E-Paper
Advertisement

పంచాయితీలు తీరవు ప్రాబ్లమ్స్ ఆగవు.. కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న వర్గపోరు!

పంచాయితీలు తీరవు ప్రాబ్లమ్స్ ఆగవు.. కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న వర్గపోరు!
Advertisement

Congress Crisis: ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. సొంత పార్టీ నేతలే ప్రతిపక్ష లీడర్ల తరహాలో వ్యవహరించడం ఇప్పుడు హస్తం పార్టీ ని ఇరకాటంలో పడేస్తుంది. ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ల ముందే పార్టీలో లుకలుకలు, అలజడులు సంభవిస్తున్నాయి.కీలకమైన రాజకీయం నడుస్తున్న వేళ పార్టీలో ఊహించని పరిణామాలు అలజడులు సృష్టిస్తున్నాయి.

బహిరంగంగా వ్యాఖ్యలు..

“రోజుకో నేత తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో పాటు పూటకో ఆరోపణల పరంపర ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది.ప్రభుత్వం, ముఖ్యమంత్రి లక్ష్యంగా పార్టీలోని ప్రముఖ నేతలే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తుండటంతో అధిష్టానానికి కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. మొన్న రాజగోపాల్..నిన్న చిన్నారెడ్డి, తాజాగా కొండా సుస్మిత ఇలా కీలక లీడర్లే పార్టీ, ప్రభుత్వాలను తప్పుపట్టడంతో కేడర్ లోనూ తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. దీంతో టీపీసీసీ ముఖ్యనేతలు కూడా తలలు పట్టుకోవాల్సి వస్తుంది.

వరసగా తిరుగుబాట్లు.. నేతల ఓపెన్ కామెంట్స్..

Advertisement

​ గత కొద్ది రోజులుగా పార్టీలోని ప్రముఖుల వైఖరి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంపై, పార్టీ అంతర్గత నిర్ణయాలపై ముక్కుసూటిగా స్పందిస్తూ నేతలు గుబులు రేపుతున్నారు. మంత్రి పదవి ఆశించి అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ నిర్ణయాలు, మంత్రివర్గ కేటాయింపులతో పాటు నియోజకవర్గాల్లో ప్రాధాన్యతపై బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇక మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డి సీనియర్ నేతగా ఉన్నప్పటికీ, పార్టీ శ్రేణుల పదవుల కేటాయింపుల్లో తనకు ప్రాధాన్యం తగ్గడంపై అధిష్టాన వైఖరిని ఎండగడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

Also read: నాకే ఎందుకిలా.. లవ్ బ్రేకప్ పై కామాక్షి రియాక్షన్!

కొండా సురేఖ కుమార్తే.. 

Advertisement

తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తే సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారాయి. నియోజకవర్గాల పరిధిలో రాజకీయం, పార్టీ నిర్ణయాల విషయంలో తీవ్ర విమర్శలు గుప్పించడమే కాక, సీఎం రాజకీయాన్ని కార్నర్ చేసే స్థాయిలో ప్రకటనలు చేయడం కాంగ్రెస్ అంతర్గత విభేదాలను బట్టబయలు చేసింది. ఉమ్మడి జిల్లా మంత్రి లేకుండానే సీఎం ఎలా పర్యటిస్తారని, పరకాల టిక్కెట్ ఎలా ముందే ప్రకటిస్తారంటూ సుస్మిత సూటిగానే సీఎంను నిలదీయడంతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

అంతర్గతంగా సతమతమవుతున్న లీడర్లు..

