E-Paper
Advertisement

కార్పొరేట్ కంపెనీతో ఓ పల్లెటూరి కుర్రాడి ఫైట్… చివరికి ఏం జరిగిందంటే?

కార్పొరేట్ కంపెనీతో ఓ పల్లెటూరి కుర్రాడి ఫైట్… చివరికి ఏం జరిగిందంటే?
Advertisement

Social Comedy Drama: ఒక గ్రామం… వందల ఎకరాల పూర్వీకుల భూమి… వాటి మీద కన్నేసిన ఓ భారీ కార్పొరేట్ కంపెనీ. గ్రామస్తులంతా డబ్బు కోసం భూములు అమ్మేయడానికి సిద్ధపడితే… ఓ సాధారణ పల్లెటూరి కుర్రాడు మాత్రం కోట్లు ఇస్తామన్నా ఒక్క అంగుళం భూమి కూడా ఇవ్వనని మొండికేస్తే ? అతని ఒంటరి పోరాటం చివరకు ఊరంతా ఉద్యమంగా మారితే ? నవ్విస్తూనే మన భూమి, మన మూలాలు, మన ఊరి ఉనికి గురించి ఆలోచింపజేసే సోషల్ సెటైర్ కామెడీ డ్రామా ‘ఓయ్ భోలే ఓయ్ 2’. మరి ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు? తెలుగులో ఉందా? అసలు కథేంటి? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

పంజాబ్‌లోని ఓ అందమైన పల్లెటూరిలో భోలా అనే అమాయకమైన కుర్రాడు తన కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు. ఆ ఊరి ప్రజలకు వ్యవసాయ భూములే జీవనాధారం. తరతరాలుగా వస్తున్న ఆ భూములతోనే వాళ్ల కుటుంబాలు బతుకుతుంటాయి. కానీ ఆధునిక అభివృద్ధి పేరుతో ఆ గ్రామంపై ఓ భారీ కార్పొరేట్ సంస్థ కన్ను పడుతుంది. అక్కడ పెద్ద కమర్షియల్ ప్రాజెక్ట్ నిర్మించి, మొత్తం ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మార్చాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది.

Advertisement

గ్రామంలోని రైతులకు వారి భూములకు భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని కంపెనీ హామీ ఇస్తుంది. ఆఫర్ చూసి భోలా కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తుల్లో చాలామంది తమ పూర్వీకుల భూములను అమ్మడానికి సిద్ధపడతారు. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వస్తే జీవితాలు మారిపోతాయని భావిస్తారు. కానీ భోలా మాత్రం అందుకు పూర్తిగా వ్యతిరేకంగా నిలబడతాడు. ఎంత డబ్బు ఇస్తామన్నా తన పూర్వీకుల భూమిని మాత్రం అమ్మనని తేల్చి చెబుతాడు.

ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఒకవైపు తన కుటుంబ సభ్యులే భూమి అమ్మాలని ఒత్తిడి చేస్తుంటారు. మరోవైపు గ్రామంలోని వాళ్లు కూడా భోలాను మొండివాడిగా చూస్తారు. కానీ భోలా మాత్రం వెనక్కి తగ్గడు. తన భూమి కేవలం డబ్బు కోసం అమ్ముకునే ఆస్తి కాదని, అది తమ కుటుంబానికి, తమ ఊరికి ఉన్న గుర్తింపు అని భావిస్తాడు.

Advertisement

భోలాను దారిలోకి తీసుకురావడానికి కార్పొరేట్ కంపెనీ కూడా తన ప్రయత్నాలు మొదలు పెడుతుంది. డబ్బు, ఒత్తిళ్లు, రకరకాల కుతంత్రాలతో అతన్ని లొంగదీసుకోవాలని చూస్తుంది. అయితే భోలా మాత్రం తనదైన పల్లెటూరి తెలివితేటలతో వాటిని ఎదుర్కొంటాడు. కంపెనీ ప్రతినిధులను ఇబ్బందుల్లో పడేసే అతని అమాయకమైన ప్లాన్లు, ఊహించని సమాధానాలు కథలో మంచి కామెడీని పండిస్తాయి.

అయితే ఈ పోరాటం కేవలం భోలా, కంపెనీ మధ్య గొడవగా మిగలదు. కంపెనీ అసలు ఉద్దేశాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో గ్రామస్తులకు కూడా అసలు విషయం అర్థమవుతుంది. తమ భూములు అమ్ముకుంటే కేవలం పొలాలు మాత్రమే కాదు… తమ జీవన విధానం, సంస్కృతి, ఊరి ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉందని తెలుసుకుంటారు. దాంతో మొదట ఒంటరిగా పోరాడిన భోలా వెనుక ఒక్కొక్కరుగా గ్రామస్తులు నిలబడటం మొదలుపెడతారు. చివరకు భోలా మొదలుపెట్టిన చిన్న పోరాటం పెద్ద ఉద్యమంగా ఎలా మారింది? కార్పొరేట్ కంపెనీ వెనుక ఉన్న అసలు చీకటి అజెండా ఏంటి? తమ పూర్వీకుల భూములను, గ్రామం ఉనికిని భోలా ఎలా కాపాడుకున్నాడు? అనేదే మిగిలిన కథ.

స్ట్రీమింగ్ ఎక్కడ ?

జగ్‌జీత్ సంధు ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సౌమ్య, ధీరజ్ కుమార్, అమృత్ అంబి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సోషల్ డ్రామా, సిట్యుయేషనల్ కామెడీ కలగలిపిన ఈ సినిమాను చౌపాల్ (chaupal) ఓటీటీలో చూడవచ్చు. నవ్విస్తూనే భూమి విలువ, మన మూలాలను కాపాడుకోవాల్సిన అవసరం గురించి చెప్పడం ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత. పల్లెటూరి నేటివిటీతో కూడిన కామెడీ, సోషల్ మెసేజ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండడంతో సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూడవచ్చు. అయితే సినిమా తెలుగులో మాత్రం లేదు.

Read Also: గర్ల్ ఫ్రెండ్ తో బెస్ట్ ఫ్రెండ్ ప్రేమను చెడగొట్టాలని చూశాడు… చివరికి అతనే బుక్కయ్యాడు

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×