OTT Movie : ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చినా, లవ్ స్టోరీ లేకుండా సినిమాలు రావట్లేదు. ప్రతి సినిమాలో ఏదో ఒక లవ్ స్టోరీ ఖచ్చితంగా ఉంటోంది. కొత్త కొత్త లవ్ స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు దర్శకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే లవ్ స్టోరీ మూవీ తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇందులో అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి ఒక అమ్మాయి ప్రేమను గెలవడానికి వ్యాపారవేత్తగా మారిపోతాడు. ఈ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
స్టోరీలోకి వెళితే
శివకుమార్ కాంచీపురంలోని ఒక పేరున్నచేనేత కుటుంబానికి చెందిన యువకుడు. వీళ్ళ పూర్వీకులు ఒకప్పుడు ఆలయాలకోసం, రాజుల కోసం చీరలు నేసే గొప్ప కుటుంబంగా ఖ్యాతిని సంపాదించుకుంటారు. కానీ కాలక్రమేణా ఆ కీర్తి క్షీణించింది. శివకుమార్ తాత వరదరాజన్, ఆ కుటుంబంలో చివరి చేనేత కళాకారుడుగా ఉంటాడు. ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి కష్టపడుతుంటాడు.శివకుమార్ మొదట్లో బాధ్యతారహితంగా, ఉద్యోగం లేకుండా గడుపుతుంటాడు. అతని తండ్రి గణేశన్ అతన్ని చెన్నైలోని తన సోదరుడు మురుగన్ దగ్గరకు పంపిస్తాడు. అక్కడ ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుని, వృద్ధిలోకి వస్తాడని అనుకుంటాడు. మురుగన్ బాగా డబ్బున్న వస్త్ర వ్యాపారి గా ఉంటాడు. చంద్రశేఖరన్ అనే సంపన్న కుటుంబానికి, మురుగన్ అల్లుడిగా ఉంటాడు.
అక్కడ శివకుమార్, చంద్రశేఖరన్ మేనకోడలు శ్రుతితో ప్రేమలో పడతాడు. అయితే వరదరాజన్, చంద్రశేఖరన్ మధ్య పాత వైరం ఉంటుంది. ఇది శివకుమార్, శ్రుతి సంబంధానికి అడ్డంకిగా మారుతుంది. అక్కడ అవమానం పడి మళ్ళీ ఇంటికి వస్తాడు శివకుమార్. కొన్ని సంఘటనల తర్వాత, శివకుమార్ చేనేత పరిశ్రమ ప్రాముఖ్యతను, తన కుటుంబం గత వైభవాన్ని గుర్తిస్తాడు. అతను తన తాతతో కలిసి చేనేత కళకు పూర్వ వైభవం తెస్తాడు. చంద్రశేఖరన్ వంటి పెద్ద వస్త్ర వ్యాపారులకు, పోటీ గా మారతాడు. చివరికి శివకుమార్, శ్రుతి లవ్ స్టోరీ ఏమౌతుంది ? వరదరాజన్ తో చంద్రశేఖరన్ కి ఉన్న వైరం ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : అడవిలో క్యాంపింగ్ కు వెళ్తున్నారా? ఈ మూవీ చూశాక పొరపాటున కూడా ఆ సాహసం చేయరు
జియో హాట్ స్టార్ (Jio hotstar) లో
ఈ తమిళ మ్యూజికల్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘శివకుమారిన్ శపథం’ (Sivakumarin Sabadham). 2021లో విడుదలైన ఈ సినిమాకు హిప్హాప్ తమిజా దర్శకత్వం వహించారు. ఇందులో హిప్‌హాప్ ఆది, రాహుల్, మాధురీ జైన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ స్టోరీ కాంచీపురంలోని ఒక చేనేత కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఇందులో హీరో ఒక చిన్న చేనేత వ్యాపారాన్ని, ఒక టెక్స్‌టైల్ మాగ్నెట్‌తో పోటీపడే విధంగా తీసుకెళ్తాడు. జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.