OTT Movie : ఆడవాళ్ళను వంటింటి కుందేలు లా చూడటం ఎప్పటినుంచో జరుగుతూ వస్తోంది. వాళ్లకున్న సమస్యలను పట్టించుకోకుండా, కేవలం వంటగది, పడకగదికి మాత్రమే పరిమితం అన్నట్టుగా చూస్తున్నారు. చాలా కుటుంబాలలో ఇప్పటికీ ఇలానే జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఈస్టోరీ వంటింట్లో ఒక మహిళ పడే వేదనను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఆడవాళ్లకు ఒళ్ళు మండితే ఎలా ఉంటుందో కూడా చూపించారు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
జీ 5 (ZEE5)లో
ఈ బాలీవుడ్ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘Mrs’ 2024లో విడుదలైన ఈ సినిమాకి అరతి కడవ్ దర్శకత్వం వహించారు. ఇది 2021 లో వచ్చిన మలయాళ చిత్రం “The Great Indian Kitchen” కి రీమేక్ గా వచ్చింది. ఇందులో సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించగా, నిషాంత్ దహియా, కన్వల్జీత్ సింగ్, అపర్ణ ఘోషల్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 7 నుంచి జీ 5 (ZEE5)లో అందుబాటులోకి వచ్చింది. అంతే కాకుండా సన్యా మల్హోత్రా తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 111 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDBలో 6.6/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
రిచా (సన్యా మల్హోత్రా) ఒక డాన్స్ టీచర్ గా ఉంటూ, తన కలలను సాకారం చేసుకోవాలనే ఆశతో ఉంటుంది. ఆమె దివాకర్ అనే ఒక డాక్టర్ ను (నిషాంత్ దహియా)ను వివాహం చేసుకుంటుంది. మొదట్లో వీళ్ళ సంబంధం ప్రేమతో ఉన్నట్లు కనిపిస్తుంది. రిచా కూడా తన కొత్త జీవితంలో సంతోషంగా ఉంటుంది. దివాకర్ కుటుంబం ఆమెను “మా కూతురు” అని స్వాగతిస్తారు. కానీ వీళ్ళ సాంప్రదాయ పద్దతులు హద్దులు దాటుతాయి.పెళ్ళి తర్వాత రిచా తన అత్తగారితో కలిసి వంటగదిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆమె రోజూ ఉదయం పొద్దున్నే లేచి, కుటుంబానికి వంట చేస్తుంది, ఫుల్కాలు, చట్నీలు, ఇతర సాంప్రదాయ వంటకాలను సిద్ధం చేస్తుంది. అయితే ఇంట్లో మగవాళ్ళు తమ ఫోన్‌లతో గానీ, యోగాలో గానీ బిజీగా ఉంటారు. ఆమె డ్యాన్సర్ అవ్వాలనుకునే అవకాశం లేకుండా, ఆమె జీవితం వంటగదికే పరిమితమవుతుంది.
రిచా భర్త దివాకర్, మొదట స్నేహపూర్వకంగా కనిపించినా, క్రమంగా తన పురుషాధిక్యతను చూపిస్తాడు. రిచా ఇంటి పనులతో బాగా అలసిపోయి వచ్చినప్పుడు, విశ్రాంతి ఇవ్వకుండా ఆమెతో ఏకాంతంగా గడపడానికి ఒత్తిడి చేస్తాడు. అత్తగారు మీనా కూడా ఇలాంటి జీవితానికి అలవాటుపడి, రిచాను కూడా ఈ జీవనశైలికి అలవాటుపడమని సలహా ఇస్తుంది. రిచా తల్లి కూడా ఇలాగే చెప్పడంతో ఆమె ఆలోచనలో పడిపోతుంది. రిచా కు నిరాశ, అసంతృప్తి క్రమంగా పెరుగుతాయి. ఒక రోజు ఆమె అత్తగారి బర్త్‌డే పార్టీ కోసం వంటగదిలో గంటల తరబడి పనిచేస్తుంది. కానీ లీక్ అయ్యే సింక్ నీటిని అతిథులకు సర్వ్ చేయాలని నిర్ణయించుకుంటుంది. అలాగే ఆ నీటిని సర్వ్ చేస్తుంది. దివాకర్, అతని తండ్రి కోపంతో వంటగదిలోకి వస్తారు. కానీ రిచా ఆ డర్టీ నీటిని దివాకర్ మీద పడేసి, ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఆమె డివోర్స్‌కు సిద్ధమవుతుంది. చివరికి ఆమె సింగిల్ గా బతకడానికి నిర్ణయించుకుంటుందా ? భర్తకు విడాకులు ఇస్తుందా ? వంటింటి కుందేలుగా రాజీ పడుతుందా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : కజిన్ తో కాక్టైల్ … ప్రియుడితో పాప్కార్న్… పోలీసోడితో లాలీపాప్… ఈ టీనేజ్ పాప రచ్చ వేరే లెవెల్ బాసూ