3BHK OTT: ఇటీవల కాలంలో థియేటర్లో విడుదలైన సినిమా కేవలం నాలుగు వారాల వ్యవధిలోని ఓటీటీలోకి వచ్చేస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల నుంచి మొదలుకొని చిన్న హీరోల సినిమాలు కూడా నెల రోజులలోపు ఓటీటీలో ప్రసారమౌతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఏడాది ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే యంగ్ హీరో సిద్ధార్థ్(Siddarth) నటించిన 3 BHK సినిమా(3BHKMovie) కూడా జూలై 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు శరత్ కుమార్(Sarath Kumar) దేవయాని (Devayani) హీరో తల్లిదండ్రుల పాత్రలలో నటించి సందడి చేశారు.
సొంత ఇంటి కల…
ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి తన జీవితకాలంలో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవటం కోసం ఎలాంటి ఇబ్బందులు పడతారనే నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ఈ సినిమా జులై 4వ తేదీ విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా ఓటిటి విడుదల గురించి అధికారక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సింప్లీ సౌత్ (Simply South)కైవసం చేసుకుంది.
సింప్లీ సౌత్ ఓటీటీ…
ఇక ఈ సినిమాని ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఓటీటీలో ప్రసారం చేయబోతున్నట్లు తెలియజేశారు. ఇలా ఆగస్టు 1వ తేదీ ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రసారం కానుందని అలాగే విదేశాలలో ఉన్నవారు కూడా ఈ సినిమా అదే రోజు అమెజాన్ ప్రైమ్ లో చూసే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఇక ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో కాకుండా భారత్ లో ఇతర ప్రేక్షకులు చూసే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక భారత్లో ఇతర రాష్ట్రాలలో వారు ఈ సినిమా చూడాలి అంటే ఆగస్టు 8 వరకు వేచి చూడాలని తెలుస్తుంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.
A dream for every middle-class family! 🏡
Recent critically acclaimed drama #3BHK streaming from August 1 in Tamil and Telugu on Simply South🍿!!#OTT_Trackers pic.twitter.com/NDZIE3KBWV— OTT Trackers (@OTT_Trackers) July 29, 2025
ఇక ఈ సినిమా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారికి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాలి. మధ్యతరగతి వారికి ఇల్లు అనేది ఒక కల మాత్రమే కాకుండా ఒక గౌరవంగా కూడా భావిస్తారు. మరి మధ్యతరగతి వారు ఆ గౌరవాన్ని సంపాదించుకోవడం కోసం జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎన్నో త్యాగాలను చేయాల్సి ఉంటుంది.. మరి ఈ సినిమాలో సిద్ధార్థ్ సొంత ఇంటి కల కోసం ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఎన్ని త్యాగాలు చేశారు చివరికి తన సొంత ఇంటి కల నెరవేరిందా? లేదా ? అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో సిద్ధార్థ్ కు జోడిగా మీతా రంగనాథ్(Meetha Ranganath) హీరోయిన్గా సందడి చేశారు. యోగి బాబు చైత్ర వంటి తదితరులు కీలకపాత్రలలో నటించగా శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు.
Also Read: Kangana Ranaut:పవన్ ఫేవరెట్ హీరోయిన్ కంగనా.. ఆమె రియాక్షన్ ఏంటంటే ?