E-Paper
Advertisement

మంత్రి ప‌ద‌వి ఇచ్చేదాకా ఇదే తీరు..! ఇవ్వ‌డానికి చాన్సు లేదు.. కోమ‌టిరెడ్డి మారేదీ లేదూ!

మంత్రి ప‌ద‌వి ఇచ్చేదాకా ఇదే తీరు..! ఇవ్వ‌డానికి చాన్సు లేదు.. కోమ‌టిరెడ్డి మారేదీ లేదూ!
Advertisement

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జ‌రుగుతున్న అస‌మ్మ‌తి మాట‌ల‌ను బ్లాక్ మెయిల్ మాట‌లుగా చూడాలా? అనుకున్న‌వి నెర‌వేర‌న‌ప్పుడు.. ఇస్తామ‌నే ప‌ద‌వులు ఇవ్వ‌న‌ప్ప‌డు.. క‌నీసం ప‌ట్టింపు కూడా లేని త‌నం ఎక్కువైన‌ప్పుడు.. అంత‌కు మించి.. ప్ర‌భుత్వ ప‌ద‌వీకాలం స‌మీపిస్తున్న‌ప్పుడు..ఇలా కోమ‌టిరెడ్డిలు, చిన్నారెడ్డిలు, పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డిలు, విజ‌య‌శాంతులు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తారు. బాహాటంగా తిట్టేస్తారు. స‌ర్కార్‌ను బెదిరిస్తూ ఉంటారు.

వింటారా.. బెండ‌వుతారా? ఇస్తారా? చ‌స్తారా? అనే రీతిలో ఓపెన్‌గా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ముందే అది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వ‌స్తుందా? రాదా? అని చివ‌రి వ‌ర‌కూ వారికే న‌మ్మ‌కంలేని స్థితిలో వ‌చ్చిన అధికార పార్టీ. అందుకే అంద‌రికీ భారీ ఆశ‌లు. హామీల ఊసులు. మ‌ళ్లీ వ‌స్తామ‌నే ఆశ లేని ప‌రిస్థితులు. అందుకే ఇక ఒక్కొక్క‌రు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఇంకా వ‌స్తారు. అయితే ఇందులో సీనియ‌ర్‌గా మాత్రం కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డినే గుర్తించాలి. ఆయ‌న‌కు నిజంగానే మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.

Advertisement

ఇది క్లియ‌ర్‌. కానీ అక్క‌డ ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఇద్ద‌రున్నారు న‌ల్ల‌గొండ జిల్లా నుంచి. అందులో సొంత అన్న వెంక‌ట‌రెడ్డి కూడా. కానీ విన‌డం లేదు రాజ‌గోపాలుడు. త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే అంటున్నాడు అత‌డు. అప్పుడు హామీ ఇచ్చిన‌ప్పుడు తెలియ‌దా? ఇప్పుడే అన్న‌ద‌మ్ములు గుర్తొచ్చారా అని బాహాటంగానే నిలదీస్తున్నాడు. తిట్టాల్సినంత తిట్టి.. ప‌రువు బ‌య‌ట‌పెట్టి… త‌ను మాట్లాడే ప్ర‌తీది పార్టీ మంచి కోస‌మే అంటున్నాడు. పార్టీ మార‌బోన‌ని అంటూనే.. త‌న టీమ్‌కు టికెట్లు ఇప్పించుకుని ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటా.. రండి.. ఎవ‌రొస్తారో.. పైస‌ల సూటుకేసులు ప‌ట్టుకుని!అ ని రేవంతేనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు.

ఇక తాడోపేడో తేల్చుకోవాల‌నుకుంటున్నాడు. ఇక మంత్రి ప‌దవి ఇచ్చేదీ లేద‌ని తెలిసిపోయిన‌ట్టున్న‌ది. ఒక‌వేళ ఇప్పుడు మంత్రి ప‌ద‌వి వ‌స్తే.. ఈ మాట‌లుంటాయా? ఉండ‌వు క‌చ్చితంగా. మ‌రి ఇంత‌కు ముందే మంత్రి ప‌ద‌వి ఇచ్చి ఉంటే.. ఇప్పుడు మాట్లాడిన మాట‌లే కోమ‌టిరెడ్డి మాట్లాడి ఉండేవాడా? వంద‌శాతం లేదు అనే స‌మాధాన‌మే వ‌స్తుంది. అంటే .. ప‌ద‌వి ఇస్తే బారాఖూన్ మాఫ్ అన్న‌ట్టు.

Advertisement

ఎన్ని త‌ప్పులు చేసినా ఓకే అన్న‌ట్టు. లోపాలెన్ని ఉన్నా ప‌ద‌వి వ‌స్తే నోరు క‌ట్టేసుకోవాల‌న్న‌ట్టే క‌దా? పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డికీ అర్ధ‌మైపోయింది. ఇక నిధులు రావ‌ని. అందుకే ఎమోష‌న‌ల్ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. విజ‌య‌శాంతీ ఓ ప్ర‌య‌త్నం చేసింది. అస‌లు లా అండ్ ఆర్డ‌ర్ ఉందా? పోక్సో కేసుల్లో ఇంత నిర్ల‌క్ష్యంగా ఉంటారా? అని సీఎం వ‌ద్ద ఉన్న హోం మినిస్ట్రీ ప‌ద‌వినే ప్ర‌శ్నించింది.

ఇక చిన్నారెడ్డి చిన్న‌గా గ‌ళం విప్పాడు. కానీ ఘాటుగానే కొట్టాడు దెబ్బ‌. నేనూ జీవ‌న్‌రెడ్డి కావాల్సొస్తుంది.. కాస్కోండి అని నేరుగానే బెదిరించాడు. వాళ్ల‌కు కావాల్సిన చేస్తేస్తే, ఇవ్వాల్సినవి ఇచ్చేస్తే, చేయాల్సినవి చేసేస్తే బారాఖూన్ మాఫ్ అన్న‌ట్టు. కానీ వీళ్లు చేయరు. వాళ్లు బెదిరించ‌డం ఆప‌రు. బారాఖూన్ మాఫ్ ఉండ‌దు. ఇంకా ఆ సంఖ్య పెరుగుతూ ఉంటుంద‌న్నమాట‌.

Tags

Related News

తెలంగాణ‌పై మ‌ళ్లీ బీఎల్ సంతోష్ ప్ర‌యోగం.. మ‌రోసారి ఆర్గ‌నైజింగ్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వి! అధికారం కోసం ఇక‌ ప‌దునైన వ్యూహాలు..

రమ్మంటే రారెందుకు!? మాజీ సీఎంల‌కు అసెంబ్లీల ఆహ్వానం.. !

బెంగళూరు ఇంజనీర్ సంచలన ప్రయోగం.. రోడ్లపై గుంతలకు ఏఐ మాస్టర్ ప్లాన్!

బొగ్గు తవ్వకం లేకుండానే నేరుగా గ్యాస్.. బెల్లంపల్లిలో సింగరేణి సరికొత్త ప్రయోగం!

జర్మనీతో రూ. 70 వేల కోట్ల సబ్‌మెరైన్ ఒప్పందం.. ప్రత్యేకతలు ఇవే!

బాబోయ్.. ఆ ముగ్గురు మంత్రులను తట్టుకోలేం.. వాపోతున్న అధికారులు!

కేబీఆర్ పార్కు చుట్టూ ప్రయాణించే వారికి బిగ్ అలర్ట్: సీపీ సజ్జనార్!

Big Stories

Advertisement
×