E-Paper
Advertisement

ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో మీరు గుర్తుపట్టారా?

ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో మీరు గుర్తుపట్టారా?
Advertisement

Film industry:సాధారణంగా సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు ఆడియన్స్ కు చేరువ అవ్వడానికి తమకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయిన తర్వాత వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటూ మరింత ఆదరణ సొంతం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఎవరూ చూడని తమ చిన్ననాటి ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో వారసురాలు కూడా తన చిన్ననాటి ఫోటోలను అభిమానులతో పంచుకుంది. మరి పైన కనిపిస్తున్న ఆ ముద్దులొలికే చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ముఖ్యంగా ఆ చిన్నారి ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే.. ఇండస్ట్రీని శాసిస్తున్న ఒక స్టార్ హీరో కూతురు అని మీకు తెలుసా? మరింకెందుకు ఆలస్యం ఆ చిన్నారి ఎవరో ఇప్పుడే చూసేద్దాం..

పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?

ఈమె ఎవరో కాదు తన అద్భుతమైన నటనతో, విలక్షణ ప్రతిభతో విశ్వరూపం చూపిస్తూ లోక నాయకుడిగా పేరు సొంతం చేసుకున్న కమలహాసన్ (Kamala Hassan) చిన్న కూతురు అక్షర హాసన్ (Akshara Haasan). ఒకప్పుడు తన అద్భుతమైన నటనతో ఇండస్ట్రీనే శాసించిన కమలహాసన్.. ఇప్పటికీ కూడా హీరోగా, నిర్మాతగా , అటు పొలిటికల్ పరంగా కూడా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈయనకు ఇద్దరు కూతుర్లు కాగా, పెద్దమ్మాయి శృతిహాసన్ ఇప్పటికే పాన్ ఇండియా హీరోయిన్గా దూసుకుపోతోంది. ఇక చిన్నమ్మాయి అక్షర హాసన్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ఇక అక్షర హాసన్ పంచుకున్న ఈ ఫోటోలలో.. తల్లి ఒడిలో తీక్షనంగా చూస్తున్న ఒక ఫోటోని పంచుకున్న ఈమె.. మరో ఫోటోలో తన తల్లిదండ్రులు ఇద్దరు ముద్దాడుతున్న ఆ క్షణాన్ని అభిమానులతో పంచుకుంది. అలా కొన్ని ఫోటోలు షేర్ చేసిన అక్షర హాసన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఇలా రాసుకుంది

కమలహాసన్ వారసురాలు అక్షరాహాసన్..

Advertisement

“గత కొన్ని సంవత్సరాలుగా నేను అందుకున్న అత్యుత్తమమైన బహుమతులలో ఇది కూడా ఒకటి. ఇంతటి అమూల్యమైన చిత్రాలను తీసిన టెక్వానీ అంకుల్ కి ధన్యవాదాలు. సారిక హాసన్, కమలహాసన్ ఇద్దరు నా తల్లిదండ్రులు కావడం నేను చేసుకున్న అదృష్టం. నా వారసత్వం గురించి నేను చాలా గర్వపడుతున్నాను. బలం అనేది కేవలం జీన్స్ మాత్రమే కాదు అదొక భావన * అంటూ తన అభిప్రాయాన్ని పంచుకుంది. అంతేకాదు రెడ్ హార్ట్ లవ్ ఎమోజిలతో పాటు ఈవిల్ ఐ ఎమోజీలను కూడా షేర్ చేసింది. మొత్తానికి అయితే అక్షర హాసన్ చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు సో క్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

also read:పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న బాలయ్య కూతురు.. అక్కడి నుంచే పోటీ!

అక్షర హాసన్ కెరియర్..

Advertisement

కమలహాసన్ , సారిక దంపతులకు 1991 అక్టోబర్ 12న జన్మించిన ఈమెకు ఒక సోదరి ఉంది. ఆమె శృతిహాసన్. 2015లో కామెడీ డ్రామా అయినా షమితాబ్ అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె.. ఆ తర్వాత 2019లో కాడారం కొండన్ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఈమె తన తల్లి సారికతో కలిసి ముంబైలోనే నివసిస్తోంది. ఇకపోతే గతంలో నాస్తికురాలిగా ఉన్న ఈమె బౌద్ధమతం పట్ల ఆకర్షితురాలై బౌద్ధ మతాన్ని స్వీకరించింది.

Related News

పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న బాలయ్య కూతురు.. అక్కడి నుంచే పోటీ!

విజయ్‌ను ట్రోల్ చేసేవాళ్లు ఇది వినాల్సిందే.. హరీష్ శంకర్ స్ట్రాంగ్ ఆన్సర్!

నన్ను గెలికితే ఎవడినీ వదలను…విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్.. బుల్లిరాజు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

నవరాత్రి స్పెషల్.. అమ్మవారిలా మారిపోయిన కృతి కర్బందా!

భార్యతో గొడవలకు కారణం అదేనా? హర్ష చెముడు ఓపెన్ కామెంట్స్!

Big Stories

Advertisement
×