Romantic Movie OTT : ఒక అదిరిపోయే ఫుల్ రొమాంటిక్ డ్రామా చూడాలఉకుంటే, ఈ ఫిలిప్పీన్ సినిమా చూసేయండి. ఇద్దరు అమ్మాయిల మధ్య నడిచే గర్ల్స్ లవ్ స్టోరీ ఇది. సినిమాలో మసాలా సీన్లు, బోల్డ్ కంటెంట్ గట్టిగా ఉంటుంది. అంటే ఇది పక్కాగా పెద్దలకు మాత్రమే. ఒకవైపు పెళ్లి, ఇంకోవైపు మనసుని లాగేసే పాత ప్రేమ.. ఈ రెండింటి మధ్య నలిగిపోయే ఒక అమ్మాయి కథను డైరెక్టర్ చాలా పచ్చిగా చూపించాడు. ముసలి, ముతకతో కాకుండా ఒంటరిగా కూర్చుని చూడాల్సిన సినిమా ఇది. చూస్తే మాత్రం నిద్ర కరువే అవుతుంది. అలా ఉంటాయి మరి ఈ సినిమాలో బోల్డ్ సీన్స్.
2024లో వచ్చిన ఈ ఫిలిప్పీన్ రొమాంటిక్ సినిమా పేరు ‘ఫస్ట్ టేస్ట్’ (First Taste). ఇందులో అంజెలి ఖాంగ్, రోబ్ గ్వింటో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫిలిప్పీన్స్ ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించింది. సాధారణంగా అక్కడ అడల్ట్ సినిమాలు నేరుగా ఓటిటిలో (Vivamax) వస్తుంటాయి. కానీ ఇది థియేటర్లలో విడుదలైన మొదటి ‘గర్ల్స్ లవ్’ సినిమాగా రికార్డు కెక్కింది. సుమారు 1 గంటా 37 నిమిషాల నిడివి గల ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు అడల్ట్ రేటింగ్ కూడా ఇచ్చింది. అంటే ఇది కేవలం పెద్దలకు మాత్రమే. దర్శకుడు రోమన్ పెరెజ్ జూనియర్ ఇద్దరు మహిళల మధ్య ఉండే కెమిస్ట్రీని, ఎమోషన్స్ ను చాలా బోల్డ్‌గా తెరకెక్కించారు. ప్రధాన పాత్రలో నటించిన అంజెలి ఖాంగ్ ఫిలిప్పీన్స్‌లో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్. ఆమెకు తోడుగా రోబ్ గ్వింటో నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది ఆగస్టు 2024లో ‘వివామాక్స్’ (Vivamax) ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది.
ఇందులో మెయిన్ క్యారెక్టర్ యునా. ఈమెకు నికో అనే ఒక మంచి అబ్బాయితో పెళ్లి సెట్ అవుతుంది. ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం, వరుడు కూడా బుద్ధిమంతుడు కావడంతో అంతా సాఫీగా సాగిపోతుంటుంది. కానీ అసలు ట్విస్ట్ ఎక్కడ వస్తుందంటే.. పెళ్లి పనులు జరుగుతున్న టైంలోనే యునా పాత లవ్ స్టోరీ మళ్ళీ మొదలవుతుంది. పాత ప్రేమ అంటే ఏదో అబ్బాయితో కాదు, బెక్కా అనే ఒక అమ్మాయితో. కాలేజీ రోజుల్లో వీరిద్దరూ ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకుని ఉంటారు. కానీ పరిస్థితుల వల్ల విడిపోతారు. సరిగ్గా యునా పెళ్లికి రెడీ అవుతున్న టైంలోనే బెక్కా మళ్ళీ సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది. పాత జ్ఞాపకాలు, ఆ పాత ఫీలింగ్స్ అన్నీ ఒక్కసారిగా తిరగదోడినట్టు అయ్యి యునా మైండ్ మొద్దుబారిపోతుంది. ఇక అక్కడి నుండి కథ అంతా రచ్చ రచ్చే. ఒక పక్క పెళ్లి చేసుకోబోయే మొగుడు, ఇంకో పక్క ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన పాత ప్రియురాలు. ఈ ఇద్దరి మధ్య యునా నలిగిపోతుంటుంది. యునా ఆఖరికి ఎవరి వైపు నిలబడింది? తన పాత ప్రేమని గెలిపించుకుందా లేక పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిందా? అనేదే ఈ సినిమా క్లైమాక్స్. కథ చెప్పడానికి ఇలా ఉంది గాని, చూస్తే మాత్రం ఉన్న మతి పోతుంది.
Read Also : తండ్రి వికృత చేష్టలు… నాలుగు గోడల మధ్య నలిగిపోయే కూతుర్లు