OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి డెత్ గేమ్ సినిమా ఒకటి ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమాలో గేమ్ స్కూల్ విద్యార్థుల చుట్టూ తిరుగుతుంది. ప్రతీ క్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ జపనీస్ మూవీలో స్కూల్ కి లేటుగా రావడంవల్ల ఈ గేమ్ ను టీచర్ మొదలుపెడతాడు. ఆ తరువాత అసలు స్టోరీ మొదలవుతుంది. చివరి వరకూ టెన్షన్ పెట్టిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ జపనీస్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘సిగ్నల్ 100’ (Signal 100). 2020 లో వచ్చిన ఈ సినిమాకి లిసా తకెబా దర్శకత్వం వహించారు. ఇందులో కన్నా హషిమోటో (రెనా కషిమురా), యూటా కోసెకి (సోటా ససాకి), తోషికి సెటో (హయాటో వాడా), షోమా కై, మసాకి నకావో, షిడో నకామురా (షిమోబె టీచర్) నటించారు. 2020 జనవరి 24న జపాన్‌లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా 1 గంట 28 నిమిషాల రన్ టైమ్‌తో, IMDbలో 5.5/10 రేటింగ్ ని కలిగి ఉంది. ఈసినిమాలో అత్యధిక గోర్, హింస, సైకలాజికల్ హారర్ ఎలిమెంట్స్ కారణంగా, ఇది ‘బాటిల్ రాయల్’, ‘ఆస్ ది గాడ్స్ విల్’వంటి డెత్ గేమ్ జానర్ చిత్రాలతో పోల్చబడుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ సినిమా ఒక రూరల్ జపనీస్ హైస్కూల్‌లోని 36 మంది విద్యార్థుల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు తమ కానీ కామ్ టీచర్ షిమోబె ద్వారా ఒక భయంకర డెత్ గేమ్‌లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఎంట్రీ ఒక విద్యార్థిని, రెనా కషిమురా క్లాస్‌కు ఆలస్యంగా రావడంతో ప్రారంభమవుతుంది. షిమోబె ఆమెకు ఒక CD ఇస్తాడు. దానిని మీడియా రూమ్‌లో ప్లే చేయమని చెబుతాడు. అక్కడ ఆమె క్లాస్‌మేట్స్ కూడా వెయిట్ చేస్తుంటారు. CDలోని హిప్నాటిక్ వీడియో, గ్రాఫిక్ ఇమేజెస్, సౌండ్స్‌తో నిండి ఉంటుంది. ఇది విద్యార్థులను సూసైడల్ హిప్నోసిస్‌లోకి నెట్టివేస్తుంది. వీడియో అయిపోయిన వెంటనే, ఒక విద్యార్థిని బాల్కనీ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఫోన్‌లు ఉపయోగించిన మరికొందరు విద్యార్థులు అదే విధంగా చనిపోతారు. ఫోన్ ఉపయోగించడం ఒక ‘సిగ్నల్’ అని తెలుస్తుంది. ఈ ‘సిగ్నల్’ వల్ల విద్యార్థులు చనిపోతుంటారు.
షిమోబె, తన ప్రతీకార పథకంలో భాగంగా, విద్యార్థులకు 100 సిగ్నల్స్ ఉన్నాయని, అవి ఆత్మహత్యను ట్రిగ్గర్ చేస్తాయని చెప్తాడు. ఆ సిగ్నల్స్‌లో కొన్ని 4 AM నుండి కొందరికి, 5 AM నుండి మరి కొందరిని ప్రభావితం చేస్తాయి. గేమ్ రూల్ లో భాగంగా, చివరిగా బతికి ఉన్న విద్యార్థి హిప్నోసిస్ నుండి విముక్తి పొందుతాడు. షిమోబె అందరికీ రూల్స్ వివరించిన తర్వాత, బాల్కనీ నుండి దూకి అతను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. విద్యార్థులను స్కూల్‌లో రాత్రిపూట ఒక ట్రాప్ లో వదిలిపెడతాడు. రెనా, స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ జస్టిస్‌తో ఉన్న అమ్మాయి, తన క్లాస్‌మేట్స్ సోటా ససాకి, ఒక కైండ్-హార్టెడ్ గోల్డెన్ బాయ్ తో కలిసి సిగ్నల్స్‌ను గుర్తించడానికి, గేమ్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే హయాటో వాడా అనే విద్యార్థి, లైబ్రరీ బుక్‌లో సిగ్నల్స్ గురించి కీలక సమాచారం తెలుసుకుని, ఇతరులను ఆత్మహత్యలకు ప్రేరేపించడం ద్వారా లాస్ట్ సర్వైవర్ కావడానికి కుట్రలు పన్నుతాడు. చివరికి ఈ డెత్ గేమ్ లో అందరూ చనిపోతారా ? ప్రాణాలతో బయటపడతారా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : ఒకే ఇంట్లో 13 సార్లు చావు… ఒళ్లు గగుర్పొడిచే సీన్స్… ఈ హర్రర్ మూవీలో సీన్ సీనుకూ గుండె జారిపోవాల్సిందే