E-Paper
Advertisement

మైదానంలో ధోని ఆడుగు పెట్టేట‌ప్పుడు చెవుల్లో నుంచి ర‌క్తం వ‌స్తుంది

మైదానంలో ధోని ఆడుగు పెట్టేట‌ప్పుడు చెవుల్లో నుంచి ర‌క్తం వ‌స్తుంది
Advertisement

Harshit Rana On Ms Dhoni:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007 సమయంలో టీమిండియా జట్టు సారధి బాధ్యతలు చేపట్టిన మహేంద్ర సింగ్ ధోని… దాదాపు పది సంవత్సరాలపాటు జట్టును ఏలాడు. ఈ క్రమంలో మూడు ఐసీసీ ట్రోఫీలు కూడా టీమ్ ఇండియాకు అందించాడు. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా ఐదు ట్రోఫీలు అందించిన ఘనత మహేంద్రసింగ్ ధోని సాధించాడు. అలాంటి మహేంద్ర సింగ్ ధోని (Ms Dhoni ) టీమిండియా కు రిటైర్మెంట్ ప్రకటించగా.. కేవలం ఐపిఎల్ మాత్రం ఆడుతున్నాడు. 40 ఏళ్ల వయసులో కూడా, రికార్డు స్థాయిలో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఏకైక క్రికెటర్ గా ధోని చరిత్ర సృష్టించాడు.

మైదానంలో ధోని ఆడుగు పెట్టేట‌ప్పుడు చెవుల్లో నుంచి ర‌క్తం వ‌స్తుంది

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోని గురించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది అతనికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం అతన్ని మెచ్చుకుంటూ ఉంటారు. మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు కూడా ధోనిని పొగిడిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రియ శిష్యుడు హర్షిత్ రాణా (Harshit Rana) కూడా మహేంద్ర సింగ్ ధోని పై షాకింగ్ కామెంట్స్ చేశారు. మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చేసేందుకు మైదానంలో అడుగుపెట్టేటప్పుడు జనాలు గట్టిగా అరుస్తారని వెల్లడించారు.

Advertisement

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

ఆ అరుపులకు చెవుల నుంచి రక్తం వస్తుందనే భయం ప్రత్యర్థి జట్టులో కచ్చితంగా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. తాను కూడా కేకేఆర్ జట్టు తరఫున ఆడి ఆ అనుభవాన్ని స్వయంగా ఫేస్ చేసినట్లు బాంబు పేల్చారు. అతడు మైదానంలో అడుగుపెట్టి మొదటి బంతి ఆడే వరకు.. పక్కన ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి ఫ్యాన్స్ తీసుకు వస్తారని ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సమయంలో స్టేడియంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉంటాయని వివరించారు. చెన్నై చెపాక్  ( Chennai Chepuk Stadium) వేదికగా మ్యాచ్ జరిగితే ఇక ఎల్లో ఫ్యాన్స్ అరుపులకు మనం తట్టుకోలేమన్నారు. ఇదే జోష్ ప్రతి స్టేడియంలో ఉంటుందన్నారు. ధోని ఒక్కడికే అన్ని ప్రతి రాష్ట్రంలో అభిమానులు ఉంటారని ప్రశంసల వర్షం కురిపించారు.

గంభీర్ ఫ్యాన్స్ సీరియస్

Advertisement

మహేంద్ర సింగ్ ధోనిని మెచ్చుకుంటూ హర్షిత్ రాణా స్టేట్మెంట్ ఇవ్వడంపై గౌతమ్ గంభీర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్ను టీమిండియాలోకి తీసుకువచ్చింది గౌతమ్ గంభీర్ అయితే, ధోనిని మెచ్చుకుంటావా ? అని నిలాదిస్తున్నారు. అన్నం పెట్టినోడికి నువ్వు వెన్నుపోటు పొడుస్తావా ? అంటూ నిలదీస్తున్నారు.

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

Related News

సగానికి పైగా నష్టాలు… PCBలో ఆర్థిక సంక్షోభం, ఇక దేవుడు కూడా కాపాడ‌లేడు

4 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేక‌పోయాం…పాకిస్తాన్ త‌ల తెగిన‌ట్టుగా ఉంది

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

బౌండ‌రీ ఆప‌డం చేత‌కాదా ? జ‌డేజాపై కెప్టెన్ గిల్ సీరియ‌స్

Big Stories

Advertisement
×