​ బహిరంగంగా మాట్లాడే ధైర్యం ఉన్న కొందరు నేతలు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తుంటే, మరికొందరు సీనియర్లు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఇంటర్నల్ గా తీవ్ర వేదనను అనుభవిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా పార్టీ మారిన వారికి ఇస్తున్న ప్రాధాన్యం కష్టపడ్డ సీనియర్లకు దక్కడం లేదనే కోపం స్పష్టంగా కనిపిస్తోంది.ఇక ప్రభుత్వం ,పార్టీ యంత్రాంగం మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల క్షేత్రస్థాయి నేతలు సతమతమవుతున్నారు.గతంలో కూడా అనేక మంది సీనియర్ నేతలు పార్టీకి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడిన ఘటనలు బోలెడు ఉన్నాయి. పార్టీ కార్యవర్గం, నామినేటెడ్ పదవులు, కమిటీలు ఎంపిక నుంచి మంత్రివర్గ వి విస్తరణ వరకు ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ లో విమర్శల వర్షం కురుస్తుంది. ప్రజాస్వామ్యం పేరిట చాలా మంది నేతలు ఇంటర్నలగా చర్చించాల్సిన అంశాలను కూడా నేరుగా బహిరంగంగానే తెరమీదకు తీసుకువస్తున్నారు.

​నోటీసులకే పరిమితమవుతున్న క్రమశిక్షణా కమిటీ..

​పార్టీలో ఎలాంటి అసంతృప్తి వచ్చినా క్రమశిక్షణ పాటించాలని ఉపన్యాసాలు ఇచ్చే పార్టీ క్రమశిక్షణా కమిటీ పాత్ర ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.పార్టీ రూల్స్ బ్రేక్ చేస్తూ విమర్శలు చేసే నేతలకు కేవలం వివరణ కొరకు మాత్రమే నోటీసులు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ​గట్టి చర్యలు తీసుకోలేకపోవడం, నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ వ్యవహారాన్ని సర్దుబాటు పేరిట పక్కన పెట్టేయడంతో అసంతృప్త నేతలకు భయం లేకుండా పోతోందనే టాక్ సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది.

సీఎంను కార్నర్ చేస్తూ..

ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందిస్తున్నామని చెప్తున్నప్పటికీ, సొంత నేతల నుంచి వస్తున్న ఈ తీవ్రమైన వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. రోజుకో నేత చేస్తున్న వ్యాఖ్యలు, సీఎంను కార్నర్ చేస్తున్న తీరు రాబోయే కీలక ఎన్నికల వేళ పార్టీ కేడర్‌ను గందరగోళంలోకి నెట్టే ప్రమాదం ఉన్నదని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. పంచాయితీలు తీర్చడంలో క్రమ శిక్షణ కమిటీ వైఫల్యం చెందడంతోనే ఇలాంటి సమస్యలు రిపీట్ అవుతున్నాయని పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు సీరియస్ అయ్యారు.

లనతే ఇాలదఫ దాసుడి త‌ప్పులు దండంతో స‌రి.. నోటీసులిస్తారు.. సారీల‌తో స‌రిపెట్టుకుంటారు.. !

Tags

Related News

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. సాగునీటి విడుదలపై కీలక ప్రకటన!

దాసుడి త‌ప్పులు దండంతో స‌రి.. నోటీసులిస్తారు.. సారీల‌తో స‌రిపెట్టుకుంటారు.. !

ఈ రాష్ట్రానికేమ‌య్యింది..? ఓ వైపు క్షుద్ర‌పూజ‌ల రాజ‌కీయాలు.. మ‌రోవైపు జ్యోతిష్యుల‌ సంప్ర‌దింపులు..!

పుత్రికోత్సాహంబు ఆ తల్లిదండ్రికి పుత్రిక జన్మించినపుడే కలగదు సుమతి!

ఆచారాలు, సంప్ర‌దాయాలు.. జ్యోతిష్యాలు, జాత‌కాలు.. తండ్రి బాట‌లో త‌న‌య‌.. విజ‌య్‌లా తొలి ప్ర‌య‌త్నంలోనే సీఎం పీఠం కోసం..!

టీడీపీ కంచుకోటపై మిత్రపక్షాల కన్ను.. ఉత్తరాంధ్రలో మారిన పవన్, బీజేపీ వ్యూహం!

కేసీఆర్ బాటలోనే కవిత.. తమిళనాడు విజయ్ సీక్రెట్ జ్యోతిష్యుడితో సంచలన భేటీ!

Big Stories

Advertisement
×