BigTV English

Natasa Stankovic : బాక్సింగ్ లోకి ఎంట్రీ ఇస్తున్న టీమిండియా ఆల్ రౌండర్ భార్య

Natasa Stankovic : బాక్సింగ్ లోకి ఎంట్రీ ఇస్తున్న టీమిండియా ఆల్ రౌండర్ భార్య

Natasa Stankovic : టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యా.. నటాషా స్టాంకోవిచ్ ని వివాహం చేసుకొని విడాకులుతీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల తరువాత నిత్యం నటాషా వార్తల్లో నిలుస్తుంటుంది. విడాకుల తరువాత కూడా తమ కొడుకుతో తల్లిదండ్రులుగా మా ఇద్దరి బంధం కొనసాగుతుందని.. అగస్త్య కోసం అన్ని బాధ్యతలు తీసుకుంటానని పాండ్యా స్పష్టం చేసాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే..? నటాషా స్టాంకోవిచ్ బాక్సర్ గా మారింది. ఒక బాక్సింగ్ ఛాంపియన్  మాదిరిగా బాక్సింగ్ చేస్తోంది. ఇంత బాగా బాక్సింగ్ చేస్తుంది.. గతంలో ఈమె బాక్సింగ్ నేర్చుకుందా..? ఏంటి..? బాక్సింగ్ ఛాంపియన్ మాదిరిగానే కనిపిస్తోంది అని నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


Also Read : World Club Championship : క్రికెట్ ఫ్యాన్స్ కు పండుగ.. మినీ ఐపీఎల్ వచ్చేస్తోంది… తేదీలు ఇవే

నటాషా బాక్సింగ్ ఎంట్రీకి కారణం అదేనా..? 


హార్దిక్ పాండ్యాతో 2024లో విడిపోయింది నటాషా. పాండ్యాతో విడిపోయిన తరువాత నటాషా కొత్త బాయ్ ఫ్రెండ్ తో కనిపిస్తోందని పలు కథనాలు వెలువడ్డ విషయం తెలిసిందే. తన స్నేహితుడు, ఫిట్ నెస్ ట్రైనర్ అలెగ్జాండర్ ఇలిక్ తో పబ్లిక్ గా మీడియాకు కనిపించడంతో ఈ ఊహగానాలకు రెక్కలొచ్చాయి. ఈ తరుణంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మళ్లీ ప్రేమలో పడ్డారా..? అనే ప్రశ్నకు నటాషా స్పందించారు. మళ్లీ ప్రేమలో పడటానికి తానేమీ వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చింది. కొత్త అనుభవాలు, కొత్త అవకాశాలు, ప్రేమను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. జీవితం ఏది అందించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. విడాకులు తీసుకున్న తరువాత మళ్లీ లవ్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. తాను ప్రేమకు వ్యతిరేకం కాదని.. సరైన సమయం వచ్చినప్పుడుసరైన అనుబంధం ఏర్పడుతుందని నమముతున్నానని వ్యాఖ్యానించింది.

బ్రదర్ అంటూనే.. 

మరోవైపు గత ఏడాది తనకు చాలా కష్టంగా గడిచిందని.. హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకోవడం తనను బాధించిందని తెలిపింది. వాస్తవానికి సవాళ్లను ఎదుర్కొంటేనే మనం రాటుదేలుతామని.. మనుషులు వయస్సుతో కాకుండా అనుభవాలతో పరిణితి చెందుతారని వెల్లడించింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమయ్యానని.. అయితే పరస్పరం అంగీకారంతో పాండ్యా,తాను విడాకులు తీసుకున్నామని.. ఇక జీవితం పై దృష్టి సారిస్తానని తెలిపింది. ఇదిలా ఉంటే.. అగస్త్య అసలు పాండ్యా కొడుకు కాదా..? నటాషా ప్రియుడితో ఎందుకు తిరుగుతున్నాడని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. బ్రదర్ అంటూనే అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది నటాషా. అది చాలదన్నట్టు ఇద్దరూ కలిసి పార్టీలకు, పబ్బులకు వెళ్తున్నట్టు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవలే హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్య పాండ్యాను మచ్చిక చేసుకునేందుకు నటాషా ప్రియుడు అలెగ్జాండర్ చాలా ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. తాను ఓ ఈవెంట్ కి వెళ్తే.. అగస్త్య ని కూడా తీసుకెళ్లాడు. దీంతో అసలు హార్దిక్ పాండ్యా కొడుకా..? కాదా..? అని గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చ జరిగిన విషయం విధితమే. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో నటాషా బాక్సర్ గా మారిన వీడియో తెగ వైరల్ కావడం విశేషం. 

Related News

Asia Cup 2025: దరిద్రంగా మారిన గిల్ ఎంపిక… తుది జట్టులో అభిషేక్ శర్మకు నో ఛాన్స్.. ఫైర్ అవుతున్న అభిమానులు !

IND vs Pak : ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌లు జరగడంపై కేంద్రం షాకింగ్ నిర్ణయం !

Wankhede Stadium : మునిగిన ముంబై.. వాంఖడే స్టేడియంలోకి భారీగా వరద.. ఈ విజువల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Rohit Sharma : రోహిత్ శర్మకు ఘోర అవమానం… ఆ మ్యాచ్ లు ఆడాల్సిందేనని బీసీసీఐ ఆదేశాలు

BCCI New Fitness Test : టీమిండియా ప్లేయర్లకు కొత్త పరీక్షలు… 1200 మీటర్లు.. ఐదు రౌండ్లు… రెస్ట్ లేకుండా పరిగెత్తాల్సిందే

Shreyas Iyer Father : నా కొడుకుని వేధిస్తున్నారు.. టీమిండియా కెప్టెన్సీ అడగలేదు.. జట్టులో ఛాన్స్ మాత్రమే ఇవ్వండి ప్లీజ్.. అయ్యర్ తండ్రి ఎమోషనల్

Big Stories

×