BigTV English

OTT Movie : వయసు పెరగదు, కోరిక ఆగదు … ప్రేమించిన వాళ్లంతా కళ్ళముందే … ఇది మామూలు కథ కాదు

OTT Movie : వయసు పెరగదు, కోరిక ఆగదు … ప్రేమించిన వాళ్లంతా కళ్ళముందే … ఇది మామూలు కథ కాదు

OTT Movie : ప్రపంచంలో కొన్ని సాధ్యం కానివి సినిమాలలోనే సాధ్యం అవుతుంటాయి. అందుకే సినిమాలను ఎగబడి చూస్తుంటారు. అమరత్వం అనేది మనం మాటల్లో వింటూనే ఉంటాము. అయితే కళ్ళముందు చుసిందిలేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక మహిళ అనుకోకుండా అమరత్వం పొందుతుంది. ఆతరువాత స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ అమెరికన్ సినిమా, ఒక మహిళ అమరత్వం కారణంగా ప్రేమ, ఒంటరితనం మధ్య జరిగే ఎమోషనల్ జర్నీని, అందమైన విజువల్స్‌తో సున్నితంగా చూపిస్తుంది. చిన్నపిల్లలు కూడా ఈ సినిమాను ఎంచక్కా చూడొచ్చు. ఈ సినిమా ఎక్కడ చూడొచ్చు? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్దాం పదండి.


స్టోరీలోకి వెళితే

ఈ కథ 1908లో జన్మించిన అడలైన్ అనే ఒక సాధారణ అమెరికన్ మహిళ చుట్టూ తిరుగుతుంది. “నేను సాధారణ జీవితం గడపాలనుకుంటున్నాను!” అని అడలైన్ చిన్నప్పుడు కలలు కంటుంది. ఆమె పెళ్లి చేసుకుని ఫ్లెమ్మింగ్ అనే ఒక అమ్మాయికి తల్లి అవుతుంది. కానీ 1937లో 29 ఏళ్ల వయసులో, ఒక రాత్రి ఆమె కార్ యాక్సిడెంట్‌లో సముద్రంలో పడిపోతుంది. కానీ ఒక మెరుపు ఆమెను తాకి, ఆమె శరీరం వయసు పెరగకుండా ఆగిపోతుంది. “నా బాడీ ఎందుకు వయసు అవడం లేదు?” అని అడలైన్ షాక్ అవుతుంది. ఆమె శాశ్వతంగా 29 ఏళ్ల లుక్‌లో ఉండిపోతుంది. అమరత్వం పొందుతుంది.


అడలైన్‌కు ఈ అమరత్వం ఒక శాపంగా మారుతుంది. “నేను ఎప్పటికీ ఒకేలా ఉంటాను, కానీ నా చుట్టూ అందరూ మారిపోతున్నారు!” అని ఆమె బాధపడుతుంది. ఆమె కూతురు ఫ్లెమ్మింగ్ పెరిగి, వృద్ధురాలిగా మారుతుంది. కానీ అడలైన్ ఇంకా యంగ్‌గా ఉంటుంది. “మమ్మీ, నీవు ఎందుకు ఓల్డ్ అవ్వడం లేదు?” అని ఫ్లెమ్మింగ్ అడుగుతుంది. సమాజం ఆమెను సస్పెక్ట్ చేస్తుంది. FBI ఆమెను “అన్‌నాచురల్” అని వెంబడిస్తుంది. అడలైన్ ప్రతి 10 సంవత్సరాలకు తన గుర్తింపును మార్చి, కొత్త నగరాలకు వెళ్లిపోతూ ఒంటరిగా జీవిస్తుంటుంది. ఆమె ఎవరితోనూ ప్రేమను పంచుకోదు. ఎందుకంటే ప్రేమించినవాళ్లు తనముందే వయసు పెరిగి చనిపోతారని ఆమె భయపడుతుంది.

