగిపోయాయి.

గీత గోవిందం సెట్స్‌లో మొదటి కలయిక

పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ‘గీత గోవిందం’ షూటింగ్ 2017లో ప్రారంభమైంది. ఆ సమయంలో విజయ్ ‘అర్జున్ రెడ్డి’ విజయంతో దూసుకుపోతుండగా, రష్మిక అప్పుడప్పుడే తెలుగులో అడుగుపెడుతోంది. రష్మిక మొదట్లో విజయ్ దేవరకొండను చూసి భయపడిందట, కానీ షూటింగ్ సమయంలో వాళ్ళ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహమే కాలక్రమేణా ప్రేమగా మారిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ విషయం బయట పడినప్పటి నుంచి, అభిమానులు ప్రేమగా ఈ జంటను ‘విరోష్’ (ViRosh) అని పిలుచుకుంటారు.

సక్సెస్ ఇచ్చిన కెమిస్ట్రీ

Advertisement

‘గీత గోవిందం’ కేవలం సినిమాగా మాత్రమే కాకుండా, ఒక సెన్సేషన్‌గా నిలిచింది. ‘ఇంకేం ఇంకేం కావాలే’ పాటలో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వీళ్ళు ‘డియర్ కామ్రేడ్’ లో మరోసారి జంటగా నటించారు. ఇది వాళ్ళ బంధాన్ని మరింత బలపరిచింది.

సీక్రెట్ రిలేషన్

కొన్నేళ్లుగా వీరిద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఒకే చోట విహారయాత్రలు చేయడం, ఒకే రకమైన బ్యాక్‌డ్రాప్‌లలో ఫోటోలు దిగడం వంటి అంశాలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. చాలా కాలం సస్పెన్స్ తర్వాత, విజయ్ రష్మిక 2026 ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత, రీల్ లైఫ్ జంట రియల్ లైఫ్ పార్ట్‌నర్స్ అయ్యారు. వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ సందర్భంలో ‘గీత గోవిందం’ సినిమాను కూడా మళ్లీ చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో ట్రెండింగ్ లో కూడా ఉంది.

Advertisement

Read Also : పెళ్లికి ముందు అలాంటి పని… కళ్ళు తెరిపించే క్లైమాక్స్… పొట్ట చెక్కలయ్యే కామెడీ కూడా

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×