E-Paper
Advertisement

Afterburn OTT : సూర్యుడి వల్ల భూవినాశనం… హై-ఆక్టేన్ సర్వైవల్ డ్రామా… కామెడీతో కడుపుబ్బా నవ్వించే డిస్టోపియన్ థ్రిల్లర్

Afterburn OTT : సూర్యుడి వల్ల భూవినాశనం… హై-ఆక్టేన్ సర్వైవల్ డ్రామా… కామెడీతో కడుపుబ్బా నవ్వించే డిస్టోపియన్ థ్రిల్లర్

Afterburn OTT : సైన్స్ ఫిక్షన్, పోస్ట్-అపోకలిప్టిక్ వరల్డ్స్ ఇష్టపడేవాళ్లకి అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది. ఆగస్టు 2025లో థియేటర్లలో రిలీజ్ అయిన ‘ఆఫ్టర్‌బర్న్’ మూవీ ఇప్పుడు భారత్‌ లో మొదటిసారి ఓటీటీలో అందుబాటులోకి రాబోతోంది. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.

లయన్స్ గెట్ ప్లేలో స్ట్రీమింగ్

రెడ్ 5 కామిక్స్ గ్రాఫిక్ నవల ఆధారంగా స్కాట్ చిట్‌వుడ్, పాల్ ఎన్స్, వేన్ నికోల్స్ రాసిన సినిమా ‘ఆఫ్టర్‌బర్న్’. దీనికి మార్టిన్ క్యాంప్‌బెల్ దర్శకత్వం వహించాడు. సోలార్ ఫ్లేర్ వల్ల నాశనమైన భవిష్యత్ వరల్డ్‌ లో సాగే ఈ మూవీ హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్, మంచి కిక్ ఇచ్చే థ్రిల్స్, కాస్త హ్యూమర్ మిక్స్‌తో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. 1 గంట 39 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ పెద్దలకు మాత్రమే అని మరచిపోకండి. ఎందుకంటే మూవీలో తీవ్ర హింస, అసభ్య భాష ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1.3 మిలియన్లు డాలర్లు కలెక్ట్ చేసింది. ఇక ఎట్టకేలకు ఇప్పుడు భారత్‌ లో డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది.

2026 జనవరి 23 నుండి ఈ మూవీ లయన్స్‌గేట్ ప్లే లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో హీరోగా జేక్ ట్రెజర్ హంటర్ పాత్రలో డేవ్ బటిస్టా, ఆగస్ట్ వాలెంటైన్ పాత్రలో సామ్యూల్ ఎల్. జాక్సన్, రెబెల్ ఫైటర్ డ్రీ పాత్రలో ఓల్గా కురిలెంకో, విలన్ రోల్ లో క్రిస్టోఫర్ హివ్జు నటించారు. బటిస్టా యాక్షన్ సీన్స్‌ లో దుమ్మురేపాడు. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’తో ఫేమ్ తెచ్చుకున్న ఈ హీరో ఇందులో కూడా మెప్పించాడు.

Read Also : పెళ్లయ్యాక భార్య అమ్మాయి కాదని తెలిస్తే… హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ భయ్యా

స్టోరీలోకి వెళ్తే…

స్టోరీ 2075లో నడుస్తుంది. సోలార్ ఫ్లేర్ వల్ల భూమి సాంకేతికత నాశనమైన పోస్ట్-అపోకలిప్టిక్ వరల్డ్‌ లో కథ ఉంటుంది. తూర్పు అర్ధగోళం పూర్తిగా డార్క్ ఏజ్‌లోకి వెళ్లిపోతుంది. ఇప్పడు మనుషుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తున్న టెక్నాలజీ అనేది లేకుండా చట్టవిరుద్ధ జీవితం గడుపుతారు అక్కడి జనాలు. మాజీ సైనికుడు జేక్ (డేవ్ బటిస్టా), ఇప్పుడు ట్రెజర్ హంటర్‌ గా టర్న్ తీసుకుంటాడు. అమూల్యమైన కళాఖండాలు, ఆర్టిఫాక్ట్స్ తీసుకొచ్చి అమ్మేసి, సొమ్ము చేసుకుంటాడు. హీరో గురించి తెలుసుకున్న ఆగస్ట్ వాలెంటైన్ (సామ్యూల్ ఎల్. జాక్సన్) అనే పవర్‌ ఫుల్ వ్యక్తి ఓ ఆఫర్ ఇస్తాడు. జేక్‌ ని హైర్ చేసుకుని, మోనాలిసా పెయింటింగ్‌ ని ఫ్రాన్స్ నుండి తీసుకురమ్మంటాడు. ప్రత్యర్థి జనరల్ వోల్కోవ్ (క్రిస్టోఫర్ హివ్జు) చేతికి అందకముందే జేక్ ఈ పనిని చేయాలనేది కండిషన్.

పనిలో చేరిపోయిన జేక్ డ్రీ (ఓల్గా కురిలెంకో) అనే లోకల్ రెబెల్‌తో కలిసి రంగంలోకి దిగుతాడు. మిషన్ మధ్యలో ఉండగా డేంజరస్ సిట్యుయేషన్ లో పడతారు. అలాగే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి. మరి హీరోకి ఎదురైన ప్రమాదం ఏంటి? అతన్ని మోసం చేసింది ఎవరు? ఈ సమస్యల నుంచి హీరో ఎలా బయట పడ్డాడు అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ మూవీ సై-ఫై యాక్షన్ లవర్స్‌ కి బెస్ట్ ఛాయిస్. రాత్రిపూట చూస్తే థ్రిల్ గ్యారంటీ మావా.

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×