BigTV English

Manchu Manoj: సొంత అన్న వల్ల ఇండస్ట్రీలో కూడా అవమానం… మనోజ్ ఆవేదన

Manchu Manoj: సొంత అన్న వల్ల ఇండస్ట్రీలో కూడా అవమానం… మనోజ్ ఆవేదన

Manchu Manoj: టాలీవుడ్ స్టార్స్ మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం. యంగ్ డైరెక్టర్ విజయ కనకమెడల దర్శకత్వంలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై, కేకే రాధా మోహన్ నిర్మిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ మూవీ ఈనెల 30న రిలీజ్ కానుంది.ఈ ఆదివారం ఏలూరులో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా  నిర్వహించిన సంగతి తెలిసినదే. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా హీరో మంచు మనోజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో తన అన్న తనకు అన్యాయం చేశాడంటూ వాపోయారు. ఆ వివరాలు చూద్దాం..


సొంత అన్న వల్ల ఇండస్ట్రీలో కూడా అవమానం..

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ వెండితెరపై కనిపించక ఆరు సంవత్సరాలు అవుతోంది. దీంతో అతని రీఎంట్రీ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొంతకాలంగా సినిమా విషయాల కంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ తోనే ఎక్కువ వార్తల్లో నిలిచాడు మనోజ్. ఇటీవల జరిగిన కుటుంబ తగాదాలు, మనోజ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, దీనిపై విష్ణు మీడియాతో మాట్లాడటం ఇలా ఎన్నో సంఘటనలు మనము చూసాము. ఇటువంటి పరిస్థితుల మధ్య సినిమాని కంప్లీట్ చేశాడు మనోజ్. ఈనెల 18 జరిగిన భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మనోజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈవెంట్ లో తన AV ప్లే అవుతున్నప్పుడు అతను ఎమోషనల్ అవ్వడం, పక్కనే ఉన్న డైరెక్టర్ విజయ్,నారా రోహిత్ ఓదార్చడం జరిగింది. ఇక తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మంచు మనోజ్ ఓ ఇంటర్వ్యూలో మీరు సినిమాలకి ఇన్ని సంవత్సరాలు గ్యాప్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటూ యాంకర్ ప్రశ్నించగా.. మనోజ్ మాట్లాడుతూ.. ‘నాకు మా అన్న విష్ణు  మా(MAA) మెంబర్షిప్ ఇవ్వలేదు.  అన్న నన్ను దూరం పెట్టారు.  వారి వాళ్ళ ఇండ్రస్ట్రీలో ఇబ్బందులు పడ్డాను. సినిమాలకి నేను గ్యాప్ తీసుకోవాలి అని ముందే అనుకున్నాను, ఈ విషయాన్ని అందరితో పంచుకోవడానికి అప్పట్లో ఓ ట్విట్ చేసి తర్వాత డిలీట్ కూడా చేశాను. కానీ ఇంత పెద్ద గ్యాప్ వస్తుందని అనుకోలేదు’ అని మనోజ్ తెలిపారు.


మనోజ్ ఆవేదన..

భైరవం మూవీ ప్రమోషన్స్ లో సినిమా కన్నా ఎక్కువ మనోజ్ తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మనోజ్ ఎమోషనల్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది. అతనికి సపోర్ట్ గా నారా రోహిత్, విజయ్ కనకమెడల, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడడం జరిగింది. ఇక భైరవం యాక్షన్ థ్రిల్లర్ గా మే 30న ప్రేక్షకులకు ముందుకు రానుంది. తమిళ దర్శకుడు శంకర్ కుమార్తె అతిథి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై, శరత్ లోహితస్య, అజయ్ సందీప్ రాజ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ముగ్గురు మల్టీ స్టార్ హీరోస్ కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందంటూ, సినిమా హిట్ అంటూ ట్రైలర్ చూసిన వారంతా కామెంట్స్ చేస్తున్నారు.

Vijay Kanakamedala: టాలివుడ్ బడా హీరోలతో వరుస సినిమాలు.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×