OTT Movie : ఓటిటిలో కొత్త కొత్త సినిమాలు, కావలసిన కంటెంట్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రేక్షకులు కూడా వీటిని బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక వ్యాపారవేత్త అమ్మాయి మోజులో పడి బిచ్చగాడిగా మారిపోతాడు. ఈ మూవీ చివరి వరకు సరదాగా సాగిపోతుంది. రీసెంట్ గానే ఓటీటీ లో ఈ మూవీని విడుదల చేశారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
టెంట్‌కొట్ట (Tentkotta) లో
ఈ ఫ్యామిలీ డ్రామా కామెడీ మూవీ పేరు ‘రాజకిలి’ (Rajakili). 2024 తమిళ భాషలో విడుదలైన ఈ మూవీకి ఉమాపతి రామయ్య దర్శకత్వం వహించారు. తంబి రామయ్య కథ, సంగీతం అందించారు. ఇందులో తంబి రామయ్య, సముద్రకని ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఒక ధనవంతుడైన వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనల చుట్టూ తిరిగే కథ. డిసెంబర్ 27, 2024 థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ మార్చి 14,2025నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ టెంట్‌కొట్ట (Tentkotta) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
మురుగప్ప సేంద్రాయర్ అనే ధనవంతుడైన ఒక వ్యాపారవేత్త పట్టిందల్లా బంగారం అవుతుంది. తక్కువ స్తాయి నుంచి ధన్యవంతుడిగా ఎదుగుతాడు. అతను దేవుడిని బాగా నమ్ముతాడు.అతనికి దేవానాయ్ అనే భార్య ఉంటుంది. ఆమెకు భర్త పై ఎప్పుడూ అనుమానం ఉంటుంది.వేరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడేమో అని అనుమానిస్తూ ఉంటుంది. ఆతరువాత ఒక రోజు ఇతని లైఫ్ లోకి ఒక అమ్మాయి వస్తుంది. అప్పటినుంచి ఇతని పతనం స్టార్ట్ అవుతుంది. ఇన్ని రోజులు చాలా పద్దతిగా ఉన్న మురుగప్ప ఒక్కసారిగా మారిపోతాడు. తన వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ లేకపోవడం వల్ల అతని సంపద, జీవనశైలి క్రమంగా క్షీణిస్తాయి. అతని జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. ఈ తప్పిదాలు అతన్ని మానసికంగా, శారీరకంగా బలహీనపరుస్తాయి.ఆ అమ్మాయికి కూడా మరొక అబ్బాయితో సంబంధం ఉంటుంది. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఒక రోజు హత్యకు గురి అవుతాడు. ఈ కేసు మురుగప్ప మీద వేయడానికి,కొంతమంది ప్రయత్నిస్తారు. ఇవన్నీ ఒక్కసారిగా పడటంతో, మురుగప్ప పిచ్చోడిగా మారి రోడ్లపై తిరుగుతుంటాడు.
అనందన్ అనే ఒక అనాథాశ్రమ నిర్వాహకుడు, వీధిలో ఒక బిచ్చగాడిగా మారిన మురుగప్పను చూసి, అతన్ని ఆశ్రమానికి తీసుకెళ్లి సంరక్షిస్తాడు. మురుగప్ప ఒక డైరీని దాచిపెడతాడు, దాన్ని అనందన్ చదివిన తర్వాత అతని గతం గురించి తెలుస్తుంది. అతని గురించి తెలుసుకున్నాక ఆ హత్య మురుగప్ప చేయలేదని తెలుసుకుంటాడు. అతనికి సహాయం చేయాలనుకుంటాడు. చివరికి అనందన్ మురుగప్పకు ఏవిధంగా సహాయం చేస్తాడు. అతన్ని మళ్ళీ మామూలు మనిషిని చేస్తాడా ? ఆ హత్య చేసింది ఎవరు? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ‘రాజకిలి’ (Rajakili) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ సినిమాలో మురుగప్ప పతనం తర్వాత అతను తన కర్మ ఫలితాలను ఎదుర్కొని, పశ్చాత్తాపంతో జీవితాన్ని సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఆడవాళ్ళ జోలికి పోకూడదని పెద్దలు ఊరికే చెప్పలేదు.