E-Paper
Advertisement

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!
Advertisement

Samantha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత (Samantha) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నాగచైతన్య (Naga Chaitanya) ను ప్రేమించి, పెళ్లి చేసుకోవడం, విడాకులు ఆ తర్వాత మయో సైటిస్ బారిన పడడం,ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) తో ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం అన్నీ చకచగా జరిగిపోయాయి. ప్రస్తుతం ఆమె గర్భం దాల్చింది. సాధారణంగా ఎవరైనా సరే ప్రెగ్నెన్సీలో ఇంటికే పరిమితం అవుతూ.. ఆధ్యాత్మికంగా పారాయణం చేస్తూ వచ్చే బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే సమంత ఇందుకు భిన్నం అనే చెప్పాలి. ఒకవైపు కడుపులో బిడ్డను మోస్తూనే.. బిడ్డకు కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే.. మరొకవైపు తన కెరియర్ ను బిల్డ్ చేసుకుంటుంది.

సమంత హోస్ట్ గా కుకింగ్ షో ప్రారంభం..

ఈ క్రమంలోనే సినిమాలలో నటించకపోయినా.. తాజాగా సోనీ లైవ్ ఓటిటి కోసం హోస్ట్ అవతారం ఎత్తింది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లీవ్ తో కలిసి ఒక కొత్త ఓటీటీ ప్రాజెక్టు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక కుకింగ్ షో కి ఈమె హోస్ట్ గా వ్యవహరించబోతోంది. ఇప్పటికే చెన్నైలో జరిగిన సోనీ విజా లాంచ్ ఈవెంట్ కి సమంత ప్రత్యేక అతిథిగా హాజరై, సందడి చేసిన విషయం తెలిసిందే. సోనీ లివ్ తమిళంతో కలిసి పనిచేస్తున్నానని , ఇది తనకు కొత్త ఆరంభమని సమంత స్వయంగా వెల్లడించింది.

Advertisement

also read:ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో మీరు గుర్తుపట్టారా?

గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్..

ఇకపోతే తాజాగా సోనీ విజా ‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్’ అనే కుకింగ్ షో ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సమంతా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో అని విడుదల చేయగా ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ ఎపిసోడ్ ను అక్టోబర్ 19వ తేదీన రాత్రి 8 గంటలకు సోనీ లైవ్ లో చాలా గ్రాండ్గా ప్రారంభించనున్నారు. మన సెలబ్రిటీలతో మాస్టర్ చెఫ్ ఫ్యామిలీ అంటూ ప్రారంభించబోతున్న ఈ కొత్త షో కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.

Advertisement

ఇది కుకింగ్, కామెడీ మాత్రమే కాదు ఒక ఎమోషనల్ షో అనే చెప్పాలి. తాజాగా విడుదల చేసిన ఎపిసోడ్ ప్రోమోలో సమంత ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ షోలో ఆమె స్నేహితుడు రాహుల్ తో పాటు పలువురు తమిళ్ సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేశారు.

అభిమానులు భిన్నాభిప్రాయాలు..

తాజాగా విడుదల చేసిన ఎపిసోడ్ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నా.. వినోద బరితంగా సాగితే ఓకే కానీ.. సమంత ఈ సమయంలో ఎమోషనల్ అవడం సరైనదేనా అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. సంతోషంగా ఉండాల్సిన ఈ సమయంలో సమంత కాస్త ఎమోషనల్ అవ్వకుండా ఉండడమే బెటర్ అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే తాజాగా విడుదల చేసిన సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ప్రోమో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

కూరగాయల కోసం కొంటె కుందేలు పోరాటం… పిల్లలతో కలిసి ఎంచక్కా చూడదగ్గ యానిమేషన్ కామెడీ

పెళ్ళైనట్టు నటిస్తూ ఇవేం మెంటల్ మాస్ పనులు భయ్యా… యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టే కామెడీ సిరీస్

అపార్ట్‌మెంట్‌లో అపరిచిత శవం… ప్రైమ్ వీడియోలోకి డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్

భర్త, ప్రాణ స్నేహితురాలు కలిసి చంపేశారు… గతంలోకి వెళ్ళిన భార్య వాళ్లకే పెళ్లి చేయాలనుకుంటే ? అదిరిపోయే కొరియన్ రివెంజ్ డ్రామా

దెయ్యాలనే నమ్మని యువతికి దడుచుకునే ట్విస్ట్… మస్ట్ వాచ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

హత్య వెనకున్న మతిపోగొట్టే మిస్టరీ… ఉత్కంఠ రేపుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ సీజన్ 24

Big Stories

Advertisement
×