Read Also : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

ఇక 2014లో సాన్ ఫ్రాన్సిస్కోలో, అడలైన్ కొత్త ఐడెంటిటీతో “జెన్నీ లార్సన్”గా లైబ్రేరియన్‌గా పనిచేస్తుంది. న్యూ ఇయర్ పార్టీలో, ఆమె ఎల్లిస్ జోన్స్ అనే ఒక ఛార్మింగ్, యంగ్ బిజినెస్‌మాన్‌ను కలుస్తుంది. “నీ స్మైల్ చూస్తే, నా హార్ట్ స్టాప్ అయింది!” అని ఎల్లిస్ ఆమెతో సరదాగా అంటాడు. అడలైన్ మొదట అతన్ని రిజెక్ట్ చేస్తుంది. కానీ ఎల్లిస్ పట్టుదలతో “నేను నిన్ను వదులుకోను!” అని ఆమెను ఫాలో అవుతాడు. ఇక వారిద్దరూ డేటింగ్ స్టార్ట్ చేస్తారు. అడలైన్ మళ్లీ ప్రేమలో పడుతుంది. “ఇది నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను!” అని ఆమె ఎమోషనల్‌గా అనుకుంటుంది. కానీ ఆమె సీక్రెట్ బయటపడే ప్రమాదం ఉంటుంది. ఎల్లిస్ తన తల్లిదండ్రులు విలియం, కాథీ ను అడలైన్‌కు పరిచయం చేయడానికి వాళ్ళ ఫామ్‌హౌస్‌కు తీసుకెళతాడు. అక్కడ విలియం అనే వ్యక్తి అడలైన్‌ను చూసి షాక్ అవుతాడు. “అడలైన్, నీవు ఇక్కడ ఎలా?” అని అతను ఆశ్చర్యపోతాడు.

నిజానికి 1960లలో విలియం అడలైన్‌ను ప్రేమించాడు. కానీ ఆమె తన సీక్రెట్ కారణంగా అతన్ని వదిలేసింది. “నీవు ఎప్పటికీ వయసు అవ్వదు, నేను ఒక్కడినే ఓల్డ్ అవుతాను!” అని విలియం బాధపడతాడు. ఎల్లిస్‌కు నీ సీక్రెట్ చెప్పు అని అడలైన్‌ను ఒత్తిడి చేస్తాడు విలియం. కానీ ఆమె భయపడి “నేను మళ్లీ రన్ అవుతాను!” అని ఎస్కేప్ అవుతుంది. ఎల్లిస్ “నీవు ఎందుకు నన్ను వదిలేస్తావు?” అని ఆమె వెనక వెళతాడు. చివరి ట్విస్ట్‌లో అడలైన్ మళ్లీ ఒక కార్ యాక్సిడెంట్‌లో చిక్కుకుంటుంది. ఆమె హార్ట్ స్టాప్ అవుతుంది. కానీ డిఫిబ్రిలేటర్ షాక్‌తో ఆమె మళ్లీ బతుకుతుంది. ఇప్పుడు ఆమెకు ఉన్న పవర్ పోతుందా ? ఎల్లిస్‌కు అసలు విషయం చెబుతుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే

ఈ రొమాంటిక్ ఫాంటసీ మూవీ పేరు ‘ది ఏజ్ ఆఫ్ అడలైన్’ (The Age of Adaline) దీనికి లీ టోలాండ్ క్రీగర్ దర్శకత్వం వహించారు. 112 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 7.2/10 రేటింగ్‌తో ప్రశంసలు అందుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లో ఈసినిమా అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ భాషలో, తెలుగు సబ్‌టైటిల్స్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో బ్లేక్ లైవ్లీ (అడలైన్ బౌమన్), మిచీల్ హుయిస్మాన్ (ఎల్లిస్ జోన్స్), హారిసన్ ఫోర్డ్ (విలియం జోన్స్) ప్రధాన పాత్రల్లో నటించారు.

Related News

OTT Movie : 7 నుంచి 17 ఏళ్ళున్న అమ్మాయిలే టార్గెట్… ఊహించని మలుపులు… థ్రిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : అంతర్జాతీయ స్థాయిలో చితగ్గొట్టిన చిన్న సినిమా… పీడకల నిజమై వెంటాడితే…

OTT Movie : మాఫియా డాన్ చుట్టూ తిరిగే స్టోరీ … కొంచెం రక్తపాతం, కొంచెం కామెడీ …పక్కా ఎంటర్టైనర్

OTT Movie: డబ్బున్న ఆంటీలను నిలువ దోపిడి చేసే అందగాడు.. వాడి ఆట కట్టించే కిలాడి, ఈ మూవీ పెద్దలకు మాత్రమే!

SU from SO OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Big Stories

×