BigTV English

Saripodhaa Sanivaram: 28 రోజులకే ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..?

Saripodhaa Sanivaram: 28 రోజులకే ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..?

Saripodhaa Sanivaram : ట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తనదైన నటన, కామెడీ, టైమింగ్, డాన్స్, ఎక్స్ప్రెషన్ ఇలా అన్నింటిలో కూడా రాణిస్తూ సత్తా చాటుతున్న నాని ఒకవైపు హీరోగా మరొకవైపు నిర్మాతగా దూసుకుపోతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవలే నాచురల్ స్టార్ హీరో నాని (Nani) హీరోగా ప్రముఖ దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Aatreya) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిపోదా శనివారం (Saripodhaa Sanivaram). యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని, నాని హిట్ సినిమాల జాబితాలో చేరిపోయింది. ఇక ఇప్పుడు ఓటిటి ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది.


ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్(Net flix)లో సెప్టెంబర్ 26వ తేదీ నుంచి ప్రసారం కానుంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమయ్యింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సదరు సంస్థ ప్రకటిస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఇకపోతే ఈ చిత్రంలో ఎస్. జె. సూర్య విలన్ గా నటించగా, నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ (Priyanka Mohan) గా నటించారు. సాయికుమార్, అభిరామి, అదితి బాలన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.


Saripodhaa Sanivaram: OTT date lock.. Since when is streaming..?
Saripodhaa Sanivaram: OTT date lock.. Since when is streaming..?

సరిపోదా శనివారం కథ..

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సూర్యకి చిన్నప్పటి నుంచి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కోపాన్ని అదుపులో పెట్టడం కోసం.. తాను చనిపోతూ మాట తీసుకుంటుంది నాని తల్లి ఛాయాదేవి (అభిరామి). అప్పటి నుంచి వారమంతా ఎంత కోపం వచ్చినా సరే నియంత్రించుకుంటూ.. శనివారం మాత్రమే తన కోపానికి కారణమైన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటాడు నాని. దాంతో ఆ గొడవలు కాస్త ఇంటి వరకు వస్తూ ఉంటాయి. తండ్రి సాయికుమార్, అక్క అదితి నాని తెచ్చిపెట్టే గొడవలకు ఇబ్బందులు పడుతూ ఉంటారు.

ఎన్ఎల్ఐసి లో ఉద్యోగం చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకున్న నాని జాబితాలోకి సిఐ దయానంద్ (ఎస్ జె సూర్య) కూడా వచ్చి చేరతాడు. తన సొంత అన్న కూర్మానంద్ (మురళీ శర్మ) తో వైరమున్న సీఐ దయానంద్ కథ ఏమిటి? అతనికి సోకులపాలం అనే ఊరికి ఉన్న సంబంధం ఏమిటి.? అసలు దయానంద పై సూర్యకు కోపం రావడానికి కారణం? సోకులపాలానికి ఎలాంటి మేలు చేసింది? వీళ్ళ కథలోకి హీరోయిన్ ఎలా ప్రవేశించింది ? అనేది ఈ సినిమా కథ. మొత్తానికి అయితే ఈ సినిమా సస్పెన్స్ గా సాగుతూ అందరినీ ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇకపోతే ఓటిటి వేదికగా ఎటువంటి టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×