OTT Movie : కొన్ని హాలీవుడ్ సినిమాలు గ్రిప్పింగ్ స్టోరీలతో ప్రేక్షకులకు ఊపురాడనీయకుండా చేస్తాయి. క్షణక్షణం ఉత్కంఠంగా ఈ సినిమాలు సెగలు పుట్టిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఒక జంట క్రూరమైన వేటగాళ్ల చేతిలోకి చిక్కుతారు. అక్కడ జరిగే సన్నివేశాలు చాలా భయంకరంగా ఉంటాయి. వీళ్ళకంటే దెయ్యాలే నయం అనిపిస్తుంది. సీను సీనుకూ ప్రేక్షకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. ఈ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
స్టోరీలోకి వెళితే
ఇయాన్,సామ్ అనే జంట చాలా సంతోషంగా జీవితం గడుపుతుంటారు. ఒక సారి న్యూ ఇయర్ వేడుకలను గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఈ జంట, ఒక అడవి ప్రాంతంలో ఉండే బీచ్ కి చేరుకుంటారు. అక్కడ సరదాగా గడుపుతున్నప్పుడు, వీళ్ళకు దగ్గరలోనే మరో టెంట్‌ను గమనిస్తారు. అయితే అందులో ప్రస్తుతానికి ఎవరూ ఉండరు. తర్వాత వీళ్ళకు ఆ ప్రాంతంలో చేదు అనుభవం ఎదురుపడుతుంది. ఆ ప్రాంతంలో ఒక గుర్తుతెలియని వ్యక్తిని, ఎవారో దారుణంగా చంపి ఉంటారు. కొత్త సంవత్సరం వేడుకలో, ఇంత దారుణం ఎవరు చేసిఉంటారో అని భయపడతారు.ఇంతలో అక్కడికి చూక్, జర్మ్ అనే ఇద్దరు స్థానిక వేటగాళ్లు వస్తారు. వీళ్ళు టూరిస్ట్ లతో దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఈ జంటని కూడా బెదిరింపులకు గురి చేస్తారు.
ఈ స్టోరీలో మరో కుటుంబం కూడా ఉంటుంది. ఖాళీ గా ఉన్న టెంట్ ను, వాళ్ళే ముందు వేసి ఉంటారు. వీళ్ళకి ఒక చిన్న బేబీ కూడా ఉంటుంది. ఆ వేటగాళ్ల చేతిలో వీళ్ళు దారుణంగా చిత్రహింసలను ఎదుర్కుంటారు. ఇప్పుడు సామ్, ఇయాన్ ను ఈ వేటగాళ్ళు టార్గెట్ చేస్తారు. ఈ జంట వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ సైకోలు సామ్ ని లైంగికంగా వేధించి, ఇయాన్‌ను చంపాలని చూస్తారు. ఈ విషయం తెలిసి ఈ జంట మరింత ఆందోళన చెందుతారు. చివరికి ఈ జంట ఆ వేటగాళ్ల నుంచి తప్పించు కుంటారా ? వాళ్ళ చేతిలో నరకం చూస్తారా ? ఆ సైకోలకు శిక్ష పడుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ఆస్ట్రేలియన్ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : వింత జంతువులుగా మారే మనుషులు… ఆ ఒక్కడికే ఎందుకు కనిపిస్తున్నారు?
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఆస్ట్రేలియన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కిల్లింగ్ గ్రౌండ్’ (Killing Ground). 2016 లో వచ్చిన ఈ మూవీకి డామియన్ పవర్ దర్శకత్వం వహించారు. ఇందులో ఇయాన్ మీడోస్, హ్యారియట్ డయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా స్టోరీ ఒక జంట ఇయాన్ (ఇయాన్ మీడోస్), సామ్ (హ్యారియట్ డయ్యర్), న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఒక అడవిలో క్యాంపింగ్‌కు వెళ్లడంతో మొదలవుతుంది. అక్కడ వీళ్ళు భయంకరమైన మనుషులతో పోరాడాల్సి వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.