Mandaadi : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోల బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు. కేవలం బ్యాగ్రౌండ్ వాళ్లకి సినిమా ఓపెనింగ్ వరకు మాత్రమే పనికొచ్చింది. ఆ తర్వాత వాళ్లను వాళ్ళు ప్రూవ్ చేసుకొని హీరోలుగా నిలద్రొక్కుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు బ్యాక్ గ్రౌండ్ ద్వారా వచ్చిన వాళ్ళే, అయితే బ్యాక్ గ్రౌండ్ ద్వారా వచ్చారు అని పేరే కానీ వాళ్ళకంటూ ఒక స్థాయిని, ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సాధించుకున్నారు.
ఇకపోతే ఇండస్ట్రీలో స్వయంకృషితో వచ్చిన హీరోలు కూడా కొందరు ఉన్నారు. వారిలో రవితేజ దగ్గర నుంచి మొదలు పెడితే నేటి తరంలో నాని, నవీన్ పోలిశెట్టి, సుహాస్ వీళ్ళ పేర్లను చెప్పొచ్చు. ఇకపోతే ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి, సుహాస్ వచ్చిన అవకాశాలన్నింటినీ చేసేయకుండా, చాలా పద్ధతిగా ప్లానింగ్ ప్రకారం వాళ్లకు నచ్చే సినిమాలు మాత్రమే ఎంచుకొని ఆడియన్స్ మెచ్చే విధంగా చేస్తున్నారు.
వరుస హిట్ సినిమాలు
సుహాస్ విషయానికి వస్తే మొదటి మూడు సినిమాలు మంచి పేరును తీసుకొచ్చాయి. అయితే వాటిలో ఒక సినిమా డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ అయింది. అదే కలర్ ఫోటో. ఆ సినిమాతోనే సుహాస్ మంచి పేరును సాధించుకున్నాడు. ఆ తర్వాత సుహాస్ చేసిన రెండవ సినిమా రైటర్ పద్మభూషణ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి హిట్ అయి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలను కూడా అందుకుంది. ఇకపోతే సుహాస్ చేసిన మూడో సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమా మంచి హిట్ అయిందని చెప్పవచ్చు. కమర్షియల్ గా హిట్ కావడమే కాకుండా ఈ సినిమాకి కూడా మంచి ప్రశంసలు లభించాయి.
తమిళంలో డెబ్యూ
తెలుగులో మంచి గుర్తింపు సాధించుకున్న సుహాస్ ఇప్పుడు తమిళంలో మండాడి అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు మతిమారన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కేవలం సుహాస్ మాత్రమే కాకుండా ప్రధాన పాత్రలో సూరి కూడా నటిస్తున్నాడు. అయితే మణిరత్నం తెరకెక్కించిన రావన్ సినిమా లాగా తమిళంలో రిలీజ్ కాబోయే ఈ సినిమాలో సుహాస్ విలన్ గా కనిపిస్తాడు. తెలుగులో రిలీజ్ కాబోయే ఈ సినిమాలో సుహాస్ హీరోగా సూర్య విలన్ గా కనిపిస్తాడు. ఒక తరుణంలో మహేష్ బాబు, విజయ్ ను ఇలా చూపించి సినిమా చేయాలి అనే ప్లాన్ వేశాడు దర్శకుడు మురుగదాసు కానీ అది ఎందుకో పట్టాలెక్కలేదు. ఇక్కడ ఈ ప్రయత్నం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాలి.
Also Read : Single Movie : మరి ఇంత చిన్న సినిమా ఏంటి శివయ్యా.?