BigTV English

Anjali: నాకు అంతే చాలు.. ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ అనడంపై అంజలి కామెంట్స్

Anjali: నాకు అంతే చాలు.. ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ అనడంపై అంజలి కామెంట్స్

Anjali: ఈరోజుల్లో చాలావరకు సినిమాలు కామన్ ఆడియన్స్‌కు నచ్చినా కూడా నెగిటివ్ రివ్యూల వల్ల ఫ్లాప్ టాక్ అందుకుంటున్నాయి. అలా నెగిటివ్ రివ్యూల వల్ల ఎన్నో సినిమాలు ఫ్లాప్‌లుగా నిలిచాయి. దీనికి తాజా ఉదాహరణ ‘గేమ్ ఛేంజర్’. రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ చాలాకాలం వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలయిన వెంటనే సినిమా యావరేజ్ టాక్ మాత్రమే అందుకుంది. కానీ చాలావరకు నెటిజన్లు మాత్రం దీనిని ఫ్లాప్ అంటూ నెగిటివ్ రివ్యూలు వైరల్ చేశారు. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ అనడంపై ఇందులో హీరోయిన్‌గా నటించిన అంజలి రియాక్ట్ అయ్యింది.


ఫ్లాప్‌పై స్పందన

‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ, అంజలి నటించారు. ఈ సినిమాలో మొదటిసారి డ్యుయెల్ రోల్‌లో కనిపించాడు ఈ మెగా హీరో. అందులో ఒక పాత్రకు జోడీగా కియారా నటించగా.. ఫ్లాష్‌బ్యాక్‌లో పాత్రకు జోడీగా అంజలి నటించింది. చాలాకాలం తర్వాత అంజలి మరొక గుర్తుండిపోయే పాత్రలో కనిపించింది అంటూ చాలామంది తనపై ప్రశంసలు కురిపించారు. కానీ థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ఫ్లాప్ అని చాలామంది తేల్చేశారు. తాజాగా తను నటించిన ‘మదగజరాజ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న అంజలికి ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ అవ్వడంపై స్పందించమనే ప్రశ్న ఎదురవ్వగా తను ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


అదే నా బాధ్యత

‘‘ఒక యాక్టర్‌గా నా బాధ్యత ఏంటో అదే తీసుకోగలను. ఒక క్యారెక్టర్‌ను నన్ను నమ్మి డిజైన్ చేస్తున్నప్పుడు దానిని మనం ఎలా డెలివర్ చేస్తున్నాం, దానికోసం వంద శాతం కష్టపడుతున్నామా అనే విషయంతోనే యాక్టర్ పని ముగిసిపోతుంది. మూవీని ఆడించాలి అనేది మన తపన. దానికోసం ప్రమోషన్స్‌కు వెళ్లడం, ఆడియన్స్‌కు మూవీ గురించి చెప్పడం, మూవీ ఈ టైమ్‌కు రిలీజ్ అవుతుంది చూడండి అని చెప్పడం.. ఇవన్నీ చేస్తాం. ఇప్పుడు గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడాలంటే దానికి సెపరేట్ ఇంటర్వ్యూ పెట్టాలి. ఎందుకు అనే విషయం అందరికీ తెలుసు’’ అంటూ యాక్టర్‌గా ‘గేమ్ ఛేంజర్’కు తను పూర్తి న్యాయం చేశానని చెప్పుకొచ్చింది అంజలి.

Also Read: ఆ సీనియర్ హీరో సినిమాలో మాళవికా మోహనన్.. జాక్‌పాట్ కొట్టేసిందిగా.!

మంచి సినిమా అన్నారు

‘‘కొన్ని సినిమాలను పర్సనల్‌గా నమ్మి వాటికోసం కష్టపడతాం. నేను గేమ్ ఛేంజర్ కోసం 200 శాతం కష్టపడ్డాను. చాలామంది జనరల్ ఆడియన్స్ గేమ్ ఛేంజర్ చూసిన తర్వాత ఎవరూ సినిమా బాలేదని నాతో చెప్పలేదు. దానికి నేను సంతోషిస్తున్నాను. మంచి సినిమా అనే చెప్పారు. మంచి సినిమా అని చెప్పడం మంచి విషయం. సినిమా బాగుంది అనడం వేరు, మంచి సినిమా అనడం వేరు. గేమ్ ఛేంజర్ అనేది మంచి సినిమా, చాలా బాగా యాక్ట్ చేశారు అని చెప్పారు. అదే నాకు చాలా ఎక్కువ. మిగిలిన అన్నింటి గురించి మాట్లాడాలంటే అరగంట మాట్లాడుకోవాల్సిందే’’ అని తెలిపింది అంజలి (Anjali). ‘గేమ్ ఛేంజర్’లో అంజలి పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×