BigTV English

RCB VS KKR: బౌలింగ్ ఎంచుకున్న RCB…డేంజర్ ప్లేయర్లతో రంగంలోకి KKR

RCB VS KKR: బౌలింగ్ ఎంచుకున్న RCB…డేంజర్ ప్లేయర్లతో రంగంలోకి KKR

RCB VS KKR: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 టోర్నమెంట్‌ షురూ అయింది. కాసేపటి క్రితమే.. ఈ టోర్నమెంట్‌ కు ఫ్యాన్స్‌ ఘనంగా వెల్‌ కం చెప్పారు. అయితే… ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 టోర్నమెంట్‌ నేపథ్యంలో.. ఇవాళ తొలి మ్యాచ్‌ కు రంగం సిద్ధం అయింది.  ఇక ఇవాళ కోల్ కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైట్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు జట్ల మధ్య టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ రజిత్ పటిదార్ బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో కోల్ కత్తా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేయబోతుంది. అయితే ఇవాల్టి మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారుతుందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. కానీ సాయంత్రం వరకు వర్షం పూర్తిగా తేలిపోయింది. దీంతో ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన ఓపెనింగ్ సెర్మనీ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక మరికాసేపట్లోనే ఈ మ్యాచ్ కూడా ప్రారంభం కానుంది. జియో హాట్ స్టార్ లో ఈ మ్యాచ్లు ఉచితంగా చూడవచ్చు.


Also Read: Rohit Sharma – MS Dhoni: ధోనిని అవమానించిన రోహిత్… వీడియో వైరల్ !

కేకేఆర్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రికార్డులు


కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య… ఇప్పటివరకు 34 మ్యాచులు జరిగాయి. ఇందులో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు….. పై చేయి సాధించింది. 34 మ్యాచుల్లో బెంగళూరు పైన 20 మ్యాచ్లో విజయం సాధించింది కోల్కతా నైట్ రైడర్స్. అటు బెంగళూరు మాత్రం 14 మ్యాచుల్లో విజయం సాధించింది. అంటే దాదాపు 6 మ్యాచులు ఎక్కువగానే కేకేఆర్ విజయం సాధించింది. ఇవాల్టి మ్యాచ్లో కూడా బెంగళూరు పైన కోల్కతా నైట్ రైడర్స్ పై చేయి సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇక ఈ రెండు జట్ల మధ్య హైయెస్ట్ స్కోర్ 222. అది కూడా కోల్కత్తా నైట్ రైడర్స్ చేసిందే. ఆర్ సి బి 221 చేయడం జరిగింది. లోయస్ట్ పరుగులు ఒక్కసారి పరిశీలిస్తే… ఆర్సిబి 49 పరుగులు చేయగా… కేకేఆర్ 84 పరుగులు చేసింది. ఈ రెండు జట్ల మధ్య 2024 ఐపీఎల్ లో తలపడ్డాయి. అప్పుడు వరుసగా కోల్కత్తా నైట్ రైడర్స్ విజయం సాధించింది.

Also Read: SRH vs RR: హైదరాబాద్‌ లో భారీ వర్షాలు… SRH తొలి మ్యాచ్‌ రద్దు ?

కేకేఆర్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు:

 

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే(c), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్(w), రజత్ పాటిదార్(c), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×