Inter Supplementary Hall Tickets: ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు ఇది బిగ్ అలర్ట్. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు రిలీజ్ చేశారు. దీంతో ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు అఫీషియల్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేదా విద్యార్థులు చదివిన కాలేజీకి వెళ్లి అయినా హాల్ టికెట్ తీసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
అఫీషియల్ వెబ్ సైట్: https://tgbie.cgg.gov.in/
ఈ నెల 22 నుంచి 29 వరకు ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ జరగనున్నట్లు అధికారులు చెప్పారు. ఎగ్జామ్స్ రెండు సెషన్ల వారీగా నిర్వహించున్నట్టు తెలిపారు. మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరగనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
కాగా, ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల 12వేల 724 మంది విద్యార్థులు అటెండ్ కానున్నారు. అందులో ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 2లక్షల 49వేల 032 మంది కాగా.. ఒకేషనల్ విద్యార్థులు 16వేల 994 మంది స్టూడెంట్స్ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే.. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో తొలి ఏడాదిలో ఫెయిల్ అయిన స్టూడెంట్ సంఖ్య 1.91 లక్షల మంది ఉన్నట్టు చెప్పారు.
Also Read: CISF Recruitment: సువర్ణవకాశం.. ఇంటర్ అర్హతతో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. జీతం రూ.81,100
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్‌లో మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్‌మెంట్ రాసేవారు 50 వేల మందికి పైగా ఉన్నారని వివరించారు. దీంతో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష రాసే విద్యార్థుల పెరిగినట్టు చెప్పారు. ఇక సెకండియర్ జనరల్ పరీక్షలకు 1లక్ష 34వేల 341 మంది విద్యార్థులు, ఒకేషనల్ పరీక్షలకు 12వేల 357 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పేర్కొన్నారు.
Also Read: AAI Recruitment: డిగ్రీ, బీటెక్‌తో ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు.. మంచి వేతనం, ఇంకా వారం రోజులే..!