OTT Movie : హాలీవుడ్ హారర్ సినిమాలకి, ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. వీటిలో రకరకాల కంటెంట్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే చెప్పుకోబోయే సినిమా, ఒక ఫ్యామిలీ హారర్ థ్రిల్లర్ సినిమాగా చెప్పుకోవచ్చు. భర్తతో విడాకుల కోసం ప్రయత్నిస్తూ, ఒక ప్రమాదంలో భార్య చనిపోతుంది. తరువాత ఆ మహిళ ఆత్మగా మారుతుంది. ఈ ఆత్మ స్టోరీని ఊహించని మలుపులు తిప్పుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
జెఫ్ వాన్ ఒక గ్రాఫిక్ ఆర్టిస్ట్ గా ఉద్యోగం చేస్తుంటాడు. ఇతనికి మాగీ అనే భార్య, జెన్నీ అనే కూతురు ఉంటారు. ఈ మధ్యనే మాగీ విడాకుల కోసం కోర్టుకు వెళ్తుంది. తన కూతుర్ని కూడా తన కస్టడీకి పంపాలని కోర్ట్ లో ఒక పిటిషన్ దాఖలు చేస్తుంది. 8 ఏళ్ల జెన్నీ తన తల్లిదండ్రుల మధ్య విభేదాల్లో నలిగిపోతూ ఉంటుంది. ఈ సమయంలో జెఫ్ తన కెరీర్‌లో, ఒడిదుడుకులు ఎదుర్కుంటూ ఉంటాడు. ఒకసారి మాగీ అతనిని విడిచిపెట్టి జెన్నీని తీసుకెళ్లాలని బెదిరిస్తుంది. అయితే అదే రోజు మాగీ ఒక హిట్-అండ్-రన్ యాక్సిడెంట్‌లో దురదృష్టవశాత్తూ చనిపోతుంది. మాగీ మరణం తర్వాత జెఫ్, జెన్నీ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. కానీ మాగీ తండ్రి పాల్, జెన్నీ కస్టడీ కోసం జెఫ్‌పై కేసు వేస్తాడు. అదే సమయంలో, జెన్నీని చూసుకునే బేబీసిట్టర్ సమంత, జెఫ్‌తో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది.
ఈ సమయంలో, జెఫ్ ఇంట్లో వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. జెన్నీకి తన తల్లి ఆత్మ కనబడుతూ ఉంటుంది. తనతో మాట్లాడటానికి కూడా ప్రయత్నిస్తుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, మాగీ మరణం వెనుక రహస్యం బయటపడుతుంది. సమంత, జెఫ్‌పై ఉన్న ప్రేమతో, మాగీని చంపినట్లు తెలుస్తుంది. జెన్నీని చంపడానికి కూడా ఆహారంలో విషం కలుపుతుంది సమంత. ఈ క్రమంలో మాగీ ఆత్మ సమంతపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. చివరికి మాగీ ఆత్మ సమంతపై ప్రతీకారం తీర్చుకుంటుందా ? భర్తని కూడా టార్చర్ చేస్తుందా ? కూతురిని ఏం చేస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : అమ్మాయి చేతిలో అడ్డంగా బుక్ అయ్యే స్టార్ హీరో… ఈ సినిమా చూస్తే ఎవరినీ లిఫ్ట్ అడగరు
జీ 5 (Zee 5) లో
ఈ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘సెపరేషన్’ (Separation). 2021 లో వచ్చిన ఈ హారర్ సినిమాకు విలియం బ్రెంట్ బెల్ దర్శకత్వం వహించారు. ఇందులో రూపర్ట్ ఫ్రెండ్, మామీ గుమ్మర్, మేడ్‌లైన్ బ్రూవర్, వైలెట్ మెక్‌గ్రా, సైమన్ క్వార్టర్‌మాన్, బ్రియాన్ కాక్స్ వంటి నటులు నటించారు. జీ 5 (Zee 5) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.