OTT Movie: ఇటీవల ఓ టి టి లో రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. పాత కంటెంట్ తో పాటు కొత్త కంటెంట్ సినిమాలు కూడా ఇక్కడ రిలీజ్ అవుతుండడంతో ఎక్కువ మంది ఓటీటీలో సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరిస్తున్నారు.. హారర్ థ్రిల్లర్ సినిమాలతో పాటుగా కామెడీ చిత్రాలు కూడా ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. సినిమాల కన్న ఎక్కువగా వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగా ప్రేక్షకాదారణ పొందుతూంటాయి. ఇప్పుడు మరో కామెడీ సిరీస్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ఓటీటీలోకి రాబోతుంది. ఆ వెబ్ సిరీస్ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
పేరు & ఓటీటీ..
ఈ కామెడీ వెబ్ సిరీస్ పేరు ‘సెరుప్పుగల్ జాకిరతై’.. సింగపులి ఈ సిరీస్‍లో లీడ్ పోషించారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. కామెడీ వెబ్ సిరీస్ లకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ప్రతి వెబ్ సిరీస్ మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ మధ్య సినీ లవర్స్ ఎక్కువగా ఓటీటీలో వస్తున్న సిరీస్ లను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కామెడీ వెబ్ సిరీస్ మార్చి 28వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ కామెడీ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‍ను జీ5 అధికారికంగా వెల్లడించింది. ఈ సిరీస్‍కు రాజేశ్ సుసైరాజ్ దర్శకత్వం వహించారు.. ఈ సిరీస్ లో సింగంపులితో పాటు వివేక్ రాజగోపాల్, ఐరా అగర్వాల్, మనోహర్, ఇంద్రజిత్, మాప్ల గణేశ్, ఉసైన్, సబిత, పళని, ఉతుమలై రవి ప్రత్యేక పాత్రల్లో నటించారు..
ఈ సోరి విషయానికొస్తే..
వజ్రాల వ్యాపారం అక్రమంగా చేసే వ్యాపారి పేరు రత్నం.. అతని గురించి పూర్తి వివరాలను తెలుసుకొని ఐటీ అధికారులు అతని ఇంటి పై దాడి చేస్తారు. అయితే అతను ఈ విషయాన్ని ముందే తెలుసుకొని అంటే ఈ కట్టుదిడ్డమైన ఏర్పాట్లు చేసుకొని ఉంటాడు. రైడ్ జరుగుతున్న సమయంలో ఒక వజ్రాన్ని తన షూలో దాచిపెడతాడు. ఆ షూని రైట్ చేస్తున్న ఒక ఆఫీసర్ వేసుకొని వెళ్లిపోతాడు. త్యాగరాజన్ అనే ఆడిటర్ వేసుకొని వెళతాడు. త్యాగరాజన్, అతడి కుమారుడు ఇలాంగో ఆ షూను పోగడతారు. ఆ షూను దొరికించుకునేందుకు రత్నం చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో కొన్ని ట్విస్టులు, మలుపులు స్టోరీ తిరుగుతుందో అన్ని సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. సెరుప్పుగల్ జాకిరతై సిరీస్‍లో ప్రధాన అంశాలుగా ఉంటాయి. కామెడీతో ఫన్‍గా, థ్రిల్లింగ్‍గా ఆ సిరీస్ సాగుతుంది.. ఈ సిరీస్ ట్రైలర్ అయితే ప్రేక్షకులను ఆకట్టుకుంది మరి ఓటీటీ లో రిలీజ్ అవుతున్న మొత్తం సిరీస్ ఎపిసోడ్ ఎలాంటి టాక్ నందుకు ఉంటుందో చూడాలి…
ఇటీవల ఓటీటీలో రిలీజ్ అవుతున్న వెబ్ సిరీస్ లకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.. తమిళ వెబ్ సిరీస్ కైతే మంచి డిమాండ్ ఉంది. ప్రేక్షకుల ఆసక్తిని బట్టి ఓటిటి సంస్థలు కూడా కొత్త కొత్త వెబ్ సిరీస్ లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు..