OTT Movie : హాలీవుడ్ హారర్ సినిమాలను మించిపోతున్నాయి ఇండియన్ సినిమాలు. ఈ హారర్ సినిమాలకు ఫాంటసీ, సస్పెన్స్, రివేంజ్ వంటి థీమ్స్ ను జోడించి, కొత్త దనం కోసం ప్రయత్నిస్తున్నారు మేకర్స్. ఈ మధ్య ఇటువంటి సినిమాలకు డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఓటీటీలో కూడా వీటికి వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. హారర్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమాలో గూస్ బంప్స్ తెప్పించే సీన్స్, మతిపోగొట్టే ట్విస్టులు ఉన్నాయి. ఒక దట్టమైన అడవిలో ఈ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ తమిళ హారర్-థ్రిల్లర్ మూవీ పేరు ‘రూట్ నెంబర్ 17’ (Route No 17). 2023లో వచ్చిన ఈ సినిమాకు అభిలాష్ జి. దేవన్ దర్శకత్వం వహించారు. ఇందులో జితన్ రమేష్, అంజు సాసి , అఖిల్ ప్రభాకర్, హరీష్ పెరడి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని నేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డాక్టర్ అమర్ రామచంద్రన్ నిర్మించారు. దీనికి మలయాళ సంగీత దర్శకుడు ఓసెప్పచ్చన్ సంగీతం అందించారు. ఈ స్టోరీ సత్యమంగళం అడవుల్లో, ఒక నిషేధించిన మార్గంలో జరిగే రహస్యమైన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం 2023 డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలైంది. 2024 ఫిబ్రవరి 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
1 గంట 52 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 8.2/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
సత్యమంగళం అడవుల్లోన ఒక రోడ్డు మార్గాన్ని 30 సంవత్సరాల నుంచి అధికారులు నిషేధం విధిస్తారు. ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు రాత్రి పూట తెలియని కారణాలతో చనిపోతుంటారు. ప్రసూతం అంజన (అంజు పాండియా), కార్తీక్ (అఖిల్ ప్రభాకర్) అనే ఒక జంట విహారయాత్ర కోసం ఈ నిషిద్ధ మార్గంలో ప్రయాణిస్తారు. చీకటి పడటంతో, వీళ్ళు అడవిలో రాత్రి గడపడానికి నిర్ణయించుకుంటారు. ఆ రాత్రి సమయంలో వీళ్లపై ఒక వింత ఆకారం వీళ్ళ పై దాడి చేస్తుంది. ఆతరువాత వీళ్ళు ఒక గుహలో బంధీలుగా మారుతారు. ఈ గుహ ఒక సైకో ఆధీనంలో ఉంటుంది. ఒక వైపు సలీం (అమర్ రామచంద్రన్) నేతృత్వంలోని పోలీసు బృందం, కానిస్టేబుల్ విఘ్నేష్ (మధన్ కుమార్ ధక్షిణమూర్తి) సహాయంతో, ఆప్రాంతంలో జరుగుతున్న మీస్సింగ్ కేసులను దర్యాప్తు చేస్తుంది.
సలీం కూడా దర్యాప్తు చేస్తూ ఆ రోడ్డు మార్గం గుండా వెళతాడు. అయితే అతను కూడా ఆ సైకో చేతిలో చిక్కుకుంటాడు. ఇక సలీం కనిపించకుండా పోవడంతో, విఘ్నేష్ ఒక రిటైర్డ్ జర్నలిస్ట్ నటరాజన్ (టైటస్ అబ్రహం) సహాయంతో ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. మరోవైపు గుహలో అంజన, కార్తీక్ బిక్కు బిక్కు మంటూ బతుకుటుంటారు. వీళ్ళకు తోడు సలీం కూడా తొడవుతాడు. ఇక విఘ్నేష్ ఈ దట్టమైన అడవిలో అనేక సమస్యలను ఎదుర్కుంటాడు. చివరికి ఆ సైకో చేతిలో వీళ్ళు ఏమవుతారు ? ఎందుకు ఆ సైకో మనుషుల్ని చంపుతున్నాడు ? విఘ్నేష్ పరిస్థితి ఏమవుతుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : కర్టెన్ చాటున దెయ్యం… అది ఆడే దాగుడుమూతల ఆటకు పార్ట్స్ ప్యాక్