BigTV English

Flipkart Big Billion Days Sale 2024: స్మార్ట్‌ఫోన్ల జాతర.. రూ.7,499లకే 5జీ ఫోన్, మొత్తం 6 మోడళ్లపై భారీ డిస్కౌంట్లు!

Flipkart Big Billion Days Sale 2024: స్మార్ట్‌ఫోన్ల జాతర.. రూ.7,499లకే 5జీ ఫోన్, మొత్తం 6 మోడళ్లపై భారీ డిస్కౌంట్లు!

Mad Retail Price: ఊహకందని డిస్కౌంట్లు, అదిరిపోయే ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇదే మంచి ఛాన్స్. ఎందుకంటే ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ ఫాం అయిన ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన సేల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగానే తన ‘ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024’ను సెప్టెంబర్ 27 నుంచి వినియోగదారుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ సెప్టెంబర్ 26 నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, హోమ్, ఫ్యాషన్ తదితర ప్రొడెక్టులపై బంపర్ డిస్కౌంట్లు అందిస్తుంది.


సేల్ సమయంలో టాప్ ఎండ్ స్పెసిఫికేషన్‌లతో కూడిన అనేక స్మార్ట్‌ఫోన్లు తగ్గింపు ధరలతో లిస్ట్ చేయబడతాయని Poco వెల్లడించింది. Pocoకి సంబంధించిన హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు అయిన Poco F6 5G, Poco X6 Pro 5G వంటివి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భారీ తగ్గింపులు పొందుతున్నాయి. ఒక్క ధర తగ్గింపులే కాకుండా ఎక్స్‌ట్రాగా నో-కాస్ట్ EMI ఆప్షన్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా పోకో ‘Mad Retail Price’ క్యాంపెయిన్‌న్ని సంస్థ ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా Xiaomi సబ్-బ్రాండ్ పోకో తన F, X, M, C లైనప్‌లలో అద్భుతమైన తగ్గింపులతో అనేక స్మార్ట్‌ఫోన్లను సేల్‌లో అందుబాటులో ఉంచింది. ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.


Also Read:  ఉఫ్ ఉఫ్.. చెమటలు పట్టించే ఐఫోన్ ఆఫర్, చాలా తక్కువకే కొనేయొచ్చు!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 సమయంలో Poco F6 5G ధర భారీగా తగ్గింది. దీని అసలు ధర రూ.29,999 ఉండగా ఇప్పుడు కేవలం రూ.21,999కి అందుబాటులో ఉంటుంది. అలాగే దీంతోపాటు Poco X6 Pro 5Gపై కూడా కళ్లు చెదిరే డిస్కౌంట్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.26,999 ఉండగా ఇప్పుడు కేవలం రూ.18,999లకే రాబోయే సేల్‌లో పొందవచ్చు.

ఇవి మాత్రమే కాకుండా Poco X6 5Gని సేల్ సమయంలో రూ.21,999 అసలు ధర ఉన్న ఈ ఫోన్‌ను రూ.14,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇక అదే సమయంలో Poco X6 Neo 5G స్మార్ట్‌ఫోన్‌ని సేల్ సమయంలో మరింత తక్కువకు కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.15,999 ఉండగా ఇప్పుడు రూ.11,999లకి సొంతం చేసుకోవచ్చు. Poco F6 5G, ఇతర Poco X సిరీస్ ఫోన్‌లు ప్రైమ్ సభ్యులకు సెప్టెంబరు 26 నుండి బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో తగ్గింపు ధరలతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.

కేవలం ఈ ఫోన్లు మాత్రమే కాకుండా Poco M6 ప్లస్ 5G రాబోయే సేల్‌లో రూ.13,499కి బదులుగా తగ్గింపు ధరతో రూ.10,000లకు కొనుక్కోవచ్చు. అలాగే Poco M6 5G అసలు ధర రూ.10,499 ఉండగా ఇప్పుడు రూ.7,499 ధరతో కొనుక్కోవచ్చు. ఒక 5జీ ఫోన్‌ను ఇంత తక్కువ ధరకు కొనుక్కోవడం విశేషం అనే చెప్పాలి. అంతేకాకుండా Poco C65, Poco C61లను వరుసగా రూ.6,799, రూ.6,299 లతో కొనుగోలు చేయవచ్చు. అందువల్ల అతి చీప్ ధరలో 5జీ పోకో ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేసే వారికి ఇది బెస్ట్‌గా చెప్పుకోవచ్చు.

Related News

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Big Stories

×