BigTV English

Sankranthiki Vasthunnam: వెంకటేష్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Sankranthiki Vasthunnam: వెంకటేష్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Sankranthiki Vasthunnam:విక్టరీ వెంకటేష్ (Venkatesh) 75 వ చిత్రంగా వచ్చిన ‘సైంధవ్’ సినిమా డిజాస్టర్ కావడంతో తదుపరి చిత్రంపై వెంకటేష్ తో పాటు ఆయన అభిమానులు కూడా అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి చేసిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వెంకటేష్ నటన, మ్యూజిక్, కామెడీ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి.కానీ స్క్రీన్ ప్లే ఈ సినిమాకి కాస్త మైనస్ గా మారింది అని సమాచారం. ఓవరాల్ గా ఈ సినిమా అటు బ్లాక్ బస్టర్ హిట్ కాదు కానీ ఒకసారి అయితే కచ్చితంగా చూడవచ్చు అని ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


సంక్రాంతి రేస్ లో నిలిచిన చిత్రాలు..

ఇకపోతే ఈ సంక్రాంతి రేసులో నిలిచిన రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ(Balakrishna ) ‘డాకు మహారాజ్’, ఇప్పుడు వెంకటేష్(Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు.. వేటికవే ప్రత్యేకత చాటుకుంటున్నాయి. కానీ కచ్చితంగా ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అని చెప్పడానికి లేదు. ముఖ్యంగా పూర్తి రన్ ముగిసిన తర్వాత ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి అనే దాని పైన సంక్రాంతి విజేత ఏ సినిమా అనేది డిపెండ్ అవుతుంది అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.


ఓటీటీ డీల్..

ఇదిలా ఉండగా ఏ సినిమా అయినా సరే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత కచ్చితంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను, సాటిలైట్ హక్కులను పలు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ కూడా కొనుగోలు చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఓటీటీ ప్లాట్ఫారం కూడా ఫిక్స్ అయినట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.అసలు విషయంలోకి వెళ్తే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అలాగే సాటిలైట్ హక్కులను జీ గ్రూప్ సంస్థ దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో థియేటర్ ముగిసిన తర్వాత విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా Zee 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అని సమాచారం. ఇకపోతే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఫిబ్రవరి చివరి వారంలో ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. కానీ ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఈ సినిమా ఓటిటి హక్కుల గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే. ఇకపోతే జనవరి 14వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ చేపట్టిన విషయం తెలిసిందే ఏది ఏమైనా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చుతుంది అని చెప్పవచ్చు.

Related News

OTT Movie : చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : ఈ ఊర్లో అమ్మాయిల్ని పుట్టకుండానే చంపేస్తారు… అలాంటి గ్రామాన్ని మార్చే ఆడపిల్ల… ఒక్కో ట్విస్ట్ మెంటల్ మాస్

OTT Movie : అవెంజర్స్ ను జాంబీలుగా మార్చే వైరస్… ప్రపంచాన్ని అంతం చేసే డాక్టర్ డూమ్ ఈవిల్ నెస్

OTT Movie : ఆఫీస్ లో పీడకలగా మారే చివరిరోజు… ఈ కొరియన్ కిల్లర్ అరాచకం చూస్తే గుండె జారిపోద్ది మావా

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

Big Stories

×