BigTV English
Advertisement

OTT Movie : గ్యాంగ్ స్టర్ లనే పరుగులు పెట్టించే కామన్ మ్యాన్… ట్విస్ట్ లతో అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

OTT Movie : గ్యాంగ్ స్టర్ లనే పరుగులు పెట్టించే కామన్ మ్యాన్… ట్విస్ట్ లతో అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

OTT Movie : కొరియన్ సినిమాలకి, వెబ్ సిరీస్ లకి రోజు రోజుకి క్రేజ్ పెరిగిపోతోంది. వీటిని మన ప్రేక్షకులు ఎక్కువగా చూడటం మొదలుపెట్టారు. ఒకప్పుడు వీటి జోలికి వెళ్ళని మన ప్రేక్షకులు, కరోనా ప్రభావంతో ఇంట్లోనే ఉండటం వల్ల ఈ సిరీస్ లకు, సినిమాలకు బాగా అలవాటు పడ్డారు. ఓటిటి ప్లాట్ ఫామ్ లో కిక్ ఇచ్చే కొరియన్ కామెడీ యాక్షన్ మూవీ ఒకటి స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ ఫ్లెక్స్ (Netflix) లో

ఈ కొరియన్ యాక్షన్ కామెడీ మూవీ పేరు ‘స్నాచ్ అప్‘ (Snatch Up). 2018లో విడుదలైన స్నాచ్ అప్ అనే ఈ దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ మూవీకి హియో జున్-హ్యోంగ్ దర్శకత్వం వహించారు. తల్లి ఆపరేషన్ కోసం హీరో గ్యాంగ్ స్టర్ లతోనే పెట్టుకుంటాడు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లెక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో నిరుపేద కుటుంబంలో పుట్టి ఉంటాడు. అతనికి సరైన జాబ్ కూడా ఉండదు. ఈ క్రమంలోనే హీరో తల్లికి అనారోగ్యం తో హాస్పిటల్ లో జాయిన్ అవుతుంది. ఆమెకు ఆపరేషన్ చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. హీరో దగ్గర అంత డబ్బు లేకపోవడంతో బాధపడుతుంటాడు. తన కిడ్నీ ని కూడా అమ్మాలనుకుంటాడు. ఏమిచెయ్యలేక చివరికి సూసైడ్ చేసుకొని చనిపోవాలనుకుంటాడు. మరోవైపు ఒక పోలీస్ ఆఫీసర్ క్యాసినో ఆడి డబ్బులు పోగొట్టుకుంటాడు. చివరికి క్యాసినో ఆడి తన గన్ కూడా తాకట్టు పెట్టేస్తాడు. అయితే ఆ క్లబ్ ఓనర్ పైసలు ఇచ్చి గన్ తీసుకోమని పోలీస్ ఆఫీసర్ కి చెప్తాడు. ఆ తర్వాత అక్కడే పని చేసే పొలిటికల్ లీడర్ కి, ఎలక్షన్స్ కోసం కొంత డబ్బు కావాల్సి వస్తుంది. క్యాసినో నడిపే క్లబ్ ఓనర్ కి డబ్బు కావాలని చెప్తాడు. అయితే తన దగ్గర అంత డబ్బు లేదని క్యాసినో మేనేజర్ చెప్పడంతో, పొలిటికల్ లీడర్ అతనికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. డబ్బు ఇవ్వకపోతే నీ అంత చూస్తానని బెదిరిస్తాడు.

ఆ క్లబ్ ఓనర్ పొలిటికల్ లీడర్ ని చంపేయాలనుకుంటాడు. పోలీస్ ఆఫీసర్ తాకట్టు పెట్టిన గన్ ను ఒక కిల్లర్ కి పార్సిల్ పంపిస్తాడు. ఆ గన్ తో పొలిటికల్ లీడర్ ని చంపేయమంటాడు. ఆ గన్ పొరపాటున హీరో ఉండే ఇంటికి వస్తుంది. హీరో సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనను పక్కన పెడతాడు. ఆ గన్ తీసుకుని డబ్బులు సంపాదించాలనుకుంటాడు. చివరికి హీరో ఆ గన్ ద్వారా డబ్బులు సంపాదిస్తాడా? తన తల్లికి ఆపరేషన్ చేయిస్తాడా? హీరో మరి ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లెక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘స్నాచ్ అప్’ (Snatch Up) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

Big Stories

×