Shazahn Padamsee: టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎన్నో సినిమాలు మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. అయితే ఆయన నటించిన సినిమాల్లో డిజాస్టర్ గా మిగిలిన సినిమా ఆరెంజ్. స్టోరీ పర్వాలేదు అనిపించినా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జనాలను ఆకట్టుకోలేకపోయింది. తనతో సినిమా యావరేజ్ టాక్ ను అందుకోవడం తో పాటు కలెక్షన్స్ కూడా అంతంత మాత్రమే వచ్చాయి. అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ మ్యూజిక్ పరంగా మంచి రెస్పాన్స్ అందుకుంది.. ఈ మూవీలోని ప్రతి సాంగ్ జనాలను బాగా అలరించాయి. ఈ సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహించగా హరీష్ జయరాజ్ సంగీతం అందించారు.. ఈ మూవీలో రుబా పేరు వినిపిస్తుంది. ఆమె ఇన్నాళ్లకు పెళ్లి పీటలు ఎక్కబోతుందని తెలుస్తుంది. తాజాగా ఈమె ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
రామ్ చరణ్ ప్రేయసి రూబాగా కనిపించింది. అలాగే వీరిద్దరి మధ్య వచ్చే సాంగ్ సైతం సూపర్ హిట్ అయ్యింది.ఈ బ్యూటీ పేరు షాజన్ పదంసి. మూవీల్లోకి రాకముందు పలు వాణిజ్య ప్రకటనలలో కనిపించిన ఈ అమ్మడు.. యాడ్ లతో అందరి దృష్టిని ఆకర్శించింది. దాంతో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. కనిమొళి చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ దిల్ తో బచ్చా హై జీ, హౌస్ ఫుల్ 2 వంటి సినిమాలు చేసింది. ఆరెంజ్ తర్వాత రామ్ పోతినేని సరసన మసాలా మూవీలో కనిపించింది. 2015లో సాలిడ్ పటేల్స్ తర్వాత హిందీలో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు 2023లో పాగల్ పన్ నెక్ట్స్ లెవల్ చిత్రంలో నటించింది.
ఇక ఆ సినిమా కూడా ఓ మాదిరిగా పర్వాలేదనిపించింది. కానీ స్టార్డం అనేది ఆమెకు ఇంకా రాలేదు. ఇక పర్సనల్ లైఫ్ ని డిలీట్ చేయాలని అనుకుంది. తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. తన నిశ్చితార్థం ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ప్రియుడు వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో రోకా జరిగినట్లు వెల్లడించింది.. ఇప్పుడు నా కొత్త జర్నీ మొదలైంది నవ్వు గది ఏడాది నవంబర్లో నాకు నా ప్రియుడు ప్రపోజ్ చేశాడు ఇప్పుడు మేము పెళ్లితో ఒకటి కాబోతున్నామని ఆమె తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం మీరు ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా జెనీలియా నటించిన సంగతి తెలిసిందే. సరికొత్త ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఫ్లాప్ అయింది.. ఈ ను ఫిబ్రవరి 14న థియేటర్ల లో రీరిలీజ్ చేస్తున్నారు.. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయినా రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా గేమ్ చేంజర్అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు తోనూ సుకుమార్ తోను సినిమాలు చేస్తున్నాడు.