OTT Movie : అమ్మాయిల్ని ఇష్టపడే విధానం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. కొంతమంది హార్ట్ ఫుల్ గా ఇష్టపడితే మరి కొంతమంది కేవలం పడక సుఖం కోసం ఇష్టపడతారు. ఇప్పుడు మనం చెప్పుకునే రొమాంటిక్ మూవీలో హీరో అందమైన అమ్మాయి ఉంటే చాలు డేటింగ్ కి వెళ్ళిపోతుంటాడు. ఒక వ్యక్తి హిప్నటైజ్ చేయడం వల్ల ఇతని జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
యూట్యూబ్ (Youtube) లో
ఈ హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘షాలో హాల్’ (Shallow Hal). గ్వినేత్ పాల్ట్రో, జాక్ బ్లాక్ నటించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి ఫారెల్లీ దర్శకత్వం వహించారు. ఇందులో ఒక వ్యక్తి అందమైన అమ్మాయిలను అనుభవించడానికి మాత్రమే లవ్ చేస్తాడు. అతడు ఒక సారి హిప్నటైజ్ చేయబడతాడు. ఆ తర్వాత 300-పౌండ్ల స్త్రీతో ప్రేమలో పడతాడు. ఆ తరువాత జరిగే సన్నివేశాలు సరదాగా ఉంటాయి. షాలో హాల్ నవంబర్ 9, 2001న 20వ సెంచరీ ఫాక్స్ ద్వారా థియేటర్లలో విడుదలైంది. $40 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కగా $141 మిలియన్లు వసూలు చేసింది. ఈ రొమాంటిక్ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో తన తండ్రి చెప్పిన మాటలను పట్టుకొని అమ్మాయిలతో కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే డేటింగ్ చేస్తుంటాడు. అందంగా ఉంటే చాలు మాటల్లో కలిపి డేటింగ్ పేరుతో ఎంజాయ్ చేసి వదిలేస్తుంటాడు. తన తండ్రి కూడా ఇతనికి ఇలాగే చెప్తాడు. సీరియస్ గా ఏ అమ్మాయిని ప్రేమించవద్దని, నచ్చితే ఎంజాయ్ చేయమని చెప్పి ఉంటాడు. చివరికి పెళ్లి కూడా మంచి షేప్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖ పడమంటాడు. అంతేగాని అమ్మాయిని ప్రేమించడం వంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్తాడు. హీరో కూడా అదే లైఫ్ కి అలవాటు పడతాడు. నచ్చిన అమ్మాయితో పని కానిస్తూ ఉంటాడు. ఒకసారి ఒక వ్యక్తితో హీరోకి పరిచయం అవుతుంది. హీరో మనస్తత్వం తెలిసి అతనికి హిప్నోటైజ్ చేస్తాడు ఆ వ్యక్తి. అప్పటినుంచి అందంగా లేని వాళ్లు కూడా ఇతనికి అందంగా కనపడుతుంటారు.
ఒక రోజు ఇతనికి ఒక 150 కిలోలకు పైగా బరువు ఉన్న అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె అందరి కళ్ళకు అందవికారంగా కనబడుతుంది. హీరోకి మాత్రం హిప్నోటైజ్ చేయడం వల్ల చాలా అందంగా కనపడుతుంది. అలా తనతో ప్రేమలో పడిపోతాడు హీరో. ఆ తర్వాత అతను ప్రేమిస్తున్నది అందమైన అమ్మాయిని కాదని తెలుసుకుంటాడు. అయితే అందం కన్నా ఆత్మ సౌందర్యం గొప్పదని కూడా తెలుసుకుంటాడు. ఆ తరవాత మరొక అందమైన అమ్మాయి హీరోతో క్లోజ్ గా మూవ్ అవుతుంది. అయితే హీరో మాత్రం హీరోయిన్ ని తలుచుకుంటూ ఉంటాడు. చివరికి హీరోకి అమ్మాయిల పిచ్చి పోతుందా? అందంగా లేకపోయినా హీరోయిన్ ను ఇష్టపడతాడా? వీళ్ళ ప్రేమ చివరికి ఏమవుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే, ‘షాలో హాల్’ (Shallow Hal) అనే ఈ రొమాంటిక్ మూవీని చూడండి.