E-Paper
Advertisement

పక్కింటి అబ్బాయితో 15 రోజులు… ఫ్యామిలీతో చూశారో వీపు విమానం మోతే

పక్కింటి అబ్బాయితో 15 రోజులు… ఫ్యామిలీతో చూశారో వీపు విమానం మోతే
Advertisement

Romantic movie on OTT: సమ్మర్ హాలిడేస్‌లో ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ప్రశాంతంగా గడపాలని ఓ కుర్రాడు అనుకుంటాడు. కానీ అనుకోకుండా అతని ఇంటికి 15 రోజుల పాటు ఓ అతిథి వచ్చి ఉంటే ? అతను మరెవరో కాదు… చిన్నప్పటి నుంచి మనసులో దాచుకున్న క్రష్ అయితే ? ఒకే ఇంట్లో, ఒకే బాత్రూమ్, పక్కపక్క బెడ్‌రూమ్‌లు పంచుకుంటూ ఆ ఇద్దరూ రెండు వారాలు గడపాల్సి వస్తే… వాళ్ల మధ్య ఎలాంటి బంధం ఏర్పడుతుంది? తన మనసులో దాచుకున్న ప్రేమను ఆ కుర్రాడు బయటపెట్టగలడా ? తన గురించి తనకున్న భయాలను దాటుకుని తనను తాను అంగీకరించగలడా ? ఇలాంటి సున్నితమైన ప్రేమకథతో తెరకెక్కిన బ్రెజిలియన్ టీన్ రొమాంటిక్ డ్రామా ‘హియర్ ది హోల్ టైమ్’ (Here the Whole Time) తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టింది. మరి ఆ 15 రోజుల్లో ఏం జరిగింది ? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఫెలిపే ఇంట్రోవర్ట్ టీనేజ్ కుర్రాడు. తన శరీరాకృతి, రూపం గురించి అతనిలో చాలా అభద్రతా భావాలు ఉంటాయి. అందుకే ఇతరులతో కలవడానికి, బయటకు వెళ్లడానికి పెద్దగా ఇష్టపడడు. సమ్మర్ హాలిడేస్‌లో కూడా ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండి సినిమాలు, మ్యూజికల్స్ చూస్తూ ప్రశాంతంగా గడపాలని అనుకుంటాడు. కానీ అతని ప్లాన్ ఒక్కసారిగా మారిపోతుంది. ఫెలిపేకు పక్కింట్లో ఉండే కైయో కొన్ని కారణాల వల్ల 15 రోజుల పాటు అతని ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ వస్తుంది.

Advertisement

కైయో మరెవరో కాదు… చిన్నప్పటి నుంచి ఫెలిపే మనసులో ఉన్న క్రష్. ఒకప్పుడు దూరంగా చూసిన వ్యక్తితో ఇప్పుడు ఒకే ఇంట్లో ఉండాల్సి రావడంతో ఫెలిపే చాలా ఇబ్బందిగా ఫీలవుతాడు. మాట మాట్లాడటానికే సంకోచిస్తాడు. తన మనసులోని భావాలను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ రోజులు గడిచేకొద్దీ పరిస్థితులు మారతాయి.

ఒకే ఇంట్లో కలిసి సమయం గడపడం, మాట్లాడుకోవడం, తమ వ్యక్తిగత విషయాలను పంచుకోవడంతో ఫెలిపే, కైయో ఒకరినొకరు మరింత అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. ఫెలిపే తనలో దాచుకున్న భయాలు, అభద్రతా భావాల గురించి క్రమంగా బయటపడతాడు. ఈ 15 రోజుల ప్రయాణంలో ఫెలిపేకు అసలు మార్పు తన చుట్టూ ఉన్నవాళ్లలో కాదు… తనలోనే మొదలవుతుంది. తాను ఎలా కనిపిస్తున్నాననే భయం కంటే, తాను ఎవరో అంగీకరించుకోవడం ముఖ్యమని తెలుసుకుంటాడు.

Advertisement

కైయో పట్ల తనకున్న భావాలను అర్థం చేసుకోవడం, వాటిని అంగీకరించడం, తన గుర్తింపుపై ఉన్న సందేహాలను దాటుకోవడం… ఫెలిపే జీవితంలో ఈ 15 రోజులను ప్రత్యేకంగా మారుస్తాయి. మరి కైయో కూడా ఫెలిపే మనసులో ఉన్న భావాలను అర్థం చేసుకున్నాడా? ఇద్దరి మధ్య ప్రేమగా మొదలైన ఈ బంధం చివరికి ఎలాంటి మలుపు తీసుకుంది? ఫెలిపే తనను తాను పూర్తిగా అంగీకరించగలిగాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఏ ఓటీటీలో ఉంది ?

చిన్ననాటి క్రష్‌తో 15 రోజులు ఒకే ఇంట్లో గడపాల్సి వస్తే ఏం జరుగుతుందనే ఆసక్తికరమైన పాయింట్‌తో మొదలై… చివరికి తనను తాను ప్రేమించుకోవడం, అంగీకరించుకోవడం గురించి చెప్పే కథే ఈ సినిమా. టీన్ రొమాన్స్, ఎమోషనల్ కమింగ్-ఆఫ్-ఏజ్ కథలు ఇష్టపడేవారికి ఈ సినిమా ఒక మంచి ఫీల్‌గుడ్ వాచ్. యాక్షన్, ట్విస్టులపై కాకుండా టీనేజ్ భావోద్వేగాలు, ప్రేమ, బాడీ ఇమేజ్, సెల్ఫ్-యాక్సెప్టెన్స్ చుట్టూ తిరిగే ఫీల్‌గుడ్ రొమాంటిక్ డ్రామా ఇది. చిన్న వయసులో తమ గురించి తామే ఏర్పరచుకునే భయాలు, ఇతరుల అభిప్రాయాల గురించి ఆలోచించడం వంటి అంశాలను సున్నితంగా చూపిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ లేదు కానీ… పోర్చుగీస్‌తో పాటు ఇంగ్లీష్ భాషలో ఓటీటీలో ఈ సినిమాను చూడొచ్చు.

Read Also: తల్లిదండ్రుల ప్రేమకథ వెనుక ఎయిడ్స్ విషాదం… ఈ అమ్మాయి తెలుసుకున్న నిజం కదిలిస్తుంది మావా

Tags

Related News

17 ఏళ్లుగా కూతురి కోసం వేట… రియల్ స్టోరీతో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

హైవే యాక్సిడెంట్ చూస్తే ఆమడ దూరం పారిపోయేలా చేసే మూవీ… ఆగితే అస్సలు వదలని దెయ్యం

బోయింగ్ విమానాల్లో ఇంత దారుణమా? వేల కోట్ల కంపెనీ పతనం వెనుక ఉన్న అసలు నిజాలు

తండ్రి దొంగిలించిన డబ్బు కోసం సౌత్ ఆఫ్రికాకు… కోట్ల డబ్బు కోసం అంతర్జాతీయ మాఫియాతో పోరాటం

ఓటీటీ అలర్ట్… ‘ప్రేమలు’ మలయాళం, హిందీ వెర్షన్లు డిలీట్… తెలుగులో ఏ ఓటీటీలో ఉందంటే ?

దేవుడిచ్చిన మ్యాజికల్ బుక్‌తో మిడిల్ క్లాస్ మ్యాన్ రచ్చ… తెలుగు మూవీనే

ఓటీటీలో ఈ వారం ఎక్కువ మంది చూసిన టాప్ 10 ఇవే… రష్మిక మూవీని వెనక్కి నెట్టేసిన రియాలిటీ షో

Big Stories

Advertisement
×