BigTV English

OTT Movie : పొలిమేరలో ప్రాణాలు తీసే క్లబ్… ఐఎండీబీలో 8.2 రేటింగ్ ఉన్న జబర్దస్త్ థ్రిల్లర్ మూవీ

OTT Movie : పొలిమేరలో ప్రాణాలు తీసే క్లబ్… ఐఎండీబీలో 8.2 రేటింగ్ ఉన్న జబర్దస్త్ థ్రిల్లర్ మూవీ

OTT Movie : వాంపైర్ల స్టోరీలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ జోనర్లో వచ్చే సినిమాలు చేసే రచ్చ మామూలుగా ఉండదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాంపైర్ సినిమా, రీసెంట్ గా థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, ఓటీటీలో కూడా దుమ్ము లేపుతోంది. ఈ మూవీ స్టోరీ ఇద్దరు ట్విన్ బ్రదర్స్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది. అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

1932 లో మిస్సిస్సిప్పీ నదీ తీర ప్రాంతంలో ఈ స్టోరీ జరుగుతుంది. స్మోక్, స్టాక్ అనే కవల సోదరులు, మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికులుగా పని చేసి ఉంటారు. ఆ తర్వాత చికాగోలో ఒక క్రిమినల్ గ్యాంగ్‌లో కొంతకాలం ఉంటారు. ఇక ఈ బోరింగ్ లైఫ్ ను వదిలి, తమ జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటారు. వీళ్ళ తమ సొంత ఊరు మిస్సిస్సిప్పీలోని క్లార్క్స్‌డేల్‌కు తిరిగి వస్తారు. వీళ్ళు ఈ ప్రాంతంలో ఒక బార్ & రెస్టారెంట్ ను నడపాలని ప్లాన్ చేస్తారు. ఆ ఊరిలో ఉన్నవాళ్ళు సంగీత కార్యకలాపాలలో ఎక్కువగా ఆనందిస్తుంటారు. అయితే వీళ్ళు ఆ ఊరిలో వాంపైర్లు ఉన్నాయని తెలుసుకుంటారు. ఈ సమూహానికి రెమ్మిక్ అనే వాంపైర్ నాయకత్వం వహిస్తుంటాడు. రెమ్మిక్ సంగీతాన్ని ఆస్వాదిస్తూ, ఎక్కువ సమయం సంగీతంతో నే గడుపుతుంటాడు.


మరోవైపు స్మోక్, స్టాక్ లకు సమ్మీ మూర్ అనే ఒక సోదరుడు ఉంటాడు. అతని సంగీతానికి వాంపైర్లు చాలా అట్రాక్ట్ అవుతుంటారు. ఈ క్రమంలో నే ఈ ట్విన్ బ్రదర్స్ ఒక బార్ & రెస్టారెంట్ ని ఓపెన్ చేస్తారు. అయితే ఆ వాంపైర్లు బార్ & రెస్టారెంట్ పై దాడి చేయడానికి వస్తారు. ఇక వాటిని అడ్డుకోవడానికి ఆయుధాలను కూడా సిద్ధం చేసుకుంటారు ఈ ట్విన్ బ్రదర్స్. చివరికి ఈ ట్విన్ బ్రదర్స్ ఆ వాంపైర్లను ఎలా ఎదుర్కుంటారు ? అక్కడ బార్ & రెస్టారెంట్ ను నడపగలుగుతారా ? మ్యూజిక్ తో ఏమైనా మాయ చేస్తారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : సీను సీనుకో హార్రర్ సీన్… సూర్యరశ్మి పడితే కాలిపోయే పాప

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ అమెరికన్ మ్యూజికల్ హారర్ సినిమా పేరు ‘సిన్నర్స్’ (Sinners). దీనికి ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించారు. ఈ స్టోరీ 1932లో మిస్సిస్సిప్పీ డెల్టా ప్రాంతంలో జరుగుతుంది. ఇండలులో మైఖేల్ బి. జోర్డాన్ ద్విపాత్రాభినయంలో నటించారు. హైలీ స్టీన్‌ఫెల్డ్, జాక్ ఓ’కానెల్, వున్మి మోసాకు, డెల్రాయ్ లిండో వంటి నటులు సహాయ పాత్రల్లో నటించారు. ‘సిన్నర్స్’ 2025 ఏప్రిల్ 18 న వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ద్వారా, యునైటెడ్ స్టేట్స్‌లో థియేటర్‌లలో విడుదలైంది. ఈ మూవీ 2025 లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా రికార్డ్ కు ఎక్కింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×