E-Paper
Advertisement

తల్లి మరణంతో ఊరు మారిన అమ్మాయి… ఆడపిల్లల వల్ల ఇంత పెద్ద సమస్యా ? అసలు గుట్టేంటి ?

తల్లి మరణంతో ఊరు మారిన అమ్మాయి… ఆడపిల్లల వల్ల ఇంత పెద్ద సమస్యా ? అసలు గుట్టేంటి ?
Advertisement

Romantic Movie: తల్లిని కోల్పోయిన తర్వాత తనకు పెద్దగా పరిచయం లేని తండ్రి దగ్గరకు వెళ్లాల్సి వస్తే ? కొత్త ఊరు… కొత్త స్కూల్… కొత్త మనుషుల మధ్య ఒంటరిగా మిగిలిపోయిన ఒక 17 ఏళ్ల అమ్మాయి జీవితంలోకి మరో అమ్మాయి ప్రవేశిస్తే ? మొదట స్నేహంగా మొదలైన ఆ పరిచయం క్రమంగా ఇద్దరి జీవితాలను మార్చేసే ప్రేమగా మారితే ? కానీ ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి వాళ్లిద్దరూ సిద్ధంగా ఉండరు. పైగా అప్పటికే ఒకరికి బాయ్‌ఫ్రెండ్ ఉండటం, చుట్టూ ఉన్నవాళ్ల ఆలోచనలు, చిన్న పట్టణంలో ఎదురయ్యే పరిస్థితులు… వాళ్ల బంధాన్ని మరింత క్లిష్టంగా మారుస్తాయి. ఇద్దరు టీనేజ్ అమ్మాయిల మధ్య ఏర్పడిన ఆ ప్రత్యేకమైన అనుబంధం ఎలాంటి పరిణామాలకు దారితీసింది ? చివరకు వాళ్లు తమ మనసులోని నిజాన్ని అంగీకరించగలిగారా ? అనే కథతో తెరకెక్కిన రొమాంటిక్ కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా ‘గర్ల్స్ లైక్ గర్ల్స్’ (Girls Like Girls). మరి ఈ సినిమా కథేంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? తెలుగులో ఉందా? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

2006 కాలం నాటి నేపథ్యంలో కథ సాగుతుంది. 17 ఏళ్ల కోలీ తన తల్లి మరణంతో ఒక్కసారిగా ఒంటరిగా మారిపోతుంది. చిన్నప్పటి నుంచి పెద్దగా దగ్గరగా లేని తన తండ్రి కర్టిస్ దగ్గర ఉండేందుకు ఆమె ఒరెగాన్‌లోని ఒక చిన్న పట్టణానికి వస్తుంది. తల్లిని కోల్పోయిన బాధ ఒకవైపు… పూర్తిగా కొత్త ప్రదేశంలో జీవితం ప్రారంభించాల్సిన పరిస్థితి మరోవైపు… కోలీ మౌనంగా మారిపోతుంది. కొత్త స్కూల్‌లో చేరిన కోలీకి కొంతమంది స్నేహితులు పరిచయం అవుతారు. ఆ గ్రూప్‌లో ఉన్న సోన్యా అనే అమ్మాయి కోలీకి క్రమంగా దగ్గరవుతుంది. ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడపడం మొదలవుతుంది. చిన్న చిన్న విషయాలు పంచుకోవడం, ఒకరి దగ్గర మరొకరు సంతోషంగా ఉండటం… ఇలా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. కానీ రోజులు గడిచేకొద్దీ అది సాధారణ స్నేహం కాదనే విషయం ఇద్దరికీ అర్థమవుతుంది.

Advertisement

కోలీ, సోన్యా మధ్య ఏర్పడిన అనుబంధం క్రమంగా మరింత బలపడుతుంది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా దగ్గరవుతారు. కానీ ఈ కొత్త ఫీలింగ్స్‌ను అర్థం చేసుకోవడం సోన్యాకు అంత సులభం కాదు. ఎందుకంటే అప్పటికే ఆమెకు ట్రెంట్టన్ అనే బాయ్‌ఫ్రెండ్ ఉంటాడు. ఒకవైపు తనకు అలవాటైన జీవితం… మరోవైపు కోలీతో ఏర్పడుతున్న కొత్త భావోద్వేగ బంధం… సోన్యాను అయోమయంలో పడేస్తాయి. మరోపక్క కోలీ కూడా తన మనసులోని ప్రేమను బయటకు చెప్పడానికి భయపడుతుంది. తాను అనుభవిస్తున్న భావాలను చుట్టుపక్కల వాళ్లు ఎలా చూస్తారో అనే సందేహం ఆమెను వెంటాడుతుంది. పైగా చిన్న పట్టణంలో ఇద్దరు అమ్మాయిల మధ్య ఏర్పడిన ఈ బంధం గురించి బయట ప్రపంచానికి తెలిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అనే భయం కూడా ఉంటుంది.

ఇప్పటికే తల్లిని కోల్పోయి జీవితంలో ఒక పెద్ద శూన్యాన్ని ఎదుర్కొంటున్న కోలీకి… సోన్యా పరిచయం కొత్త ఆశను ఇస్తుంది. కానీ అదే పరిచయం ఆమె జీవితంలో మరో పెద్ద పోరాటానికి కారణమవుతుంది. ట్రెంట్టన్‌కు వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి తెలిసిందా ? కోలీ, సోన్యా తమ భావాలను ఒకరికొకరు నిజాయితీగా చెప్పుకోగలిగారా ? బయట ప్రపంచం ఒత్తిడిని ఎదుర్కొని తమ ప్రేమను కాపాడుకోగలిగారా ? చివరకు కోలీ తన గతాన్ని వదిలి తనను తాను అంగీకరించి కొత్త జీవితాన్ని ప్రారంభించిందా ? అనేది ‘గర్ల్స్ లైక్ గర్ల్స్’ సినిమాలో చూడాల్సిన అసలు విషయం.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతోందా ?

Advertisement

స్నేహం, ప్రేమ, ఒంటరితనం వంటి భావోద్వేగ అంశాలతో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామాలో మాయా డి కోస్టా (Maya da Costa), మైరా మాలోయ్ (Myra Molloy), లెవాన్ హాక్ (Levon Hawke), జాక్ బ్రాఫ్ (Zach Braff) కీలక పాత్రల్లో నటించారు. హాలీవుడ్ సింగర్, దర్శకురాలు హేలీ కియోకో (Hayley Kiyoko) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆమెకు దర్శకురాలిగా తొలి సినిమా కావడం విశేషం. తన పాపులర్ మ్యూజిక్ ప్రాజెక్ట్, నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు సంగీతం పరంగా కూడా హేలీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ‘గర్ల్స్ లైక్ గర్ల్స్’ ప్రస్తుతం పీకాక్ (Peacock) ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రస్తుతం ఇంగ్లీష్ లోనే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదా తెలుగు సబ్‌టైటిల్స్ తో చూసే ఛాన్స్ లేదు.

Read Also: తల్లి కొడుకుల మధ్యే పవర్ వార్… సొంత కుటుంబంతోనే ఇంత పెద్ద వార్ ఏంట్రా బాబూ

Tags

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×