BigTV English

OTT Movie : సైకో కిల్లర్ చేసే పనులకి పోలీసులు హడల్… వీడి చేతికి చిక్కితే వెనక్కి రాలేరు.

OTT Movie : సైకో కిల్లర్ చేసే పనులకి పోలీసులు హడల్… వీడి చేతికి చిక్కితే వెనక్కి రాలేరు.

OTT Movie : కాలం మారింది, కథలు కూడా మారుతున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను ఇప్పుడు బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషలలో వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను ఇప్పుడు ఇంటి దగ్గరే చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు మూవీ లవర్స్. ఈ నేపథ్యంలోనే తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘రూట్ నెంబర్ 17‘ (Route NO 17). 2023లో విడుదలైన ఈ తమిళ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి అభిలాష్ జి దేవన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో జితన్ రమేష్, అంజు శశి, అఖిల్ ప్రభాకర్, హరీష్ పేరడి ప్రధాన పాత్రలు పోషించారు. ఒసేప్పచ్చన్ సంగీతం అందించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

కార్తీక్, అంజన ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. తొందరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ ఒక వెకేషన్ కి వెళ్తూ ఉంటారు. వీళ్లు అనుకోకుండా ఒక అటవీ మార్గం ద్వారా వెళుతారు. ఆ దారిలో ఇదివరకే చాలా మంది చనిపోయి ఉంటారు. ఆ విషయం తెలియక వీళ్ళు అటువైపే వెళ్తారు. ఇంతలో చీకటి పడటంతో అక్కడే ఒకచోట స్టే చేస్తారు. ఆ ప్రాంతంలో ఒక అదృశ్య వ్యక్తి వీళ్ళను దారుణంగా కొట్టి, ఒక గృహలో బంధిస్తాడు. మరోవైపు అంజన ఉండే హాస్టల్ వార్డెన్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. గత రెండు రోజులుగా అంజన కనపడుటలేదు అని చెప్తుంది. పోలీసులు ఎక్కడికి వెళ్లిందని అడుగుతారు. అందుకు ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో వెకేషన్ కని చెప్పి వెళ్లిందని పోలీసులకి చెప్తుంది. అయితే ఆ బాయ్ ఫ్రెండ్ హోమ్ మినిస్టర్ కొడుకు అని చెప్పగానే, పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుంటారు.

పోలీసులు కార్తీక్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఎటు వెళ్ళాడో తెలుసుకుంటూ ఉంటారు. ఇన్స్పెక్టర్ ఒక పోలీసుని ఆ ప్రాంతంలోకి పంపిస్తాడు. అయితే అతన్ని కూడా ఆ సైకో వ్యక్తి బంధిస్తాడు. అప్పుడు ఆ ప్రాంతం రిస్ట్రిక్టేడ్ ఏరియా అని పోలీస్ తెలుసుకుంటాడు. ఆ ప్రాంతంలో ఒక మిస్టరీ కూడా జరిగి ఉంటుంది. చివరికి ఇన్స్పెక్టర్ ఆ మిస్టరీ గురించి తెలుసుకుంటాడా? ఇన్స్పెక్టర్, ఆ సైకో వ్యక్తి నుంచి పోలీసులు కార్తీక్, సంజనలను కాపాడతారా ? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘రూట్ నెంబర్ 17’ అనే ఈ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×