WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( WPL 2025) నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫ్యాన్స్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. గత సీజన్ లో ఛాంపియన్ గా నిలిచిన రాయల్ చాలెంజర్స్ ఉమెన్స్ బెంగళూరు జట్టు… ఇంటికి పరిమితమైంది. ఎవరు ఊహించని విధంగా… ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. దీంతో షాక్ లోకి వెళ్లి పోయారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫ్యాన్స్. పురుషుల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు కప్పు కొట్టలేదని బాధపడుతున్న అభిమానులకు…టోర్నీ నుంచి నిష్క్రమించి మహిళల జట్టు షాక్ ఇచ్చింది.
Also Read: IND vs NZ Finals: నేడే న్యూజిలాండ్ తో ఫైనల్స్..కోహ్లీ డౌటే… టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి ?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ వర్సెస్ యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… చేతులెత్తేసింది. భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పోరాడి ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో యూపీ వారియర్స్ చేతిలో 12 పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓడిపోవడం.. జరిగింది. ఈ దెబ్బకు… టోర్నమెంట్ నుంచి వైదొలిగింది ఆర్సిబి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో పాటు యూపీ వారియర్స్ కూడా ఈ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ఐదు జట్లు పాల్గొంటే…. మూడు జట్లు ప్లే ఆఫ్ స్థానాన్ని సంపాదించుకున్నాయి. మిగిలిన రెండు జట్లు ఇంటి దారి పట్టాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్ లు ఆడి 5 విజయాలు సాధించి 10 పాయింట్లు సొంతం చేసుకుంది. ఈ తరుణంలోనే పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచి క్వాలిఫై అయింది. ఆ తర్వాత ఎనిమిది పాయింట్లు గెలుచుకున్న గుజరాత్… రెండో స్థానంలో నిలిచి… ప్లే ఆఫ్ కు వెళ్ళింది. మూడో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ కూడా ఎనిమిది పాయింట్లతో… ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకోగలిగింది.
Also Read: Memes on CT 2025 Final: టీమిండియా ఓడిపోవాలని కుట్రలు… అన్ని జట్లు ఏకమై ?
అయితే… యూపీ వారియర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు… చిట్ట చివర నిలిచి ఇంటి దారి పట్టాయి. ఈ రెండు జట్లు మొదటి నుంచి అట్టర్ ప్లాప్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ జట్టు ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు ఆడింది. మొదట్లో బ్రహ్మాండంగా ఆడింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. రెండు విజయాలు సాధించింది. కానీ ఏకంగా ఐదు మ్యాచ్ లలో ఓడిపోయింది. వరుస ఓటములతో కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే సాధించగలిగింది రాయల్ చాలెంజర్స్. దీంతో ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. ఇక ముంబై రెండు మ్యాచ్ లు, గుజరాత్ జెయింట్స్ ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన ఫలితాల ఆధారంగా నేరుగా ఫైనల్ వెళ్లే జట్టు.. తెలిసిపోతుంది. ఆ తర్వాత ఎలిమినేటర్ ఆడే జట్లు ఖరారు అవుతాయి. ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ వెళ్తుంది.